Extra Over in Odi Match: అంపైర్ తప్పిదం.. ఒక ఓవర్ అదనంగా వేసిన కివీస్ బౌలర్

SL Vs NZ Odi Series: వన్డే క్రికెట్‌లో ఒక్కో బౌలర్‌కు 10 ఓవర్ల కోటా ఉంటుంది. టీ20ల్లో అయితే నాలుగు ఓవర్లు ఉంటాయి. టెస్టుల విషయానికి వస్తే అన్‌లిమిటెడ్. వన్డేల్లో నిర్ణీత 50 ఓవర్లలో ఒక బౌలర్ పది ఓవర్ల కంటే తక్కువ వేయొచ్చు గానీ.. ఎక్కువ ఓవర్లు వేయకూడదు. అయితే శ్రీలంక, న్యూజిలాండ్ మహిళల జట్ల మధ్య జరిగిన వన్డే మ్యాచ్‌లో ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది. అంపైర్ మిస్టేక్ కారణంగా ఓ బౌలర్ 11 ఓవర్లు బౌలింగ్ చేసింది.

1 /5

శ్రీలంక, న్యూజిలాండ్ జట్ల మధ్య జరుగుతున్న సిరీస్‌లో రెండో వన్డేలో న్యూజిలాండ్ బౌలర్ ఈడెన్ కార్సన్ తన స్పెల్‌లో అదనపు ఓవర్‌ని వేసింది. ఈ మ్యాచ్‌లో ఆమె మొత్తం 11 ఓవర్లు బౌలింగ్ చేసింది.  

2 /5

శ్రీలంక ఇన్నింగ్స్ 45వ ఓవర్ సమయానికి ఈడెన్ కార్సన్ తన 10 ఓవర్ల కోటాను పూర్తి చేసింది. అయితే ఆ తరువాత కూడా మళ్లీ బౌలింగ్‌కు వచ్చి ఒక ఓవర్‌ను అదనంగా వేసింది. బౌలింగ్‌కు వచ్చిన ఆమెను అంపైర్ కూడా ఆపలేదు.  

3 /5

ఈ మ్యాచ్‌లో ఈడెన్ కార్సన్ మొత్తం 11 ఓవర్లలో 41 పరుగులిచ్చి 2 వికెట్లు తీసింది. అదనంగా వేసిన 11వ ఓవర్‌లో ఒక పరుగు మాత్రమే ఇవ్వడం గమనార్హం.   

4 /5

శ్రీలంక, న్యూజిలాండ్ జట్ల మధ్య మూడు వన్డేల సిరీస్ జరుగుతోంది. రెండో వన్డేలో మొదట బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ 329 పరుగులు చేసింది. అనంతరం శ్రీలంక జట్టు 218 పరుగులకే ఆలౌట్ అయింది.  

5 /5

తొలి వన్డేలో న్యూజిలాండ్‌ను శ్రీలంక ఓడించింది. రెండో వన్డేను కివీస్ గెలవడంతో సిరీస్ 1-1తో సమం అయింది.     మూడో వన్డే జూలై 3న జరగనుంది.