EPFO Higher Pension Scheme: మీరు పీఎఫ్ ఖాతాదారులా..? మీకు అధిక పెన్షన్ పొందాలని అనుకుంటున్నారా..? అయితే మీకు ఎక్కువ సమయం లేదు. హయ్యర్ పెన్షన్‌కు దరఖాస్తు చేసుకునేందుకు రేపటి వరకే ఛాన్స్ ఉంది. జూన్ 26న గడువు ముగుస్తుందని ఇప్పటికే ఈపీఎఫ్ఓ ప్రకటించిన విషయం తెలిసిందే. ఇంకా ఎవరైనా దరఖాస్తు చేసుకోకపోతే.. వెంటనే అప్లై చేసుకోండి. లేకపోతే అధిక పెన్షన్ పొందే అవకాశం కోల్పోతారు. కాగా.. గడువును గతంలో రెండుసార్లు పెంచగా.. మరోసారి పెంపునకు సంబంధించి ఇప్పటివరకు ఎలాంటి అప్డేట్ లేదు. ఒక రోజు సమయం ఉన్న నేపథ్యంలో త్వరగా అప్లై చేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.
గతేడాది నవంబర్‌లో సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం ఈ పథకం కింద చేరేందుకు అందరూ అర్హులు కాదు. ఈపీఎఫ్‌లోని కొంతమంది సభ్యులు మాత్రమే అధిక పెన్షన్‌కు దరఖాస్తు చేసుకోవచ్చు. రెండు రకాల వ్యక్తులకు అప్లై చేసుకునే అవకాశం ఉంటుంది. 2014 సెప్టెంబర్ 1వ తేదీ వరకు ఈపీఎఫ్, ఈపీఎస్‌లో సభ్యులుగా ఉండి.. ప్రస్తుతం కొనసాగుతున్న వారు, 2014 సెప్టెంబరు 1వ తేదీకి ముందు పదవీ విరమణ చేసి.. అంతకుముందు అధిక పెన్షన్‌ను ఎంచుకున్న వారు అర్హులు.
ఆన్లైన్లో అధిక పెన్షన్‌కు దరఖాస్తు చేసుకునే సమయంలో యూఏఎన్, పెన్షన్ పేమెంట్ ఆర్డర్ (పీపీఓ) నంబర్, ఈపీఎఫ్ ఖాతాలో జీతం పరిమితిని మించి చెల్లించినట్లు రుజువు మొదలైనవి ఉండాలి. పోర్టల్‌లో అవసరమైన పత్రాలు సమర్పించి అధిక పెన్షన్‌కు దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తులను 20 రోజుల్లోగా పరిష్కరించాలని ఇప్పటికే ఫీల్డ్ కార్యాలయను ఈపీఎఫ్ఓ ఆదేశించింది. కంట్రిబ్యూషన్‌లో లోటును భర్తీ చేయడానికి.. మీరు అదనపు చెల్లింపు చేయాల్సి ఉంటుంది.
ఉద్యోగి ఖాతా నుంచి 1.16 శాతం, అంతకంటే ఎక్కువ మొత్తం యజమాని సహకారం నుంచి వస్తుందని ఈపీఎఫ్ఓ తెలిపింది. మీరు హయ్యర్ పెన్షన్ ఆప్షన్ ఎంచుకుంటే.. రిటైర్మెంట్ తరువాత మీ చేతికి వచ్చే మొత్తం అమౌంట్లో కొంత తగ్గుతుంది. కానీ నెలవారీగా వచ్చే పెన్షన్ డబ్బులు ఎక్కువగా వస్తాయి. అయితే అధిక పెన్షన్ ఎంచుకోవాలని ఉద్యోగికి కచ్చిత నిబంధన ఏమీ లేదు. ఉద్యోగ విరమణ తరువాత మీకు అధిక పెన్షన్ కావాలంటే ఈ స్కీమ్ ఎంచుకోవచ్చు.
Also Read: Shriya Saran: అందాల బాంబ్ పేల్చిన శ్రియా.. ఉర్పీ జావేద్ కాపీ అంటూ ట్రోలింగ్
Also Read: Sarfaraz Khan: ఒక్క వీడియోతో బీసీసీఐకి ఇచ్చిపడేసిన సర్ఫరాజ్ ఖాన్
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook