Only 2 Minutes White Hair Turn Black Naturally : ప్రస్తుతం చాలా మంది తెల్ల జుట్టు, జుట్టు రాలడం సమస్యలతో బాధపడుతున్నారు. దీని ప్రభావం యువతపై కూడా పడింది. చిన్న పెద్ద తేడా లేకుండా అందరిలో తెల్ల జుట్టు సమ్యలు వస్తున్నాయి. వాతావరణ కాలుష్యం, శరీరంలో పోషకాలు లోపం కారణంగా ఇలాంటి సమస్యలు వస్తున్నాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. తెల్ల జుట్టు కారణంగా చాలా మందిలో ముఖం అందహీనంగా తయారవుతోంది. అయితే ఇలాంటి సమస్యల నుంచి ఉపశమనం పొందడానికి మార్కెట్‌లో లభించే హెయిన్ డైలను వినియోగిస్తున్నారు. వీటిని వినియోగించడం వల్ల జట్టు మరింత దెబ్బ తిని రాలిపోవడం వంటి సమస్యలు వస్తున్నాయి. అయితే తెల్ల జుట్టును నల్లగా మార్చుకోవడానికి సహజంగా లభించే పదార్థాలతో తయారు చేసిన హెయిర్ డైలను వినియోగించాల్సి ఉంటుంది.
తెల్లజుట్టు ఉందని బాధపడేవారు తప్పకుండా ఆయుర్వేద నిపుణులు సూచించిన పలు చిట్కాలు వినియోగించడం వల్ల సులభంగా జుట్టు నల్లగా మారుతుంది. అంతేకాకుండా వీటిని వినియోగించడం వల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవని నిపుణులు తెలుపుతున్నారు. భృంగరాజ్ ఆకులతో తయారు చేసిన నూనెను వినియోగించడం వల్ల కూడా సులభంగా తెల్ల జుట్టు నల్లగా మారే ఛాన్స్ ఉందట. అంతేకాకుండా ప్రస్తుతం ఆయుర్వేద దుకాణాల్లో భృంగరాజ్‌తో తయారు చేసిన సాధరణ ప్రోడక్ట్స్ లభిస్తున్నాయి. అయితే వీటిని వినియోగించడం వల్ల కూడా సులభంగా ఉపశమనం లభిస్తుంది. వీటిని వినియోగించడం వల్ల జుట్టు నల్లగా మారడమే కాకుండా ఒత్తుగా తయారవుతుంది.
Also Read: Manipur Violence: ఏ మాత్రం కనికరం చూపలేదు.. భయంకరమైన ఘటన గుర్తుచేసుకున్న బాధితురాలు
అందరూ ఉసిరికాయతో తయారు చేసిన పచ్చడ్లు తింటూ ఉంటారు. ఇలా తినడం వల్ల శరీరానికి చాలా రకాల లాభాలు కలుగుతాయని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు. ఉసిరి రసాన్ని జుట్టుకు పట్టించడం వల్ల తెల్ల జుట్టు నుంచి కూడా సులభంగా ఉపశమనం లభిస్తుందట. అంతేకాకుండా జుట్టు రాలడం కూడా తగ్గుతుంది. కరివేపాకుతో తయారు చేసిన హెయిర్ డైలను వినియోగించడం వల్ల కూడా సులభంగా తెల్ల జుట్టు తగ్గుతుందని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు. కరివేపాకును పేస్ట్‌ను తరచుగా జుట్టుకు అప్లై చేయడం వల్ల జుట్టు దృఢంగా రాలిపోవడం తగ్గుతుంది.
గోరింటాకు పొడితో తయారు చేసిన హెన్నా పొడి కూడా జుట్టును ప్రభావంతంగా నల్లగా చేసేందుకు సహాయపడుతుంది. అయితే తెల్ల జుట్టు సమస్యలతో బాధపడేవారు హెన్నా పొడి మిశ్రమంలా తయారు చేసి తెల్ల జుట్టు ప్రభావిత ప్రాంతంలో అప్లై చేయాల్సి ఉంటుంది. అంతేకాకుండా ఈ మిశ్రమంలో త్రిఫలా చూర్ణాన్ని కలిపి జుట్టుకు అప్లై చేయడం వల్ల మెలనిన్ ఉత్పత్తి పెరుగుతుందని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు.
Also Read: Manipur Violence: ఏ మాత్రం కనికరం చూపలేదు.. భయంకరమైన ఘటన గుర్తుచేసుకున్న బాధితురాలు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
White Hair Turn Black: తెల్ల జుట్టుకు శాశ్వతంగా చెక్ పెట్టే అద్భుత అయుర్వేద చిట్కాలు..కేవలం వారం రోజుల్లోనే నల్లగా మారడం ఖాయం