Vastu Tips: వాస్తు శాస్త్రం ప్రకారం ఇళ్లు ఎలా ఉండాలి, ఏ దిశలో ఉండాలనే వివరాలతో పాటు ఇంట్లో ఏ వస్తువులు ఎక్కడుండాలనే అంశాలు కూడా పూర్తిగా ఉన్నాయి. ఇంట్లో వస్తువులు ఎలా ఏ రీతిలో ఉండాలనేది కూడా ఉంది. వాస్తు ప్రకారం కొన్ని రకాల వస్తువులు ఎలా ఉండాలనేది ప్రాధాన్యత సంతరించుకుంటుంది. ఆ వివరాలు మీ కోసం..
వాస్తుశాస్త్రం ప్రకారం ఇంట్లో కొన్ని రకాల వస్తువులు ఎలా ఉండాలనే ప్రస్తావన ఉంది. వాస్తు ప్రకారం ఇంట్లో అద్దం పగిలితే చాలా అర్ధాలుంటాయి. అద్దం పగలడం వల్ల ఇంటి కుటుంబసభ్యులకు పెద్ద సమస్య వచ్చి పడుతుంది. కానీ ఇంట్లో ఏదైనా అద్దం పగిలితే రానున్న రోజుల్లో కష్టాలు ఎదురౌతాయని సంకేతముంటుంది. గాజు వస్తువులు లేదా అద్దాలు పగలడం అనేది వాస్తుశాస్త్రంలో శుభ, అశుభ పరిణామాలు ఎదురౌతాయి. ఏదైనా దారుణ ఘటన జరగవచ్చని అర్ధం. ఇంట్లో అద్దం పగిలితే శుభం జరుగుతుందని అర్ధం. పొరపాటున అద్దం పగలగొడితే మీ ఇంట్లోంచి చెడు పోయి మంచి వస్తుందని అర్ధం.
ఏది ఎలా ఉన్నా అత్యధికులు మాత్రం పగిలిన అద్దాన్ని శుభంగా భావిస్తారు. దీనివల్ల మీ జీవితంలో శుభ పరిణామాలు జరుగుతాయని అర్ధం. ఇది కాకుండా రానున్న కాలంలో ఆర్ధిక పరిస్థితుల్లో మెరుగుదల వస్తుందని అర్ధం. ఇంట్లో ఒకవేళ కిటికీ లేదా గుమ్మం అద్దం పగిలితే లేదా బీటలు వారితే వాస్తు ప్రకారం అది అపశకునం కానేకాదు. వాస్తు ప్రకారం ఇంట్లో ఏదైనా శుభవార్త రావచ్చు లేదా డబ్బులు అందవచ్చు.
వాస్తుశాస్త్రం ప్రకారం ఇంట్లో అద్దం హఠాత్తుగా పగిలితే దానర్ధం ఆ ఇంట్లో వచ్చే కష్టం తొలగిపోయినట్టే. అయితే పగిలిన అద్దాన్ని వెంటనే శుభ్రం చేసి బయట పాడేయాలి. ఇంట్లో ఏదైనా అద్దం లేదా గాజు పగిలితే దానిపై రాద్ధాంతం చేయకుండా ఆ పగిలిన ముక్కల్ని వెంటనే శుభ్రం చేసి పాడేయాలి. వాస్తుశాస్త్రం ప్రకారం అద్దాన్ని కొనుగోలు చేసేటప్పుడు ఇంట్లో గోళాకారం లేదా ఓవెల్ ఆకారం అద్దం కొనవద్దు. ఈ విధమైన ఆకారం కలిగిన అద్దాలు ఇంట్లోని పాజిటివ్ ఎనర్జీని నెగెటివ్ ఎనర్జీగా మారుస్తుందని అర్ధం. అందుకే ఇంట్లో దీర్ఘ చతురస్రాకారపు అద్దాన్నే వినియోగించేలా జాగ్రత్తలు తీసుకోవాలి.
Also read: Mars Transit 2023: ఆగస్టు 18 వరకు ఈ రాశులవారి జీవితాలు ఇలాగే ఉంటాయి, ఇందులో మీ రాశి కూడా ఉందా?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook