World Cup 2023 Venue List: భారత్ వేదికగా జరిగే వన్డే ప్రపంచ కప్‌కు రంగం సిద్ధమవుతోంది. ఇందుకు సంబంధించి ఐసీసీ సన్నాహాలు ప్రారంభించింది. ప్రపంచ కప్ 2023 షెడ్యూల్ ముసాయిదాను ఐసీసీకి బీసీసీఐ పంపింది. ఫీడ్‌బ్యాక్ కోసం వరల్డ్ కప్‌లోనే పాల్గొనే జట్లకు పంపిస్తారు. ఆ తరువాత ఒక వారంలో తుది షెడ్యూల్ ప్రకటిస్తారు. వన్డే ప్రపంచకప్‌కు సంబంధించిన వేదికల జాబితా ఖరారైంది. త్వరలోనే అధికారికంగా ప్రకటించే అవకాశం ఉంది. మొత్తం 9 స్టేడియాలను జాబితాలో ఎంపిక చేసినట్లు తెలుస్తోంది.
Cricinfo వెబ్‌సైట్ ప్రకారం.. ప్రపంచ కప్ కోసం 9 నగరాల జాబితాను సిద్ధం చేయగా.. వీటిలో అహ్మదాబాద్, చెన్నై, లక్నో, ముంబై, బెంగళూరు, ఢిల్లీ, కోల్‌కతా, పుణె, ధర్మశాల ఉన్నాయి. టీమిండియా ఆడే వరల్డ్ కప్ ఆతిథ్య మ్యాచ్‌లలో హైదరాబాద్‌కు చోటు దక్కలేదు. ఎన్నో చిరస్మరణీయ మ్యాచ్‌లకు వేదికగా నిలిచిన హైదరాబాద్, వైజాగ్ స్టేడియాలకు భారత్ ఆడే మ్యాచ్‌లకు అవకాశం ఇవ్వకపోవడంపై విమర్శలు వస్తున్నాయి.
బీసీసీఐ షెడ్యూల్ ప్రకారం.. వరల్డ్ కప్ టోర్నీలో భాగంగా అక్టోబర్ 5న ఇంగ్లండ్, న్యూజిలాండ్ జట్ల మధ్య తొలి మ్యాచ్ జరగనుంది. ప్రపంచ కప్ ప్రారంభమైన మూడు రోజుల తరువాత భారత్ తొలి మ్యాచ్ చెన్నైలో ఆస్ట్రేలియాతో తలపడనుంది. అక్టోబర్ 15న అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా.. టీమిండియా-పాకిస్థాన్ జట్ల మధ్య ప్రపంచకప్ మ్యాచ్ జరగనుంది. సెమీ ఫైనల్స్‌కు సంబంధించిన వేదికల ఇంకా గురించి సమాచారం ఇవ్వలేదు. ఈ మ్యాచ్‌లు నవంబర్ 15 నుంచి 16 వరకు జరిగే అవకాశం ఉంది. నవంబర్ 19న అహ్మదాబాద్‌లో ఫైనల్ మ్యాచ్ జరగనుంది. టోర్నీ తొలి మ్యాచ్ కూడా ఇదే మైదానంలోనే నిర్వహించనున్నారు.
టీమిండియా మ్యాచ్‌లు ఇలా.. (Cricinfo వెబ్‌సైట్ పేర్కొన్న విధంగా..)
==> భారత్ vs ఆస్ట్రేలియా, అక్టోబర్ 8, చెన్నై
==> భారత్ vs ఆఫ్ఘనిస్తాన్, అక్టోబర్ 11, ఢిల్లీ
==> భారత్ vs పాకిస్థాన్, అక్టోబర్ 15, అహ్మదాబాద్
==> భారత్ vs బంగ్లాదేశ్, అక్టోబర్ 19, పూణె
==> భారత్ vs న్యూజిలాండ్, అక్టోబర్ 22, ధర్మశాల
==> భారత్ vs ఇంగ్లాండ్, అక్టోబర్ 29, లక్నో
==> భారత్ vs క్వాలిఫైయర్ 1, నవంబర్ 2, ముంబై
==> భారత్ vs సౌతాఫ్రికా, నవంబర్ 5, కోల్‌కతా
==> భారత్ vs క్వాలిఫైయర్ 2, నవంబర్ 11, బెంగళూరు
ప్రపంచకప్ 2023కి సంబంధించి ఇంకా పూర్తి షెడ్యూల్ ఖరారు చేయలేదు. సాధారణంగా ఏడాదికి ముందుగానే షెడ్యూల్ ప్రకటిస్తారు. ప్రస్తుతం నాలుగు నెలల సమయం ఉన్నా.. ఇంకా అధికారిక ప్రకటన రాలేదు. 2015, 2019లో దాదాపు ఒక సంవత్సరం ముందుగానే షెడ్యూల్ పూర్తిగా ఖరారు చేసిన విషయం తెలిసిందే. ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌లో షెడ్యూల్‌ను ప్రకటిస్తామని ఇటీవల బీసీసీఐ సెక్రటరీ జై షా తెలిపారు. అయితే అదీ జరగలేదు. త్వరలోనే వరల్డ్ కప్ షెడ్యూల్ ప్రకటిస్తామని ఐసీసీ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్ ప్రారంభమైన మొదటి రోజు ఐసీసీ సీఈఓ జెఫ్ అల్లార్డిస్ వెల్లడించారు. అయితే ఏ తేదీ అని ఆయన స్పష్టం చెప్పలేదు.
Also Read: Novak Djokovic: గర్జించిన సెర్బియా సింహం.. జకోవిచ్ దెబ్బకు తలవంచిన రికార్డులు
Also Read: Jagananna Vidya Kanuka: నేడే జగనన్న విద్యాకానుక పంపిణీ.. ఒక్కో విద్యార్థికి రూ.2,400 ఖర్చు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి