Guava Benefits: జామపండ్ల హెల్త్ బెనిఫిట్స్‌ తెలిస్తే.. అవి ఎక్కడున్నా వెళ్లి కొనుగోలు చేసి తినడం ఖాయం!

Guava Amazing Health Benefits: తరచుగా తీవ్ర అనారోగ్య సమస్యలతో బాధపడేవారు ప్రతిరోజు రెండు జామకాయలను తినడం వల్ల శరీరానికి చాలా రకాల ప్రయోజనాలు కలుగుతాయి. ముఖ్యంగా డయాబెటిస్తో బాధపడుతున్న వారు ప్రతి రోజు తినడం వల్ల రక్తంలోని చక్కెర పరిమాణాలు నియంత్రణలో ఉంటాయి.

Written by - Dharmaraju Dhurishetty | Last Updated : Jul 25, 2023, 08:46 PM IST
Guava Benefits: జామపండ్ల హెల్త్ బెనిఫిట్స్‌ తెలిస్తే.. అవి ఎక్కడున్నా వెళ్లి కొనుగోలు చేసి తినడం ఖాయం!

 

Guava Amazing Health Benefits: సాధారణంగా మనం రోడ్లపై అమ్ముతున్న జామకాయలను తరచుగా కొనుక్కొని తింటూ ఉంటాం. మరి కొంత మంది తక్కువ ధరలో లభిస్తాయని వాటిని కొనుగోలు చేసేందుకు ఎక్కువగా ఆసక్తి చూపరు అయితే ఇలాంటి వారికోసం మేము ఈరోజు జామపండు లో దాగి ఉన్న ఆయుర్వేద గుణాలను తెలియజేయబోతున్నాం. జామ పండ్లు చాలా తక్కువ రేట్లలో లభిస్తాయి కాబట్టి ఎక్కువగా మిడిల్ క్లాస్ పీపుల్ కొనుక్కొని తింటూ ఉంటారు. ఇందులో ఉన్న బోలెడు లాభాలు తెలిస్తే వీటిని ఎక్కడున్నా కొనుక్కొని తింటారని ఆయుర్వేద నిపుణులు తెలుపుతున్నారు. 

సాధారణంగా జామకాయల్లో శరీరానికి కావలసిన చాలా రకాల పోషకాలు ఉంటాయి వీటిని తినడం వల్ల శరీరానికి బోలెడు లాభాలు కలుగుతాయి. 100 గ్రాముల జామలో 50 గ్రాముల క్యాలరీలు లభిస్తాయి. ప్రతిరోజు రెండు జామకాయల చొప్పున తింటే తీవ్ర అనారోగ్య సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది. అంతేకాకుండా ఇందులో ఉండే ఫైబర్ డయాబెటిస్‌తో బాధపడుతున్న వారికి చాలా సహాయపడుతుంది. ఈ వ్యాధితో బాధపడుతున్న వారు ప్రతిరోజు రెండు జామకాయలు తింటే రక్తంలోని చక్కర పరిమాణాలు నియంత్రణలో ఉంటాయి. ఉంటాయి.

Also Read: IND vs WI Highlights: ఒక్క బంతి పడలేదు.. వరుణుడి ఖాతాలోకి విజయం.. రెండో టెస్టు డ్రా  

తరచుగా జామకాయలు తినేవారు షుగర్ వ్యాధి బారిన పడకుండా ఉంటారని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు. జామలో ఉండే ఫైబర్ జీర్ణ క్రియ సమస్యల నుంచి కూడా సులభంగా ఉపశమనం కలిగిస్తుంది. అంతేకాకుండా రోగ నిరోధక శక్తిని పెంచి సీజనల్ వ్యాధుల బారిన పడకుండా సహాయపడుతుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. వానాకాలంలో తరచుగా అనారోగ్య సమస్యలతో బాధపడేవారు తప్పకుండా ఈ పండ్లను తీసుకోవాల్సి ఉంటుంది.

ప్రస్తుతం థైరాయిడ్ సాధారణ సమస్యగా మారింది చిన్న పెద్ద తేడా లేకుండా అందరూ ఈ వ్యాధి బారిన పడుతున్నారు. అయితే ఇలాంటి సమస్యలతో బాధపడేవారు జామ పండు లో ఉన్న గుజ్జును తినడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు. అంతేకాకుండా దగ్గు దమ్ము సమస్యల నుంచి కూడా సులభంగా ఉపశమనం లభిస్తుందని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు. 

Also Read: IND vs WI Highlights: ఒక్క బంతి పడలేదు.. వరుణుడి ఖాతాలోకి విజయం.. రెండో టెస్టు డ్రా  

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News