Chronic Fatigue Syndrome: కొంతమందికి తరచూ తీవ్రమైన అలసట ఎదురౌతుంటుంది. ఈ లక్షణం ఎంత సాధారణమో ఒక్కోసారి అంతే ప్రమాదకరం కూడా. ఒక్కొక్కసారి ఈ లక్షణం ఓ గంభీరమైన వ్యాధి లక్షణం కావచ్చు కూడా. షాకింగ్ ఉన్నా వాస్తవం ఇదే. పూర్తి వివరాలు మీ కోసం..
చాలా సందర్భాల్లో సరిపడినంత నిద్ర ఉన్నా సరే తీవ్రంగా అలసిపోయినట్టుగా అన్పిస్తుంది. వాస్తవానికి ఇలాంటి పరిస్థితి అప్పడప్పుడు మాత్రమే ఉంటుంది. కానీ ఒక్కోసారి ఈ పరిస్థితి అంటే తరచూ తీవ్రంగా అలసిపోవడం క్రమం తప్పకుండా జరుగుతుంటే ఇదొక తీవ్రమైన వ్యాధి లక్షణం కావచ్చు. వైద్య శాస్త్రంలో ఈ లక్షణాన్ని క్రానిక్ ఫాటిగ్ సిండ్రోమ్ అంటారు. ఈ లక్షణం ఎదురైతే ఆరు నెలల వరకూ ఇలానే ఉంటుంది. అసలు ఈ క్రానిక్ ఫాటిగ్ సిండ్రోమ్ అంటే ఏంటో తెలుసుకుందాం..
తరచూ అలసటగా ఉండే స్థితిని క్రానిక్ ఫాటిగ్ సిండ్రోమ్ అంటారు. దీనినే మ్యాల్జిక్ ఎన్‌సిఫ్లోమైలిటిస్ లేదా సిస్టమిక్ ఎక్స్‌టర్న్ ఇంటోలరెన్స్ డిసీజ్ అని కూడా పిలుస్తారు. క్రానిక్ ఫాటిగ్ సిండ్రోమ్ అనేది ఎవరినైనా ప్రభావితం చేయవచ్చు. చిన్నారులకు కూడా ఈ సమస్య ఉత్పన్నం కావచ్చు. ఈ పరిస్థితిని ఎక్కువగా మహిళల్లో చూడవచ్చు.20-40 ఏళ్ల వయస్సులో మహిళల్లో ఈ సమస్య ఉంటుంది.
క్రానిక్ ఫాటిగ్ సిండ్రోమ్ లక్షణాలు ఇలా ఉంటాయి. ఈ సమస్య ఉన్నప్పుడు నిద్ర సరిగ్గా రాదు. కండరాల్లో తీవ్రమైన నొప్పి ఉంటుంది. తలనొప్పి ఎక్కువగా ఉంటుంది. గొంతులా గరగర అధికంగా ఉంటుంది. గొంతులోని గ్రంధుల్లో నొప్పి ఉంటుంది. ఆలోచన, జ్ఞాుపకశక్తి, లేదా ధ్యాస లోపించడం సమస్యలుంటాయి. ఫ్లూ లక్షణాలు కన్పిస్తుంటాయి. తల తిరుగుతుండటం, గుండె చప్పుుడు వేగంగా ఉండటం ఉంటుంది.
క్రానిక్ ఫాటిగ్ సిండ్రోమ్ కారణాల గురించి తెలుసుకుందాం. రోగ నిరోధక శక్తి బలహీనంగా ఉంటే ఈ పరిస్థితి తలెత్తవచ్చు. దాంతో పాటు ఇన్‌ఫెక్షన్లు, అధిక రక్తపోటు, ఒత్తిడి, హార్మోన్ల అసమతుల్యత, రాత్రి ఆలస్యంగా పడుకోవడం, ఎమోషనల్ స్ట్రెస్ వంటివాటి వల్ల ఈ సమస్య తలెత్తవచ్చు.
క్రానిక్ ఫాటిగ్ సిండ్రోమ్ సమస్యకు పలు చికిత్సా విధానాలున్నాయి. ఇందులో ఆక్యుపంక్ఛర్, పోషకాలు సప్లిమెంట్స్‌గా ఇవ్వడం, వ్యాయామం లేదా మెడిటేషన్, పౌష్ఠికాహారం, నిద్ర పూర్తిగా ఉండటం, విటమిన్ డి తీసుకోవడం అనేది చికిత్సగా ఉంది.
Also read: Weight Loss Tips: టీ తాగితే బరువు పెరుగుతున్నారా..? ఈ ఐదు చిట్కాలు పాటిస్తే చాలు..!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook