Kisan Vikas Patra Interest Rate: ప్రస్తుతం పెట్టుబడి పెట్టేందుకు అనేక ఆప్షన్లు అందుబాటులో ఉన్నాయి. తక్కువ కాలంలో ఎక్కువ ఆదాయాన్ని ఇచ్చే ప్రైవేట్ స్కీమ్‌లు కూడా ఉన్నాయి. అయితే వాటిలో కొంచెం రిస్క్ కూడా ఎక్కువగా ఉంటుంది. అందుకే ఎక్కువ మంది ప్రభుత్వ పథకాలలో ఇన్వెస్ట్ చేసేందుకు మొగ్గు చూపుతున్నారు. పోస్టాఫీసు, ఎల్ఐసీ స్కీమ్‌లలో ఇన్వెస్ట్ చేస్తున్నారు. వీటిలో కూడా కొన్ని పథకాలు మంచి వడ్డీ రేట్లను ఆఫర్ చేస్తున్నాయి. అటువాటిలో కిసాన్ వికాస్ పత్ర స్కీమ్ కూడా ఒకటి. ఈ పథకంలో మీరు ఇన్వెస్ట్ చేసి మీ డబ్బును రెట్టింపు చేసుకోవచ్చు.
కిసాన్ వికాస్ పత్ర పథకాన్ని కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తోంది. ఈ స్కీమ్‌లో ప్రస్తుతం 7.4 శాతం వడ్డీ లభిస్తోంది. ఈ ఏడాది ఏప్రిల్‌కు ముందు 7.2 శాతం వడ్డీ ఉండగా.. ఆ తరువాత 7.4 శాతానికి పెంచారు. ఈ పథకంలో పెట్టుబడిదారుడు ఒకేసారి మొత్తాన్ని ఇన్వెస్ట్ చేస్తే.. నిర్ణీత వ్యవధిలో రెట్టింపు మొత్తాన్ని పొందవచ్చు. ఈ పథకం కోసం మీరు ఏదైనా పోస్టాఫీసుకు వెళ్లి అకౌంట్‌ను ఓపెన్ చేయవచ్చు. గ్రామీణ ప్రజల కోసం ప్రత్యేకంగా ఈ పథకాన్ని రూపొందించారు. ఇందులో మీరు రూ.వెయి నుంచి ఇన్వెస్ట్మెంట్ ప్రారంభించవచ్చు.
వడ్డీ రేటు పెంపు తరువాత ఈ పథకం కింద డిపాజిట్లను రెట్టింపు చేసే వ్యవధి తగ్గింది. ఇంతకుముందు ఇందులో ఇన్వెస్ట్ చేసిన డబ్బులు రెట్టింపు అవ్వడానికి 120 నెలలు పడుతుండగా.. ప్రస్తుతం 115 నెలల్లోనే డబులు అవుతుంది. ఉదాహరణకు మీరు పథకంలో రూ.10 లక్షలు పెట్టుబడి పెడితే.. 115 నెలల తర్వాత మెచ్యూరిటీపై రూ.20 లక్షల మొత్తాన్ని పొందుతారు. కిసాన్ పత్ర స్కీమ్‌లో కింద ప్రభుత్వం చక్రవడ్డీ రేటు ప్రయోజనాన్ని అందిస్తుంది.
మీరు కనీసం రూ.వెయితో ఇన్వెస్ట్మెంట్ ప్రారంభించి.. ఆ తరువాత రూ.100 గుణిజాలతో పెంచుకుంటూ వెళ్లవచ్చు. ఈ పథకం కింద ఇద్దరు లేదా ముగ్గురు కలిసి సింగిల్ లేదా జాయింట్లో అకౌంట్ ఓపెన్ చేయవచ్చు. ఈ పథకం కింద 10 సంవత్సరాల కంటే ఎక్కువ వయస్సు ఉన్న వారి పేరుతో అకౌంట్ తెరవవచ్చు. ఒకవేళ ఖాతాదారుడు మరణిస్తే.. నామినీ ఖాతాలో జమ చేసిన మొత్తాన్ని క్లెయిమ్ చేయవచ్చు. ఇందుకోసం ఖాతాదారుడి డెత్ సర్టిఫికెట్, ఐడీ పోస్టాఫీసుకు సమర్పించాలి. ఆ తర్వాత ఒక ఫారమ్‌ను నింపి అందజేస్తే.. నామినీ ఖాతాలో డబ్బు జమ అవుతుంది.
Also Read: CSK Vs GT IPL 2023: క్షణాల్లో మ్యాచ్ మార్చేసే వీరులు.. ఈ ఐదుగురు ఆటగాళ్లపై ఓ లుక్కేయండి..!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి