Adipurush 3rd Collections: ఓ వైపు విమర్శలు వస్తున్నా ఆదిపురష్ కలెక్షన్ల జోరు మాత్రం ఎక్కడా ఆగడం లేదు. మూడో రోజు కూడా ప్రభాస్ సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లనే రాబట్టింది. ఇండియా వైడ్ గా తొలి రెండు రోజుల్లో రూ.152 కోట్లు (నెట్) సాధించిన ఆదిపురుష్.. మూడో రోజు రూ.69 కోట్లు కలెక్షన్లు సంపాదించింది. మెుత్తంగా మూడు రోజులకు దేశ వ్యాప్తంగా ₹ 221.10 కోట్లు (నెట్) కలెక్షన్లతో దుమ్ముదులిపింది. ప్రపంచ వ్యాప్తంగా మూడో రోజులకు మూడు వందల కోట్లకు పైగా వసూలు చేసింది. ఓవర్సీస్ లో రూ.41 కోట్ల సాధిస్తే.. ఇండియా వైడ్ రూ.261 కోట్లు వసూలు చేసినట్లయింది.
సౌత్ సూపర్ స్టార్ ప్రభాస్, బాలీవుడ్ డైరెక్టర్ ఓం రౌత్ కాంబోలో తెరెక్కిన మూవీ ఆదిపురుష్. ఈచిత్రాన్ని సుమారు 500 కోట్ల వ్యయంతో నిర్మించారు. టీ సీరిస్ అధినేతలు భూషణ్ కుమార్, కిషన్ కుమార్ నిర్మాతలుగా వ్యవహారించారు. ఈ చిత్రంలో రావణుడి పాత్రలో సైఫ్ అలీఖాన్, లక్ష్ణణుడిగా సన్నీ సింగ్, సీతగా కృతి సనన్ నటించారు. ఇండియా వైడ్ గా ఈ చిత్రాన్ని జూన్ 16న దాదాపు 4000 స్క్రీన్లలో రిలీజ్ చేశారు. తెలుగు రాష్ట్రాలతోపాటు హిందీలో కూడా ఈ మూవీ భారీగా వసూళ్లను రాబట్టింది.
Also Read: Ram Charan-Upasana: మెగా వారసురాలు వచ్చేసింది.. తల్లిదండ్రులు అయిన రామ్ చరణ్, ఉపాసన
తొలి రోజు నుంచే ఈచిత్రం మిక్సడ్ టాక్ తెచ్చుకుంది. ఈ చిత్రంలో భావోద్వోగాలు పండలేదని, వీఎఫ్ఎక్స్ బాగోలేదని, హనుమాన్ డైలాగ్ లు వివాదస్పదంగా ఉన్నాయని రకరకాల విమర్శలు వస్తున్నాయి. ఈ మూవీ తెరకెక్కించే విషయంలో ఓం రౌత్ సరైన జాగ్రత్తలు తీసుకోలేదని కామెంట్లు చేస్తున్నారు. పైగా ఈ మూవీపై హైకోర్టులో కేసు నడుస్తోంది. నేపాల్ లో ఈ చిత్రాన్ని బ్యాన్ కూడా చేశారు. ఈ చిత్రాన్ని త్వరలో అమెజాన్ ప్రైమ్ వీడియో వేదికగా ఓటీటీ స్ట్రీమింగ్ చేయనున్నారు.
Also Read: Adipurush OTT Streaming: ‘'ఆదిపురుష్'’ ఏ ఓటీటీలో స్ట్రీమింగ్ కానుందంటే?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి