SBI Special FD Scheme: ఈ పథకంలో ఇన్వెస్ట్ చేస్తే మీ డబ్బులు రెట్టింపు.. సూపర్ స్కీమ్ ఇదే..!

SBI WeCare Fixed Deposit: మీరు సురక్షితమైన ఇన్వెస్ట్‌మెంట్‌కు ప్లాన్ చేస్తున్నట్లయితే స్టేట్ బ్యాంక్ ఆఫ్‌ ఇండియా మంచి వడ్డీ రేట్లను అందిస్తోంది. ముఖ్యంగా ఫిక్స్‌డ్ డిపాజిట్లపై ఆకర్షణీయమైన వడ్డీ రేట్లను ఆఫర్ చేస్తోంది. సీనియర్ సిటిజన్ల కోసం ప్రత్యేక స్కీమ్‌ను అమలు చేస్తోంది. ఆ పథకం గురించి వివరాలు ఇలా.
 

  • Jul 20, 2023, 21:50 PM IST
1 /5

సీనియర్ సిటిజన్లకు "వి కేర్" (SBI WeCare) స్పెషల్ ఫిక్స్‌డ్ డిపాజిట్ స్కీమ్‌ను అందుబాటులోకి తీసుకువచ్చింది. ఈ పథకంలో ఇన్వెస్ట్ చేస్తే.. పెట్టుబడి పెట్టిన డబ్బు నేరుగా రెట్టింపు అవుతుంది.   

2 /5

కోవిడ్ మహమ్మారి సమయంలో సీనియర్ సిటిజన్లను పొదుపును ప్రోత్సహించేందుకు ఈ పథకాన్ని ప్రవేశపెట్టింది. ఈ ఏడాది సెప్టెంబర్ 30వ తేదీ వరకు ఈ పథకంలో పెట్టుబడి పెట్టేందుక అవకాశం ఉంది.   

3 /5

ఐదు, పదేళ్ల కాల వ్యవధి ఎఫ్‌డీలపై 7.50 శాతం వడ్డీ రేటును అందిస్తోంది. మీరు ఆన్‌లైన్‌లో, యోనో యాప్ ద్వారా లేదా వ్యక్తిగతంగా బ్రాంచ్‌కి వెళ్లడం ద్వారా ఎఫ్‌డీని ఓపెన్ చేయవచ్చు. స్టాండర్డ్ ఫిక్స్‌డ్ డిపాజిట్లపై వడ్డీ రేట్లు 7 రోజుల నుంచి 10 సంవత్సరాల వరకు 3.50 శాతం నుంచి 7.50 శాతం వరకు ఉంటాయి.  

4 /5

మీరు ఈ ఎఫ్‌డీ ప్లాన్‌లో 10 సంవత్సరాలకు పెట్టుబడి పెడితే మీ డబ్బు రెట్టింపు అవుతుంది. ఉదాహరణకు.. మీరు రూ.5 లక్షలు ఇన్వెస్ట్ చేస్తే.. పదేళ్ల తర్వాత రూ.10 లక్షల కంటే ఎక్కువ తిరిగి పొందుతారు. 10 సంవత్సరాల వ్యవధితో ప్రామాణిక ఎఫ్‌డీలపై బ్యాంక్ 6.5 శాతం వడ్డీ రేటును ఆఫర్ చేస్తుంది కాబట్టి ఆ సమయంలో మీరు తప్పనిసరిగా దాదాపు రూ. 5 లక్షల వడ్డీని పొందుతారు.  

5 /5

అమృత్ కలాష్ స్పెషల్ ఎఫ్‌డీ స్కీమ్ సీనియర్ సిటిజన్‌లు, ఇతర వినియోగదారులకు వివిధ కాలపరిమితి కలిగిన ఎఫ్‌డీలతో పోల్చితే అత్యధిక వడ్డీ రేటును అందిస్తుంది.