Ys jagan Delhi Tour: ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఢిల్లీ పర్యటన ముగిసింది. ఇవాళ్టి ఒక రోజు ఢిల్లీ పర్యటనలో ముఖ్యమంత్రి జగన్ క్షణం తీరికలేకుండా గడిపారు. ఢిల్లీ చేరగానే వరుసగా షెడ్యూల్ ప్రకారం అమిత్ షా, మోదీ, నిర్మలా సీతారామన్‌లను వేర్వేరుగా కలిశారు. రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలపై చర్చించారు.
ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఇవాళ ఉదయం తాడేపల్లి నివాసం నుంచి విజయవాడ ఎయిర్‌పోర్ట్‌కు తిరిగి అక్కడి నుంచి ఢిల్లీకు బయలుదేరి వెళ్లారు. ఢిల్లీ చేరిన వైఎస్ జగన్‌కు ఎంపీలు మిధున్ రెడ్డి, విజయసాయిరెడ్డిలు స్వాగతం పలికారు. ఇవాళ మద్యాహ్నం కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో భేటీ అయి వివిధ అంశాలపై చర్చించారు. ముఖ్యంగా ఏపీకు రావల్సిన నిధులు, పోలవరం ఫండ్స్‌పై మాట్లాడారు. హోంమంత్రి అమిత్ షాతో దాదాపు 40 నిమిషాలు సమావేశమయ్యారు వైఎస్ జగన్.
ఆ తరువాత ప్రధాని నరేంద్ర మోదీతో సుదీర్ఘ సమయం భేటీ అయ్యారు. రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలపై ముఖ్యమంత్రి జగన్ ప్రధాని మోదీతో చర్చించారు. ఈ ఇద్దరి మధ్య దాదాపు 80 నిమిషాలు సమావేశం జరిగింది. ప్రధాని మోదీతో సమావేశం తరువాత నేరుగా కేంద్ర ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్‌తో సమావేశమయ్యారు. ఇవాళ్టి ఢిల్లీ పర్యటనలో రాష్ట్రానికి ఆర్ధిక సహాయం, పోలవరం నిధులు, విభజన హామీలు వంటి అంశాలపై ప్రధానంగా చర్చ జరిగింది. రాష్ట్రానికి రావల్సిన బకాయిలు, నిధులపై చర్చించారు.
మరోవైపు రుణ పరిమితిపై కేంద్రం విధించిన ఆంక్షలపై మాట్లాడారు. నిబంధనల ప్రకారం ఇచ్చిన రుణ పరిమితిని కూడా తగ్గించిన విషయాన్ని కేంద్ర ఆర్ధికమంత్రి నిర్మలా సీతారామన్ దృష్టికి తీసుకెళ్లారు. 2021-22లో 42,472 కోట్ల రుణ పరిమితిని కల్పించి ఆ తరువాత 17,923 కోట్లకు కుదించారు. పోలవరం ప్రాజెక్టు విషయంలో రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు చేసిన 2600 కోట్లను తక్షణం చెల్లించాలని ముఖ్యమంత్రి జగన్ కోరారు.
Also read: Anantha Sriram: సినీ గేయ రచయిత అనంత శ్రీరామ్ చుట్టూ వివాదం, వైఎస్సార్‌పై ట్రోలింగ్ చేసింది అతనేనా
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook