Ravi Shastri Picks India Playing XI vs Australia for WTC Final 2023: మే 28న ఐపీఎల్ 2023 ముగియనుంది. ఐపీఎల్ 16వ సీజన్ ముగిసిన వెంటనే ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ (డబ్ల్యూటీసీ) ఫైనల్ జరుగనుంది. డబ్ల్యూటీసీ ఫైనల్ 2023లో ఆస్ట్రేలియాతో భారత్ తలపడనుంది. ఇంగ్లండ్‌లోని ప్రఖ్యాత ఓవల్ మైదానంలో జూన్ 7 నుంచి 11 వరకు ఈ మ్యాచ్ జరగనుంది. ఈ ప్రతిష్టాత్మక మ్యాచ్ కోసం ఇప్పటికే టీమిండియా హెడ్‌కోచ్ రాహుల్ ద్రవిడ్ సహా కొందరు ఆటగాళ్లు లండన్‌కు బయల్దేరారు. ఐపీఎల్ 2023 అనంతరం మిగతా ప్లేయర్స్ కూడా లండన్ చేరుకోనున్నారు. మరోవైపు ఆసీస్ ప్లేయర్స్ కూడా బృందాలుగా వెళ్లనున్నారు.
డబ్ల్యూటీసీ ఫైనల్ 2023కి భారత ప్రధాన ప్లేయర్స్ దూరమయిన విషయం తెలిసిందే. మిడిలార్డర్ బ్యాటర్ శ్రేయస్ అయ్యర్ వెన్ను గాయం కారణంగా జట్టుకు దూరం కాగా.. ప్రధాన పేసర్ జస్‌ప్రీత్ బుమ్రా కూడా వెన్నునొప్పి కారణంగానే దూరమయ్యాడు. ఇక యాక్సిడెంట్ కారణంగా వికెట్ కీపర్ రిషభ్ పంత్ డబ్ల్యూటీసీ ఫైనల్ 2023కు అందుబాటులో లేకుండా పోయాడు. వీరి స్థానాల్లో అజింక్య రహానే, కేఎస్ భరత్ జట్టులోకి వచ్చారు. ఆటగాళ్ల గాయాల కారణంగా తుది జట్టు ఎలా ఉంటుందో అని అందరూ అభిప్రాయపడుతున్నారు. ఈ నేపథ్యంలో టీమిండియా మాజీ కోచ్ రవిశాస్త్రి అంచనా వేశాడు.
ఐపీఎల్ 2023లో సత్తా చాటుతున్న టీమిండియా మాజీ వైస్ కెప్టెన్ అజింక్య రహానే తిరిగి జట్టులో చోటు దక్కించుకున్నాడు. శ్రేయస్ అయ్యర్ స్థానంలో జింక్స్ ఆడుతాడని రవిశాస్త్రి చెప్పాడు. కేఎల్ రాహుల్ లేకపోవడంతో రోహిత్ శర్మకు జోడీగా శుబ్‌మన్ గిల్‌ను ఎంపిక చేశాడు. స్పిన్ ఆల్‌రౌండర్లు రవీంద్ర జడేజా, రవిచంద్రన్ అశ్విన్ ప్రభావం చూపుతారన్నాడు. జస్ప్రీత్ బుమ్రా లేకపోవడం లోటే కానీ.. మహ్మద్ షమీ, మహ్మద్ సిరాజ్ సత్తాచాటుతారని ధీమా వ్యక్తం చేశాడు. వికెట్ కీపర్‌గా కేఎస్ భరత్‌ను ఎంచుకున్నాడు.
రవిశాస్త్రి జట్టు:
రోహిత్ శర్మ (కెప్టెన్), శుబ్‌మన్ గిల్, ఛతేశ్వర్ పుజారా, విరాట్ కోహ్లి, అజింక్య రహానే, రవీంద్ర జడేజా, కేఎస్ భరత్ (వికెట్ కీపర్), శార్దూల్ ఠాకూర్, రవిచంద్రన్ అశ్విన్, మహ్మద్ షమీ, మహ్మద్ సిరాజ్.
Also Read: Maruti Suzuki Jimny: ఇండియన్ మార్కెట్లోకి మారుతి సుజుకి జిమ్నీ.. ఫీచర్స్ చూస్తే ఫిదా అవ్వాల్సిందే
Also Read: Trikone Rajyog: శని శుభ గడియలు మొదలు.. 28 రోజుల తరువాత ఈ రాశుల వారికి ఉద్యోగంలో ప్రమోషన్!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook.