Offers on Domestic Flight Tickets: మీరు విమానంలో ప్రయాణించడానికి ప్లాన్ చేస్తున్నట్లయితే.. ఎయిర్ ఇండియా గుడ్‌న్యూస్ తీసుకువచ్చింది. స్పైస్‌జెట్ తరువాత.. ఇప్పుడు టాటా గ్రూప్ ఎయిర్‌లైన్స్ ఎయిర్ ఇండియా బంపర్ ఆఫర్‌ను తీసుకొచ్చింది. ఈ ఆఫర్ కింద తక్కువ ధరకే టికెట్లు బుక్ చేసుకునే అవకాశం కల్పిస్తోంది. టిక్కెట్ బుకింగ్‌పై 30 శాతం తగ్గింపును ప్రకటించింది. ఈ విషయాన్ని కంపెనీ ట్వీట్ ద్వారా వెల్లడించింది. మీకు ఇష్టమైన గమ్యస్థానానికి విమానంలో తక్కువ ధరకే ప్రయాణించవచ్చని ఎయిర్ ఇండియా వెల్లడించింది. ఈ ఆఫర్‌లో ఆగస్టు 20వ తేదీ వరకు టికెట్లను బుక్ చేసుకోవచ్చని తెలిపింది.
కంపెనీ వెబ్‌సైట్, యాప్ ద్వారా ప్రయాణికులు టికెట్లను బుక్ చేసుకోవచ్చని ఎయిర్ ఇండియా తెలిపింది. అయితే షరతులను అమలవుతాయని పేర్కొంది. 1470 రూపాయలతో టిక్కెట్లు బుక్ చేసుకోవచ్చని వెల్లడించింది. దేశీయ, అంతర్జాతీయ రూట్లలో కంపెనీ 96 గంటల విక్రయాన్ని ప్రారంభించింది. ఇందులో ఎకానమీ క్లాస్ కోసం ప్రయాణికులు రూ.1470కి బుక్ చేసుకోవచ్చు. దీంతో పాటు బిజినెస్ క్లాస్ టికెట్ బుకింగ్ రూ.10,130 నుంచి ప్రారంభమవుతుంది.
మీరు ఈ ఆఫర్ కింద ఆగస్టు 17వ నుంచి ఆగస్టు 20 వరకు టికెట్లను బుక్ చేసుకోవచ్చు. ఇది కాకుండా మీరు ఈ ఆఫర్ కింద టిక్కెట్ల బుకింగ్‌పై 1 సెప్టెంబర్ 2023 నుంచి 31 అక్టోబర్ 2023 వరకు ప్రయాణించవచ్చు.
ఎయిర్ ఇండియాతో పాటు స్పైస్‌జెట్ కూడా ఈ సమయంలో టిక్కెట్లను చౌకగా బుక్ చేసుకునే అవకాశాన్ని కల్పిస్తోంది. స్పైస్‌జెట్ ప్రయాణికుల కోసం ఇండిపెండెన్స్ డే సేల్‌ను తీసుకొచ్చిన విషయం తెలిసిందే. ఇందులో మీరు కేవలం రూ.1515తో మీ విమాన ప్రయాణ టిక్కెట్‌ను బుక్ చేసుకోవచ్చు. ఈ ఆఫర్ కింద కూడా మీరు ఆగస్టు 20 వరకు టిక్కెట్లను బుక్ చేసుకోవచ్చు. ఈ టికెట్ మొత్తంలో అన్ని పన్నులతో కలిపి టికెట్ ధరలను నిర్ణయించింది. దీంతో కేవలం రూ.1515కే ఇష్టమైన సీటును ఎంచుకోవచ్చు. దీంతో పాటు రూ.2000 టికెట్ వోచర్ కూడా లభిస్తుంది.
Also Read: New LTC Rules: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు ముఖ్యగమనిక.. ఈ 3 రూల్స్‌లో మార్పులు
Also Read: Bank Holidays: పెరగనున్న బ్యాంకు సెలవులు, త్వరలో వారానికి 5 రోజుల పని విధానం
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి