Samajavaragamana: బాక్సాఫీస్ వద్ద 'సామజవరగమన' రికార్డు స్థాయి కలెక్షన్లు.. శ్రీవిష్ణు కెరీర్ లో ఎన్నడూ లేనంతగా..!

Samajavaragamana Collections: టాలీవుడ్ యంగ్ హీరో శ్రీవిష్ణు తాజా చిత్రం 'సామజవరగమన'. కామెడీ అండ్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా తెరకెక్కిన ఈ సినిమా బాక్సాఫీస్ కాసుల వర్షం కురిపిస్తోంది. కేవలం నాలుగు రోజుల్లోనే దాదాపు రూ.20 కోట్లు వసూలు చేసింది. ఐదో రోజు కూడా ఇదే జోరు కొనసాగించింది.   

Written by - Samala Srinivas | Edited by - ZH Telugu Desk | Last Updated : Jul 4, 2023, 05:29 PM IST
Samajavaragamana: బాక్సాఫీస్ వద్ద 'సామజవరగమన' రికార్డు స్థాయి కలెక్షన్లు.. శ్రీవిష్ణు కెరీర్ లో ఎన్నడూ లేనంతగా..!

Samajavaragamana 5th day collections: యువ నటుడు శ్రీవిష్ణు లేటెస్ట్ మూవీ 'సామజవరగమన'. కామెడీ అండ్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా తెరకెక్కిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లు రాబడుతుంది. తొలిరోజు ఓపెనింగ్స్ తక్కువగానే ఉన్నప్పటికి.. రెండో రోజు నుంచి భారీ వసూళ్లుతో దూసుకుపోతుంది. ముఖ్యంగా ఫ్యామిలీ అడియెన్స్ థియేటర్లకు క్యూ కడుతున్నారు. 

తొలి రోజు ప్రపంచ వ్యాప్తంగా రూ.2.89 కోట్ల గ్రాస్, రెండో రోజు రూ.3.42 కోట్ల కలెక్షన్లు రాబట్టి టాక్ ఆప్ ద టౌన్ గా నిలుస్తోంది. ఇక మూడో రోజు అయితే ఏకంగా రూ. 6.65 కోట్లు వసూలు చేసింది. ఇదే విధంగా నాలుగో రోజు కూడా రూ. 3 కోట్లు రాబట్టింది. అయితే ఐదో రోజు కూడా ఊహించని రేంజ్ లో కలెక్షన్లు రాబట్టింది. దేశవ్యాప్తంగా రూ.1.20 కోట్ల, వరల్డ్ వైడ్ గా రూ.3 కోట్ల గ్రాస్ వసూళ్లుతో దూసుకెళ్తుందని ట్రేడ్ వర్గాలు అంటున్నాయి. ఇదే సినిమాతో రిలీజైన 'స్పై' బాక్సాఫీస్ వద్ద బోల్తా పడింది. ఏడో తారీఖు దాకా మరే సినిమాలు లేకపోవడంతో 'సామజవరగమన' కలెక్షన్లతో దూసుకుపోవడం ఖాయంగా కనిపిస్తోంది. 

Also Read: Shah Rukh Khan Accident: షూటింగ్​లో షారుక్​కు ప్రమాదం.. ఆందోళనలో ఫ్యాన్స్..

చాలా కాలంగా హీరో శ్రీవిష్ణు కు సరైన హిట్ లేదు. ఈ మూవీ హిట్ తో మళ్లీ ఫామ్ లోకి వచ్చాడు. ఈ సినిమా జూన్ 29న రిలీజ్ అయింది. ఈ మూవీలో శ్రీవిష్ణు సరసన రెబ్బామోనిక జాన్ హీరోయిన్ గా నటించింది. సీనియర్ హీరో నరేశ్, వెన్నెల కిశోర్, సుదర్శన్, శ్రీకాంత్ అయ్యంగార్ తదితరులు కీలకపాత్రల్లో నటించారు. రామ్ అబ్బరాజు దర్శకత్వం వహించిన ఈ సినిమాను రాజేష్ దండా నిర్మించారు. 

Also Read: Pushpa 2 Updates: క్లైమాక్స్‌కు చేరిన పుష్ప 2 షూటింగ్, రష్మిక డెత్ మిస్టరీ ఎలా ఉంటుంది

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitterFacebook 

Trending News