IRCTC Ticket Scam: ఐఆర్‌సీటీసీలో టికెట్ క్యాన్సిల్‌కు ప్రయత్నిస్తే రూ.4 లక్షలు ఫట్..! ఎలాగంటే..?

IRCTC Fraud Alert: ఐఆర్‌సీటీసీలో టికెట్ క్యాన్సిలేషన్ పేరుతో సైబర్ నేరగాళ్లు రూ.4 లక్షలు దోచేశారు. కేరళకు చెందిన ఓ వృద్ధుడికి మాయ మాటలు చెప్పి.. మొబైల్‌ను హ్యాక్ చేశారు. వెంటనే అకౌంట్‌ మొత్తం ఖాళీ చేసేశారు. పూర్తి వివరాలు ఇలా..   

Written by - Ashok Krindinti | Last Updated : Aug 13, 2023, 05:38 PM IST
IRCTC Ticket Scam: ఐఆర్‌సీటీసీలో టికెట్ క్యాన్సిల్‌కు ప్రయత్నిస్తే రూ.4 లక్షలు ఫట్..! ఎలాగంటే..?

IRCTC Fraud Alert: ప్రజలు ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నా.. సైబర్ నేరగాళ్లు మాత్రం కొత్త కొత్త మార్గాల్లో దోచుకుంటున్నారు. తాజాగా ఐఆర్‌సీటీసీలో టికెట్ క్యాన్సిల్ చేయబోయి.. సైబర్ నేరగాళ్లు ఉచ్చులో పడిపోయి 78 ఏళ్ల వృద్ధుడు రూ.4 లక్షలు పోగొట్టుకున్నాడు. కేరళలో ఈ సంఘటన చోటు చేసుకుంది. పూర్తి వివరాలు ఇలా.. కోజికోడ్ వండిపేటకు చెందిన ఎం.మహమ్మద్ బషీర్ అనే వృద్ధుడు ప్రయాణం కోసం ఐఆర్‌సీటీసీ వెబ్‌సైట్‌లో టికెట్ బుక్ చేసుకున్నాడు. అయితే తన జర్నీ ప్లాన్ మారిపోవడంతో టికెట్ క్యాన్సిల్ చేద్దామని ఐఆర్‌సీటీసీలో ప్రయత్నించాడు. ఈ క్రమంలో అతని మొబైల్ నంబరుకు గుర్తు తెలియని వ్యక్తి నుంచి కాల్ వచ్చింది.

రైల్వే అధికారిగా అవతలి వ్యక్తి పరిచయం చేసుకున్నాడు. ఇంగ్లిష్, హిందీలో అనర్గళంగా మాట్లాడుతూ.. రైల్వే టికెట్ క్యాన్సిల్ కోసం 'రెస్ట్ డెస్క్' అనే మొబైల్ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకునేలా బషీర్‌ను ఒప్పించాడు. మోసగాడి మాటలు నమ్మిన బషీర్‌ తన స్మార్ట్‌ఫోన్‌లో 'రెస్ట్ డెస్క్' యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకున్నాడు. కేటుగాడు చెప్పినట్లు చేశాడు.

ఇక అంతే క్షణాల్లో బషీర్ మొబైల్‌ను కేటుగాళ్లు హ్యాక్ చేశారు. సేవింగ్స్ ఖాతా నుంచి డబ్బు విత్‌డ్రా చేసినట్లు వెంటనే నోటిఫికేషన్ వచ్చింది. దీంతో బషీర్ వెంటనే బ్యాంకుకు వెళ్లి.. ఫిర్యాదు చేయగా తన ఫిక్స్‌డ్ డిపాజిట్ నుంచి రూ.4 లక్షలు విత్‌డ్రా అయినట్లు బ్యాంక్ సిబ్బంది తెలిపారు. వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు. నాలుగు వేర్వేరు లావాదేవీల్లో కేటుగాళ్లు డబ్బులను విత్ డ్రా చేసినట్లు గుర్తించారు. 

మొదటిసారి డబ్బులు విత్ డ్రా అయినప్పుడే బషీర్ బ్యాంకుకు వెళ్లి ఫిర్యాదు చేసేందుకు ప్రయత్నించగా.. సైబర్ నేరగాళ్లు వివిధ నంబర్ల నుంచి కాల్ చేస్తూ అడ్డుకున్నారు. దీంతో భయపడిపోయిన బషీర్ తన ఫోన్‌ను మొత్తం ఫార్మాట్ చేశాడు. అయినా అప్పటికే ఖాతా ఖాళీ అయిపోయింది. సైబర్ మోసగాళ్లను బెంగాల్, బీహార్ రాష్ట్రాలకు చెందిన వారితో సంబంధాలున్నట్లు అధికారులు అనుమానిస్తున్నారు. నకిలీ మొబైల్ యాప్‌లను నమ్మి మోసపోవద్దని ఐఆర్‌సీటీసీ హెచ్చరించిన కొద్ది రోజుల్లోనే బషీర్ మోసపోయాడు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. 

Also Read: Bhola Shankar: భోళా శంకర్ పెద్ద రాడ్డు.. టీమిండియాదే వరల్డ్ కప్.. ఇదేక్కడి సెంటిమెంట్ మావా బ్రో..!  

Also Read: Hakimpet Sports School Incident: అవసరమైతే ఉరి తీయిస్తాం.. లైంగిక వేధింపులపై మంత్రి శ్రీనివాస్ గౌడ్ సీరియస్   

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి 

Trending News