Top 5 Batsmen With Most Runs In An Asia Cup Edition: ఆసియా కప్ 2023కు ముహూర్తం దగ్గరపడుతోంది. ఈ నెల 30వ తేదీ నుంచి పాకిస్థాన్-నేపాల్ మధ్య పోరుతో టోర్నీ ఆరంభంకానుంది. సెప్టెంబర్ 2న పాకిస్థాన్‌తో టీమిండియా తొలి మ్యాచ్‌లో తలపడనుంది. ఆసియా కప్‌లో ఒక ఎడిషన్‌లో అత్యధిక పరుగులు చేసిన టాప్-5 ప్లేయర్లపై ఓ లుక్కేయండి.
శ్రీలంక బ్యాటింగ్ దిగ్గజం జయసూర్య 2008 ఆసియా కప్‌లో 75.60 సగటు,స్ట్రైక్ రేట్ 126తో 378 పరుగులు చేశాడు. ఇందులో ఒక సెంచరీ, ఒక అర్ధసెంచరీలు ఉన్నాయి.
భారత మాజీ మిడిల్ ఆర్డర్ బ్యాటర్ రైనా 2008 ఆసియా కప్‌లో 372 రన్స్ చేశాడు. ఇదులో 2 సెంచరీలు, 2 అర్ధసెంచరీలు ఉన్నాయి.
టీమిండియా స్టార్ బ్యాట్స్‌మెన్ విరాట్ కోహ్లీ 2012 ఆసియా కప్‌లో 3 మ్యాచ్‌లలో 357 పరుగులు చేశాడు. సగటు 119 కాగా స్ట్రైక్ రేట్ 102గా ఉంది. 2 సెంచరీలు, ఒక హాఫ్ సెంచరీ బాదాడు.
2008లో ఆసియా కప్‌లో 5 మ్యాచ్‌ల్లో నజఫ్‌గఢ్ నవాబ్, మాజీ డాషింగ్ ఓపెనర్ సెహ్వాగ్ 69.60 సగటు, 143.80 స్ట్రైక్ రేట్‌తో 348 పరుగులు చేశాడు.
శ్రీలంక మాజీ కెప్టెన్ కుమార సంగక్కర 2008 ఆసియా కప్‌లో 6 మ్యాచ్‌ల్లో 345 పరుగులు చేశాడు. సగటు 57.50 ఉండగా.. స్ట్రైక్ రేట్ 99.13గా ఉంది.