How To Control High Bp: అధిక రక్తపోటు సులభంగా కంట్రోల్‌ చేసే సులభమై టిప్స్‌ ఇవే!

How To Control High Bp: అధిక రక్తపోటుకు ప్రధాన కారణం..అనారోగ్యకరమైన ఆహారాలు అతిగా తినడమేనని నిపుణులు చెబుతున్నారు. అయితే ఇలాంటి సమస్యలతో బాధపడేవారు తప్పకుండా ఈ కింది ఆహారాలకు దూరంగా ఉండాల్సి ఉంటుంది. 

Written by - Dharmaraju Dhurishetty | Last Updated : Aug 4, 2023, 02:48 PM IST
How To Control High Bp: అధిక రక్తపోటు సులభంగా కంట్రోల్‌ చేసే సులభమై టిప్స్‌ ఇవే!

 

High Bp Control Home Remedies: అధిక రక్తపోటుకు వైద్యులు ఇప్పటికీ శాశ్వత నివారణ కనుగొనలేదు. సాధారణ రక్తపోటు 120/80 కంటే ఎక్కవగా ఉంటే తీవ్ర దీర్ఘకాలిక వ్యాధుల బారిన పడే అవకాశాలు ఉన్నాయి. అధిక రక్తపోటుతో ప్రారంభమై గుండెపోటు సమస్యలతో పాటు మధుమేహం వంటి తీవ్ర అనారోగ్య సమస్యలు వస్తాయి. అయితే ఈ హై బిపి సమస్యకు ఎలాంటి ఔషధాలు లేకపోయిన కొన్ని చిట్కాలు పాటించడం వల్ల సులభంగా ఈ సమస్యల నుంచి సులభంగా ఉపశమనం లభిస్తుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అంతేకాకుండా జీవనశైలిలో మార్పులు చేర్పులు కూడా చేసుకోవాల్సి ఉంటుంది. 

హైబీపీ ఉన్నవారు వీటిని తినొచ్చా?:
మసాలాలు:

ప్రతి రోజు కారంగా ఉన్న ఆహారాలు తీసుకోవడం చాలా హానికరని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. తరచుగా మసాలా కలిగి ఆహారాలు తీసుకోవడం వల్ల రక్తపోటు సమస్యలు వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి. అయితే ఇప్పటికే రక్తపోటు సమస్యలతో బాధపడేవారు తక్కువ మసాలాలు కలిగిన ఆహారాలు తీసుకోవాల్సి ఉంటుంది. 

తీపి పదార్థాలు:
షుగర్ పేషెంట్లు తప్పకుండా తీపి పదార్థాలకు దూరంగా ఉండాల్సి ఉంటుంది. లేకపోతే అధిక రక్తపోటు సమస్యలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. అంతేకాకుండా ఊబకాయం సమస్యలు కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. 

Also Read: AP Politics: చంద్రబాబుతో మంచు మనోజ్ దంపతుల కలయిక, మతలబు అదేనా

ప్యాకెట్ ఫుడ్:
హై బ్లడ్ ప్రెషర్ సమస్యలతో బాధపడేవారు ప్యాక్డ్ ఫుడ్స్‌కు దూరంగా ఉండాల్సి ఉంటుంది. అధికంగా సోడియం కలిగిన ఆహారాలు తీసుకోవడం వల్ల తీవ్ర రక్తపోటు సమస్యలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. 

కెఫీన్:
అధిక రక్తపోటు సమస్యలతో బాధపడేవారు తప్పకుండా కెఫిన్‌ కలిగిన డ్రింక్స్‌కి దూరంగా ఉండాల్సి ఉంటుంది. లేకపోతే తీవ్ర అనారోగ్య సమస్యలతో పాటు అధిక రక్తపోటు సమస్యలు కూడా రావచ్చని నిపుణులు చెబుతున్నారు. కాబట్టి ఇప్పటికే బిపి సమస్యలతో బాధపడేవారు కాఫీ, సోడాకి దూరంగా ఉండాల్సి ఉంటుంది.

ఉప్పు:
అధిక రక్తపోటు సమస్యలతో బాధపడుతున్నవారు అతిగా ఉప్పు కలిగిన ఆహార పదార్థాలు తీసుకుంటూ ఉంటారు. అయితే ఇలాంటి సమస్యలతో బాధపడేవారు తప్పకుండా అతిగా ఉప్పు కలిగిన ఆహారాలకు దూరంగా ఉండాల్సి ఉంటుంది. లేకపోతే అధిక రక్తపోటు, గుండె సంబంధిత సమస్యలు రావచ్చని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. 

(నోట్‌: ఇక్కడ ఇవ్వబడిన సమాచారం ఇంటి నివారణలు, సాధారణ సమాచారంపై ఆధారపడి ఉంటుంది. దానిని స్వీకరించే ముందు తప్పనిసరిగా వైద్య సలహా తీసుకోవాలి. ZEE NEWS దానిని ధృవీకరించలేదు.)

Also Read: AP Politics: చంద్రబాబుతో మంచు మనోజ్ దంపతుల కలయిక, మతలబు అదేనా

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News