Weight Loss Tips: ఫిట్ అండ్ స్లిమ్‌గా, హెల్తీగా , అందంగా ఉండాలని ప్రతి ఒక్కరికీ ఉంటుంది. బరువు నియంత్రించేందుకు ఎన్నో రకాలుగా ప్రయత్నిస్తుంటారు. డైటింగ్ చేస్తుంటారు. ఎంత చేసినా ఆశించిన ఫలితాలు కన్పించక నిరాశకు లోనవుతుంటారు. దీనికి కారణమేంటి, తప్పు ఎక్కడ జరుగుతోందనేది పరిశీలిద్దాం..
ఆధునిక పోటీ ప్రపంచంలో చాలామందికి ఎదురౌతున్న సమస్య అధిక బరువు లేదా స్థూలకాయం. స్థూలకాయం అనేది నలుగురిలో అసౌకర్యం కల్గించడమే కాదు ఆరోగ్యపరంగా చాలా హాని కల్గిస్తుంది. వివిధ రకాల వ్యాధులు చుట్టుముడతాయి. ముఖ్యంగా డయాబెటిస్, అధిక రక్తపోటు, కొలెస్ట్రాల్, హార్ట్ ఎటాక్ వంటి ప్రమాదకర సమస్యలకు ప్రధాన కారణం స్థూలకాయమే. అధిక బరువు కారణంగా చిన్న చిన్న పనులకే అలసిపోతుంటారు. మరి ఈ సమస్యను ఎలా పరిష్కరించాలి, బరువు నియంత్రించలేకపోవడానికి కారణమేంటి, బరువు ఎందుకు పెరుగుతోందనే వివరాలు ఇలా ఉన్నాయి..
నిద్ర అనేది మనిషి బరువుపై ప్రభావం చూపిస్తుంది. ఆరోగ్యకరమైన నిద్ర బరువు తగ్గించడంలో దోహదం చేస్తుంది. రోజకు కనీసం 7-8 గంటల నిద్ర లేకపోతే బరువు నియంత్రణలో సమస్య ఉత్పన్నమౌతుంది. ఎందుకంటే నిద్ర తక్కువైనప్పుుడు ఆ మనిషి మెటబోలిజం మందగిస్తుంది. అదే నిద్ర సరిగ్గా ఉంటే మెటబోలిజం వేగవంతమై బరువు నియంత్రణలో ఉంటుంది.
ఎక్కువసేపు ఒకే చోట కూర్చోవడం వల్ల శరీరం లైపేజ్ ఉత్పత్తి ఆగిపోతుంది. ఫలితంగా బరువు పెరగడం ప్రారంభమౌతుంది. అందుకే ఎక్కువ సేపు ఒకే చోట కూర్చోకుండా ఉండాలి. ఒకవేళ మీ ఉద్యోగమే అటువంటిదైనా మధ్య మధ్యలో లేచి అటూ ఇటూ తిరుగుతుండాలి.
చాలామందిలో ఓ తప్పుడు అభిప్రాయముంటుంది. అది తిండి తక్కువగా తింటే బరువు తగ్గుతారనేది. ఇది పూర్తిగా పొరపాటు. ఎందుకంటే డైట్ పూర్తిగా తీసుకోకపోతే మలబద్ధకం సమస్య ఏర్పడుతుంది. ఫలితంగా బరువు తగ్గడానికి బదులు పెరుగుతుంది. తిండి తక్కువైతే శారీరక ప్రక్రియ మందగిస్తుంది. దాంతో బరువు పెరుగుతుంటుంది. అందుకే బరువు తగ్గేందుకు ఎప్పుడూ తిండి మానేయకూడదు. ఆరోగ్యకరమైన ఆహారంపై దృష్టి పెట్టాలి. తినే ఆహారంలో ఫైబర్, పోషక పదార్ధాలు ఎక్కువగా ఉండేట్టు చూసుకోవాలి. అప్పుడే ఆశించిన ఫలితాలుంటాయి. ఈ మూడు తప్పులు లేదా పొరపాట్లు చేయకుండా ఉంటే బరువు తగ్గడం పెద్ద కష్టమేం కాదంటున్నారు వైద్య నిపుణులు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook