ఇండోనేషియాలోని జకార్తా వేదికగా 8వ రోజు జరుగుతున్న ఆసియా క్రీడలు 2018లో బ్యాడ్మింటన్ మహిళల సింగిల్స్‌లో భారత షెట్లర్ పీవీ సింధు ఫైనల్‌కు దూసుకెళ్లారు. ఈరోజు జరిగిన బ్యాడ్మింటన్ ఉమన్స్ సింగిల్స్ సెమీ ఫైనల్ మ్యాచ్‌లో పీవీ సింధు వరల్డ్ రెండో ర్యాంకర్ అకానె యమగూచి (జపాన్)ను ఓడించింది.
పీవీ సింధు 21-17, 15-21, 21-10 తేడాతో అకానె యమగూచిపై విజయం సాధించి .. ఫైనల్‌కు దూసుకెళ్లారు. ఈ విజయంతో పీవీ సింధు ఆసియా క్రీడల్లో ఫైనల్‌కు చేరిన తొలి భారత షట్లర్‌గా చరిత్ర సృష్టించారు. ఫైనల్లో వరల్డ్ నెంబర్ వన్, చైనా షట్లర్ తై జూయింగ్తో మంగళవారం పీవీ సింధు తలపడనున్నారు.
#AsianGames2018 PV Sindhu reaches the finals after beating Japan's Akane Yamaguchi pic.twitter.com/3XSWWcgVoZ
— ANI (@ANI) August 27, 2018
అంతకుముందు జరిగిన మరొక సెమీ ఫైనల్లో భారత బ్యాడ్మింటన్ క్రీడాకారిణి సైనా నెహ్వాల్ కాంస్యంతో సరిపెట్టుకుంది. సైనా నెహ్వాల్ 17-21, 14-21 తేడాతో వరల్డ్ నెంబర్ వన్ తై జు యింగ్(చైనీస్ తైపీ) చేతిలో ఓటమిపాలై.. ఆసియా క్రీడల్లో తొలిసారి ఫైనల్‌కు చేరే అవకాశాన్ని కోల్పోయారు.