OTT Release Movies: సినిమాలకు వేసవి సెలవుల్లో సహజంగానే మంచి ఆదరణ ఉంటుంది. అందుకే అటు థియేటర్, ఇటు ఓటీటీల్లో సినిమాలు రిలీజ్ అవుతూ సందడి చేస్తున్నాయి. భారీ సినిమాలు లేకపోయినా చిన్న చిన్న సినిమాలు చాలానే ఉన్నాయి. టాలీవుడ్ బ్లాక్‌బస్టర్ మూవీ విరూపాక్ష సహా మరికొన్ని సినిమాలు ఈవారం ఓటీటీలో స్ట్రీమింగ్ కానున్నాయి. ఈ వారం విడుదలయ్యే థియేటర్, ఓటీటీ సినిమాలు ఇలా ఉన్నాయి..
మే 26 తేదీన రెండు సినిమాలు థియేటర్ రిలీజ్‌కు సిద్ధంగా ఉన్నాయి. అందులో ఒకటి మేమ్ ఫేమస్ కాగా రెండవది రుద్రాంగి. మేమ్ ఫేమస్.. సుమంత్ ప్రభాస్ తెరకెక్కించిన తెలుగు సినిమా. ఇందులో మణి ఈగర్ల, మౌర్య చౌదరి, సిరి రాశిలు ప్రధాన పాత్రల్లో కన్పించనున్నారు. ఇక మరో సినిమా రుద్రాంగి. ఇది కూడా టాలీవుడ్ సినిమానే. అజయ్ సామ్రాట్ తెరకెక్కించిన ఈ సినిమాలో జగపతి బాబు, ఆషిష్ గాంధి, గణవి లక్ష్మణ్, విమలా రామన్ ప్రధాన పాత్రల్లో కన్పించనున్నారు. రుద్రాంగి పాత్రలో మమతా మోహన్ దాస్ చాలా కాలం తరువాత వెండితెరపై అలరించనుంది.
ఇక ఓటీటీలో విడుదలయ్యే సినిమాలు మూడున్నాయి. ఇందులో సాయి ధరమ్ తేజ్ హీరోగా నటించి బ్లాక్ బస్టర్ హిట్ సాధించిన విరూపాక్ష నెట్‌ఫ్లిక్స్‌లో ఇవాళ అంటే మే 21 నుంచి స్ట్రీమింగ్ కానుంది. నెట్‌ఫ్లిక్స్‌లో మే 25 నుంచి హాలీవుడ్ మూవీ ప్యూబర్ స్ట్రీమింగ్కు సిద్ధంగా ఉంది. డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌లో మే 24న హాలీవుడ్ సినిమా అమెరికన్ బోర్న్ చైనీస్ ప్లే కానుంది.
ఇవాళ్టి నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో విరూపాక్ష
సాయి థరమ్ తేజ్ హీరోగా నటించిన విరూపాక్ష సినిమా ఏప్రిల్ 21న ధియేటర్ రిలీజ్ అయి హిట్‌గా నిలిచింది. ప్రపంచవ్యాప్తంగా 100 కోట్ల వసూళ్లలో సాయి ధరమ్ తేజ్ కెరీర్లోనే బిగ్గెస్ట్ హిట్ అయింది. ఏజెంట్, శాకుంతలం ఫ్లాప్ అవడంతో విరూపాక్షకు మంచి బ్రేక్ లభించింది. ఈ సమ్మర్ బిగ్గెస్ట్ హిట్ ఇదే. తెలుగులో హిట్ అయిన ఈ సినిమా తమిళం, హిందీ, మలయాళంలో మాత్రం ప్రభావం చూపించలేకపోయింది. ఇవాళ అంటే మే 21 నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ ప్రారంభమైంది. అసలైన భయం సినిమాలో ఉందంటూ విరూపాక్ష సినిమా గురించి నెట్‌ఫ్లిక్స్ ట్వీట్ చేసింది. ఈ సినిమాలో మలయాళ బ్యూటీ సంయుక్త మీనన్ హీరోయిన్గా నటించగా కార్తీక్ దండు దర్శకత్వం వహించాడు.
Also read: Ram Charan Speech : నందమూరి అభిమానుల మనసు గెలిచిన రామ్ చరణ్.. ఎన్టీఆర్‌పై స్పీచ్ అదుర్స్
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook