Solipeta Ramachandra Reddy Died: తెలంగాణ రైతాంగ పోరాటంలో క్రియాశీలక పాత్ర వహించిన, రాజ్యసభ మాజీ సభ్యులు సోలిపేట రామచంద్రారెడ్డి (92) మరణించారు. అనారోగ్య సమస్యల కారణంగా ఈ రోజు ఉదయం మృతి చెందారని కుటుంబ సభ్యులు వెల్లడించారు. తెలంగాణలో తొలినాళ్లలో రామచంద్రారెడ్డి కమ్యూనిస్టు నాయకులతో స్వరాష్ట్రం కోసం ఎన్నో పోరాటాలు చేశారు. హైదరాబాదులోని సిటీ కాలేజీలో చదువును పూర్తి చేసి..రాజకీయాల్లోకి వచ్చేందుకు యువకుడిగా ఉన్నప్పటి నుంచే కృషి చేశారు. ఆయన సొంతూరు సిద్దిపేట జిల్లా చిట్టాపూర్ గ్రామం కాగా ఉన్నత చదువుల కోసం హైదరాబాద్ కి వచ్చారు.
Also Read: Sarfaraz Khan: ఒక్క వీడియోతో బీసీసీఐకి ఇచ్చిపడేసిన సర్ఫరాజ్ ఖాన్
సోలిపేట రామచంద్రారెడ్డి స్వగ్రామమైన చిట్టాపూర్ లో సర్పంచిగా పోటీ చేసి గెలిచారు. ఆ తర్వాత దుబ్బాక సమితి అధ్యక్షుడిగా కొనసాగారు. అంతేకాకుండా మెదక్ జిల్లా కేంద్ర సహకార బ్యాంకు అధ్యక్షుడిగా కూడా రామచంద్రారెడ్డి పని చేశారు. ఇక ఆయన సేవలను గుర్తించిన ప్రజలు దొమ్మాట ఎమ్మెల్యేగా పదవి కట్టబెట్టారు. ఒకటి రెండు కాదు ఎమ్మెల్యేగా ఆయన ప్రజలకు ఎన్నో సేవలను అందించాడు. ఆ తర్వాత ఆయనను తెలుగుదేశం పార్టీ గుర్తించి పెద్దపెద్ద పదవులను కట్టబెట్టింది.
రామచంద్రారెడ్డి టిడిపి పార్టీ రాష్ట్ర కార్యదర్శిగా రాజ్యసభలో ఓ మంచి నేతగా..హామీల సంఘం అధ్యక్షుడిగా కూడా పనిచేశారు. అంతేకాకుండా ఇటీవల భారత్ చైనా మిత్రమండలి అధ్యక్షుడుగా కూడా పని చేశారని సమాచారం. తెలంగాణ అమరవీరుల స్మారక ట్రస్ట్ నుంచి ఆయన వంతుగా ఎన్నో సేవలు అందించారు. అంతేకాకుండా స్వతంత్రంగా పనిచేసే లోక్‌సత్తాకు కూడా సేవ అందించారు. 70 ఏళ్ల రాజకీయ జీవితంలో రామచంద్రారెడ్డి క్రియాశీలక పాత్ర పోషించారు. అంతేకాకుండా మచ్చలేని మనిషిగా పేరు పొందారు.
Also Read: Sarfaraz Khan: ఒక్క వీడియోతో బీసీసీఐకి ఇచ్చిపడేసిన సర్ఫరాజ్ ఖాన్
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook