Google Pixel 7A Offers: 44 వేల గూగుల్ పిక్సెల్ 7ఏ స్మార్ట్‌ఫోన్ కేవలం 10 వేలకే

Google Pixel 7A Offers: ప్రముఖ టెక్ దిగ్గజ కంపెనీ గూగుల్‌కు చెందిన గూగుల్ పిక్సెల్ 7ఏ కొనుగోలు చేద్దామనుకుంటున్నారా..ఇదే మంచి అవకాశం. అద్భుతమైన, కలలో కూడా ఊహించని ఆఫర్‌తో ఈ స్మార్ట్‌ఫోన్ మీరు సొంతం చేసుకోవచ్చు.  

Written by - Md. Abdul Rehaman | Last Updated : May 21, 2023, 12:55 PM IST
Google Pixel 7A Offers: 44 వేల గూగుల్ పిక్సెల్ 7ఏ స్మార్ట్‌ఫోన్ కేవలం 10 వేలకే

Google Pixel 7A Offers: గూగుల్ కంపెనీ స్మార్ట్‌ఫోన్ అంటే అదో ప్రత్యేకత. కెమేరా క్లారిటీ, పిక్సెల్, రిజల్యూషన్ అన్నీ అద్భుతమే. అందుకే చాలామంది గూగుల్ పిక్సెల్ స్మార్ట్‌ఫోన్స్ లాంచ్ కోసం ఎదురుచూస్తుంటారు. గూగుల్ పిక్సెల్ 6ఏ తరువాత ఇప్పుడు ఇండియాలో గూగుల్ పిక్సెల్ 7ఏ అందుబాటులో ఉంది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి..

గూగుల్ పిక్సెల్ 7ఏ ఇటీవలే ఇండియాలో లాంచ్ అయింది. లాంచ్ సందర్భంగా ఈ స్మార్ట్‌ఫోన్‌పై భారీ డిస్కౌంట్ అందుబాటులో ఉంది. ఈ ఆఫర్ అప్లై చేసుకుంటే చాలు. గూగుల్ పిక్సెల్ 7ఏపై ఉన్న వివిధ ఆఫర్ల గురించి తెలుసుకుందాం..

గూగుల్ పిక్సెల్ 7ఏను అసలు ధర కంటే తక్కువకే కొనుగోలు చేయవచ్చు. ప్రముఖ ఈ కామర్స్ వేదిక ఫ్లిప్‌కార్ట్ ద్వారా ఈ స్మార్ట్‌ఫోన్ విక్రయాలు జరుగుతున్నాయి. ఈ సందర్భంగా ప్రత్యేక ఆఫర్లు అందుబాటులో ఉన్నాయి. ఈ ఆఫర్లను అప్లై చేయడం ద్వారా భారీ డిస్కౌంట్ లభిస్తుంది. గూగుల్ పిక్సెల్ 7ఏ 8 జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్ వేరియంట్‌తో 43,999 రూపాయలకు లభిస్తోంది. 

గూగుల్ పిక్సెల్ 7ఏ బ్యాంకు ఆఫర్లు

గూగుల్ పిక్సెల్ 7ఏ పై ఫ్లిప్‌కార్ట్‌లో బ్యాంక్ ఆఫర్లు చాలా ఉన్నాయి. ఫ్లిప్‌కార్ట్ యాక్సిస్ బ్యాంక్ కార్డుతో చెల్లింపు చేస్తే 5 శాతం క్యాష్‌బ్యాక్ వర్తిస్తుంది. అదే ఇండస్ఇండ్ బ్యాంక్ క్రెడిట్ కార్డు ద్వారా కొనుగోలు చేస్తే 10 శాతం డిస్కౌంట్ ఉంటుంది. హెచ్‌డీఎఫ్‌సి క్రెడిట్ కార్డు లేదా డెబిట్ కార్డు ద్వారా కొనుగోలు చేస్తే 4000 రూపాయలు డిస్కౌంట్ అందుతుంది. 

గూగుల్ పిక్సెల్ 7ఏపై ఎక్స్చేంజ్ ఆఫర్లు

గూగుల్ పిక్సెల్ 7ఏపై 34 వేల రూపాయలు ఎక్స్చేంజ్ డిస్కౌంట్ అందుతుంది. అయితే ఎక్స్చేంజ్ లో ఇచ్చే మీ పాత స్మార్ట్‌ఫోన్ కండీషన్, మోడల్‌ను బట్టి ఆఫర్ ఎంతనేది వర్తిస్తుంది. ఆఫర్ పూర్తిగా వర్తిస్తే 34 వేల రూపాయలు నేరుగా తగ్గుతాయి. అదే జరిగితే 43,999 రూపాయల గూగుల్ పిక్సెల్ 7ఏ స్మార్ట్‌ఫోన్ కేవలం 10 వేలకే సొంతం చేసుకోవచ్చు.

Also read; 2000 Rupees Note: బ్యాంక్‌కు వెళ్లకున్నా రూ.2000 నోట్లను ఇలా మార్చుకోండి..!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News