ఆసియా క్రీడల్లో సంచలనం.. 25 మీటర్ల పిస్టల్ షూటింగ్‌లో స్వర్ణం పొందిన తొలి భారతీయురాలిగా రహి సర్నోబత్ రికార్డు

ఆసియా క్రీడల్లో 25 మీటర్ల పిస్టల్ షూటింగ్ విభాగంలో భారతీయ క్రీడాకారిణి రహి సర్నోబత్ స్వర్ణ పతకాన్ని కైవసం చేసుకున్నారు.

Last Updated : Aug 22, 2018, 09:18 PM IST
ఆసియా క్రీడల్లో సంచలనం.. 25 మీటర్ల పిస్టల్ షూటింగ్‌లో స్వర్ణం పొందిన తొలి భారతీయురాలిగా రహి సర్నోబత్ రికార్డు

ఆసియా క్రీడల్లో 25 మీటర్ల పిస్టల్ షూటింగ్ విభాగంలో భారతీయ క్రీడాకారిణి రహి సర్నోబత్ స్వర్ణ పతకాన్ని కైవసం చేసుకున్నారు. ఈ పతకంతో భారత్ ఖాతాలో నాలుగు స్వర్ణ పతకాలు చేరాయి. ఈ విభాగంలో భారత్‌కు తొలిసారిగా స్వర్ణ పతకాన్ని అందించిన మొదటి మహిళ రహి సర్నోబత్ కావడం విశేషం. 2008 కామన్వెల్త్ క్రీడల్లో తొలిసారిగా పిస్టల్ షూటింగ్‌లో తొలిసారిగా స్వర్ణ పతకం పొందిన రహి, ఆ తర్వాత కూడా అనేక అంతర్జాతీయ పోటీల్లో భారత్‌కు పతకాలు తీసుకువచ్చారు. 2010లో కామన్వెల్త్ క్రీడల్లో కూడా రహి రెండు స్వర్ణ పతకాలు కైవసం చేసుకున్నారు.

మహారాష్ట్రలోని కోల్హాపూర్ ప్రాంతానికి చెందిన రహి ప్రపంచ కప్‌లో భారతదేశానికి తొలి బంగారు పతకం తీసుకొచ్చిన క్రీడాకారిణి కూడా కావడం గమనార్హం. 2015లో జరిగిన కామన్వెల్త్ క్రీడల్లో కూడా రహి 25 మీటర్ల పిస్టల్ షూటింగ్ విభాగంలో స్వర్ణం చేజిక్కించుకున్నారు. అదే సంవత్సరం జరిగిన ఆసియా క్రీడలలో మాత్రం కాంస్య పతకం సాధించిన రహి.. ఈసారి మాత్రం స్వర్ణాన్ని పొంది తన చిరకాల కోరికను నెరవేర్చుకున్నారు. 

2015లో షూటింగ్ రంగంలో రహి సర్నోబత్ దేశానికి తీసుకొస్తున్న పేరు ప్రఖ్యాతులను పరిగణనలోకి తీసుకొని ఆమెకు భారత ప్రభుత్వం అర్జున అవార్డును అందించింది. పూణెలోని బేల్వాడి షూటింగ్ రేంజ్‌లో కోచ్ అంతోలి పిదుబ్ని ఆధ్వర్యంలో శిక్షణ తీసుకుంటున్న 27 సంవత్సరాల రహి సర్నోబత్ భారత్ గర్వించదగ్గ మేటి షూటర్స్‌లో ఒకరు. 

 

Trending News