Saturn Transit 2023: ఈ రాశులవారిపై 18 నెలల పాటు శని వరాల జల్లు..వీరికి డబ్బే..డబ్బు

Saturn Transit 2023: శని సంచారం కారణంగా కొన్ని రాశులవారికి ఈ సమయం శుభ ప్రదంగా మారబోతోందని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. దీంతో పాటు కొన్ని రాశులవారు అనుకున్న పనులు సులభంగా చేయగలుగుతారు.

Written by - ZH Telugu Desk | Last Updated : Aug 26, 2023, 09:17 AM IST
Saturn Transit 2023: ఈ రాశులవారిపై 18 నెలల పాటు శని వరాల జల్లు..వీరికి డబ్బే..డబ్బు

 

Saturn Transit 2023: శని గ్రహాన్ని చాలా మంది చెడు గ్రహంగా భావిస్తారు. కానీ జ్యోతిష్య శాస్త్రం ప్రకారం..శని గ్రహానికి ప్రత్యేక ప్రాముఖ్య ఉంది. ఈ గ్రహం సంచారం చేసినప్పుడు వ్యక్తుల జాతకాల్లో శుభ స్థానంలో ఉంటే వ్యక్తి గత జీవితంలో చాలా రకాల ప్రయోజనాలు కలుగుతాయని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. అయితే శని గ్రహం కదలికలు అన్ని గ్రహాలకు భిన్నంగా ఉంటాయి. శని మొత్తం 12 రాశుల సంచారం చేయడానికి దాదాపు 29.5 సంవత్సరాలు పడుతుంది. దాదాపు 18 నెలల తర్వాత శనిగ్రహం కుంభరాశి నుంచి మీనరాశిలోకి సంచారం చేయబోతోంది. అయితే ఈ క్రమంలో కొన్ని రాశులవారు చాలా రకాల లాభాలు పొందుతారని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. రాబోయే 18 నెలలు ఏయే రాశులవారు ఎలాంటి ప్రయోజనాలు పొందబోతున్నారో ఇప్పుడు మనం తెలుసుకుందాం.

ఈ రాశులవారిపై శని వరాల జల్లు కురిపించబోతున్నాడు:
వృషభ రాశి:

శని గ్రహం సంచారంతో వృషభ రాశివారికి చాలా శుభప్రదంగా ఉంటుంది. వీరు 18 నెలల పాటు శుభ ఫలితాలను పొందుతారని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. ఈ రాశివారు శని దేవుడి అనుగ్రహంతో ఆర్థికంగా బలపడే అవకాశాలు కూడా ఉన్నాయి. దీంతో పాటు ఎప్పటి నుంచో ఆర్థిక సమస్యలతో బాధపడేవారికి ఈ సమయంలో ఉపశమనం లభిస్తుంది. వ్యాపారాలు చేసేవారికి ఇది సరైన సమయంగా భావించవచ్చు. ఈ సమయంలో పెట్టుబడులు పెట్టేవారు రెట్టింపు లాభాలు పొందుతారు. 

మేష రాశి:
కుంభరాశి రాశి నుంచి శని గ్రహం మీన రాశిలోకి సంచారం చేయడం వల్ల మేష రాశివారిపై కూడా ప్రత్యేక ప్రభావం పడుతుందని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. ఈ సమయంలో మీరు ఆర్థికంగా పురోగతిని పొందే అవకాశాలు కూడా ఉన్నాయి. అంతేకాకుండా గతంలో నిలిచిపోయిన పనులు కూడా సులభంగా జరుగుతాయి. సామాజికంగా ప్రతిష్ట రెట్టింపు అయ్యే ఛాన్స్‌ ఉంది. దీంతో పాటు ఈ రాశివారికి కొత్త ఉద్యోగావకాశాలు లభిస్తాయి. 

Also Read: Pakistan Bad Fielding Video: యు ఫన్నీ.. సింపుల్ రనౌట్ మిస్ చేసిన పాక్ ఫీల్డర్లు.. ఇలా ఉన్నారంటేరయ్యా..!  

తుల రాశి:
శని దేవుడి అనుగ్రహం తుల రాశివారిపై కూడా పడుతుందని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు.  రాశి వారికి 2025 సంవత్సరం వరకు అనుకూల ఫలితాలు లభిస్తాయి. అంతేకాకుండా ఆర్థిక సమస్యలు కూడా తొలగిపోయే అవకాశాలు కూడా ఉన్నాయని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. వ్యాపారాలు చేసేవారు ఈ సమయంలో పెట్టుబడులు పెట్టడం మంచిది. అనారోగ్య సమస్యలతో బాధపడేవారికి ఈ సమయంలో ఉపశమనం లభిస్తుంది. 

సింహ రాశి:
ఈ రాశివారికి 2025 వరకు సమయం చాలా శుభప్రదంగా ఉంటుందని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. శనిదేవుడి అనుగ్రహం వల్ల మీరు అన్ని రంగాలలో అనుకూల ఫలితాలు పొందుతారు. ఈ సమయంలో ఎలాంటి పనులు చేసిన సులభంగా విజయాలు సాధిస్తారు. దీంతో పాటు ఉద్యోగాలు చేసేవారు పదోన్నతులు లభించడమే కాకుండా జీతాలు కూడా పెరుగుతాయి. 

Also Read: Pakistan Bad Fielding Video: యు ఫన్నీ.. సింపుల్ రనౌట్ మిస్ చేసిన పాక్ ఫీల్డర్లు.. ఇలా ఉన్నారంటేరయ్యా..!  

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News