Garlic Tea: సాధారణంగా ఇప్పటి వరకూ అందరికీ అల్లం టీ, పుదీనా టీ, లెమన్ టీ గురించే తెలుసు. వెల్లుల్లి టీ గురించి చాలా తక్కువ మందికి తెలుసు. వెల్లుల్లి టీతో కలిగే ఆరోగ్య ప్రయోజనాలు తెలిస్తే ఇంకెప్పుడూ వదిలిపెట్టరు. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
రోజూ ఉదయం పరగడుపున వెల్లుల్లి టీ తాగితే ఆరోగ్యపరంగా చాలా ప్రయోజనాలున్నాయి. వాస్తవానికి వెల్లుల్లి టీ గురించి చాలామందికి తెలియదు. వెల్లుల్లి టీని ఇంట్లోనే చాలా సులభంగా తయారు చేసుకోవచ్చు. వెల్లుల్లి టీ తాగితే చాలా రకాల వ్యాధులు దూరమౌతాయి. ఇందులో యాంటీ వైరల్ గుణాలు చాలా ఎక్కువ. వెల్లుల్లి టీ తాగడం బ్లడ్ షుగర్ లెవెల్స్ నియంత్రణలో ఉంటాయి. వెల్లుల్లిలో యాంటీ వైరల్ గుణాలు ఎక్కువ. ఇందులొ కొద్దిగా అల్లం, దాల్చిన చెక్క కూడా జోడించవచ్చు. దీనివల్ల ఆరోగ్యం మరింత మెరుగుపడుతుంది. టీ రుచి పెరుగుతుంది.
వెల్లుల్లి టీ శక్తివంతమైన యాంటీ బయోటిక్ డ్రింక్. శరీరం ఇమ్యూనిటీని పెంచుతుంది. వెల్లుల్లి టీ తాగడం వల్ల బాడీ స్వెల్లింగ్ దూరమౌతుంది.వెల్లుల్లి టీ అనేది మధుమేహం వ్యాధిగ్రస్థులకు చాలా ప్రయోజనకరం. శరీరంలో బ్లడ్ షుగర్ లెవెల్స్ తగ్గిస్తుంది. దాంతోపాటు శరీరం మెటబోలిజం వృద్ధి చేస్తుంది.
వెల్లుల్లి టీ తాగడం వల్ల శరీరంలోని విష పదార్ధాలు, వ్యర్దాలు దూరమౌతాయి. అన్నింటికంటే ముఖ్యంగా వెల్లుల్లి టీతో బరువు తగ్గించుకోవచ్చు. వెల్లుల్లి టీ గుండె ఆరోగ్యాన్ని అద్భుతంగా మెరుగుపరుస్తుంది. వెల్లుల్లి టీ తాగడం వల్ల రక్త నాళాలు పరిశుభ్రమౌతాయి. చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తుంది. గుండెను ఇతర రోగాల్నించి కాపాడుతుంది. శ్వాస సంబంధిత సమస్యలకు వెల్లుల్లి టీ సరైన పరిష్కారం. జ్వరం, జలుబు వంటివి తగ్గుతాయి.
వెల్లుల్లి టీ తయారీ ఎలాగో ఇప్పుడు తెలుసుకుందాం. ముందుగా ఓ గిన్నె తీసుకుని అందులో కొద్దిగా నీళ్లు పోసి ఉడకబెట్టాలి. ఆ తరువాత అందులో క్రష్ చేసిన వెల్లుల్లిని వేయాలి. మరోసారి ఉడకబెట్టాలి. కొద్దిగా నల్ల మిరియాల పౌడర్ వేసి కాస్సేపు ఉడికించాలి. చివరిగా వడపోసి రోజు ఉదయం పరగడుపున తాగుతుండాలి. రుచి కోసం అవసరమైతే అల్లం, దాల్చిన చెక్క కొద్దిగా కలపవచ్చు.
Also read: Strong Bone tips: మీ డైట్‌లో ఈ 9 పదార్ధాలుంటే చాలు, వృద్ధాప్యంలో సైతం మీ ఎముకలు ఉక్కులా ఉంటాయి
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook