BJP Office Bearers List: వచ్చే లోక్‌సభ ఎన్నికలకు బీజేపీ రంగం సిద్ధం చేసుకుంటోంది. బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా తన టీమ్‌ను ప్రకటించారు. శనివారం పార్టీ కేంద్ర ఆఫీస్ బేరర్ల జాబితాను ఆయన విడుదల చేశారు. కొత్త, పాత ముఖాలతో తన జట్టును సమన్వయం చేశారు. తెలంగాణ నుంచి రాష్ట్ర మాజీ అధ్యక్షుడు బండి సంజయ్‌కు ప్రమోషన్ ఇచ్చారు. జాతీయ ప్రధాన కార్యదర్శిగా నియమించారు. ఛత్తీస్‌గఢ్ మాజీ సీఎం రమణ్ సింగ్, రాజస్థాన్ మాజీ సీఎం వసుంధర రాజే జాతీయ ఉపాధ్యక్షులుగా నియమితులయ్యారు. బండి సంజయ్‌తోపాటు సునీల్ బన్సాల్, గోరఖ్‌పూర్ మాజీ ఎమ్మెల్యే రాధామోహన్ అగర్వాల్ కూడా ప్రధాన కార్యదర్శిగా ప్రమోషన్ కొట్టేశారు. 2022 అసెంబ్లీ ఎన్నికల్లో అగర్వాల్‌కు అసెంబ్లీ టిక్కెట్ దక్కలేదు. ఇప్పుడు జాతీయ జట్టులో చోటు కల్పించడం విశేషం.
జనరల్ సెక్రటరీలుగా కైలాష్ విజయ్ వర్గీయ, తరుణ్ చుగ్, వినోద్ తావ్డే, అరుణ్‌సింగ్‌లకు మళ్లీ అవకాశం కల్పించారు. అదేవిధంగా ఉత్తర ప్రదేశ్‌కు చెందిన ఎంపీలు రేఖా వర్మ, లక్ష్మీకాంత్ బాజ్‌పాయ్, ఎమ్మెల్సీ తారిఖ్ మన్సూర్‌లకు ఉపాధ్యక్షుల జాబితాలో చోటు దక్కింది. ఇటీవల బీజేపీ చేరిన కాంగ్రెస్ సీనియర్ నేత ఏకే ఆంటోనీ తనయుడుడు అరుణ్ ఆంటోనీని జాతీయ కార్యదర్శిగా నియమించారు. ఏపీ ఇంఛార్జ్ సునీల్ దేవధర్ జాతీయ టీమ్ నుంచి తొలగించారు. సీటీ రవి, దిలీప్ సైకియాలను కూడా ప్రధాన కార్యదర్శి పదవులను నుంచి తప్పించారు.
బీజేపీ జాతీయ ఉపాధ్యక్షులు
==> రమణ్ సింగ్ - ఛత్తీస్‌గఢ్
==> వసుంధర రాజే - రాజస్థాన్
==> రఘుబర్ దాస్ - జార్ఖండ్
==> సౌదాన్ సింగ్ - మధ్యప్రదేశ్
==> వైజయంత్ పాండా - ఒడిశా
==> సరోజ్ పాండే - ఛత్తీస్‌గఢ్
==> రేఖా వర్మ - ఉత్తరప్రదేశ్
==> డీకే అరుణ్ - తెలంగాణ
==> ఎమ్ చౌబా ఏఓ- నాగాలాండ్
==> అబ్దుల్లా బుద్ది - కేరళ
==> లక్ష్మీకాంత్ బాజ్‌పాయ్ - ఉత్తరప్రదేశ్
==> లతా ఉసెండి - ఛత్తీస్‌గఢ్
==> తారిఖ్ మన్సూర్ - ఉత్తరప్రదేశ్
జాతీయ ప్రధాన కార్యదర్శులు
==> సంజయ్ బండి - తెలంగాణ
==> అరుణ్ సింగ్ - ఉత్తరప్రదేశ్
==> కైలాష్ విజయవర్గి - మధ్యప్రదేశ్
==> దుష్యంత్ కుమార్ గౌతమ్ - ఢిల్లీ
==> తరుణ్ చుగ్ - పంజాబ్
==> వినోద్ తావ్డే - మహారాష్ట్ర
==> సునీల్ బన్సాల్ - రాజస్థాన్
==> రాధా మోహన్ అగర్వాల్ - ఉత్తరప్రదేశ్
भाजपा राष्ट्रीय अध्यक्ष श्री @JPNadda ने निम्नलिखित केंद्रीय पदाधिकारियों के नामों की घोषणा की है- pic.twitter.com/0aaArxHF30
— BJP (@BJP4India) July 29, 2023
Also Read: BRO Twitter Review: బ్రో ట్విట్టర్ రివ్యూ.. పబ్లిక్ టాక్ ఇదే.. పవన్ స్టామినాకు తగ్గట్లే..!
Also Read: Kishan Reddy: ట్యాంక్‌బండ్‌ను కొబ్బరినీళ్లతో నింపుతామన్నారుగా.. ఏమైంది కేసీఆర్..?: కిషన్ రెడ్డి
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి