Constipation: ఇటీవలి కాలంలో చాలామంది మలబద్ధకం సమస్యతో ఇబ్బంది పడుతున్న పరిస్థితులున్నాయి. దీనికి కారణం ఒక్కటే. చెడు ఆహారపు అలవాట్లు, చెడు జీవనశైలి. దురదృష్టవశాత్తూ మనం మలబద్ధకం సమస్యను తేలిగ్గా తీసుకుంటుంటాం. కానీ ఇది ఏ మాత్రం సరైన పద్దతి కాదంటున్నారు ఆరోగ్య నిపుణులు.
మలబద్ధకాన్ని ఎప్పుడూ ఓ సాధారణ సమస్యగా భావించకూడదంటారు వైద్యులు. అదే దీర్ఘకాలంగా బాధిస్తుంటే మరీ ప్రమాదకరం. గంభీరమైన వ్యాధికి కారణం కావచ్చు. మనిషి మానసిక ఆరోగ్యం అనేది నేరుగా కడుపు ఆరోగ్యంతో సంబంధం కలిగి ఉంటుంది. దీనినే గట్ బ్రెయిన్ కనెక్షన్ అంటారు. మలబద్ధకం అనేది డిమెన్షియాకు దారితీయవచ్చు. ఇటీవల కొన్ని అధ్యయనాల్లో మలబద్దకానికి సంబంధించి ఆసక్తి కల్గించే అంశాలు వెలుగు చూశాయి. మలబద్ధకం అనేది కేవలం మీ కడుపు ఆరోగ్యానికి సంబంధించిందే కాకుండా..మానసిక సామర్ధ్యానికి సంబంధించి కూడా ఉంటుంది. అల్జీమర్స్ అసోసియేషన్ ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ నిర్వహించిన ఓ అధ్యయనం ప్రకారం మలబద్ధకం కేవలం కడుపుకే కాకుండా కాగ్నిటివ్ ఫంక్షన్ అంటే బ్రెయిన్, బాడీపై ప్రబావం చూపిస్తుంటుంది.
మలబద్ధకం మెదడు పనితీరును ప్రభావితం చేయడమంటే ఆలోచన, నిర్ణయం తీసుకునే సామర్ధ్యాన్ని కోల్పోయే ప్రమాదముంది. మలబద్ధకం దీర్ఘకాలం కొనసాగితే మీ మానసిక సామర్ధ్యం 73 శాతం పడిపోవచ్చని తెలుస్తోంది. మలబద్ధకం అనేది బ్రెయిన్-బాడీ మధ్య బ్యాలెన్స్‌కు ఆటంకం కల్గించవచ్చు. మలబద్ధకం సమస్య తీవ్రంగా ఉంటే మానసిక స్థితి కూడా ప్రభావితం కావచ్చు. ఫలితంగా ఒత్తిడి, డిప్రెషన్, డిమెన్షియా ముప్పు పెరుగుతుంది.
రోజుకు ఒకసారి టాయ్‌లెట్‌కు వెళ్లేవారితో పోలిస్తే రోజుకు 2 లేదా అంతకంటే ఎక్కువసార్లు వెళ్లేవారిలో ముప్పు ఎక్కువగా ఉంటుంది. కడుపు-మెదడు మధ్య కనెక్షన్ అనేది చాలా కీలకమైంది..ముఖ్యమైనది. దీనినే గట్ బ్రెయిన్ యాక్సిస్ అంటారు. ప్రేవుల్ని మస్తిష్కంతో జోడిస్తుంది. మలబద్ధకం సమస్య కొనసాగితే మానసిక ఆరోగ్యానికి సంబంధించిన సమస్యలు, గ్యాస్ట్రో ఇంటెస్టైనల్ సమస్యలు, ఎసిడిటీ, స్వెల్లింగ్, అజీర్తి, మలబద్ధకం వంటివి తలెత్తుతాయి.
దీర్ఘకాలిక మలబద్ధకం, డిమెన్షియాకు మధ్య సంబంధం శాస్త్రీయంగా స్పష్టం కాలేదింకా. వాస్తవానికి క్రానిక్ మలబద్ధకం అనేది ఓ సాదారణ సమస్యే. ఇందులో వ్యక్తి ప్రేవుల్లో జీర్ణ సమస్య ఏర్పడుతుంది. డిమెన్షియా అనేది ఓ మానసిక వ్యాది. ఇందులో జ్ఞాుపకశక్తి, భాష, కార్యదక్షత, సాధారణ సామర్ధ్యం తగ్గిపోతుంది. డిమెన్షియాకు చాలా కారణాలున్నాయి. అర్జీమర్ రోగం, పార్కిన్సన్ రోగం, రక్త ప్రవాహాన్ని అడ్డుకునే వ్యాధులు ఉత్పన్నం కావచ్చు.
మలబద్ధకం లక్షణాలు
బౌల్ మూమెంట్ తగ్గడం, మలం గట్టిగా ఉండటం లేదా చిన్న చిన్నగా రావడం, కడుపు ఉబ్బిపోవడం, మలం రానట్టుగా ఉండటం, ఉదయం టాయ్‌లెట్‌లో ఎక్కువసేపు గడపడం, ఆకలి తగ్గడం, వాంతులు వచ్చేట్టు ఉండటం, నోటి రుచి తగ్గడం ప్రదానమైన లక్షణాలు. ఈ లక్షణాలు కన్పించినప్పుడు తక్షణం వైద్యుని సంప్రదించాల్సి ఉంటుంది. హెల్తీ ఫుడ్ తీసుకోవాలి. తీసుకునే ఆహారంలో ఫైబర్ ఎక్కువగా ఉండేట్టు చూసుకోవాలి. నీళ్లు ఎంత ఎక్కువగా తాగితే అంత మంచిది. రోజూ తగినంత వ్యాయామం చేయాలి. ఒత్తిడిని తగ్గించుకోవాలి. మలబద్ధకం సమస్య దీర్ఘకాలం కొనసాగకుండా చూసుకోవాలి.
Also read: Kidney Problems: ఫిట్‌గా కన్పిస్తున్నా కిడ్నీ సమస్యలు వెంటాడుతున్నాయా. కారణాలివే
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook