Blood Purification Tips: రక్తంలో వ్యర్ధాలు పేరుకుపోతే ఏం జరుగుతుంది, బ్లడ్ ప్యూరిఫై ఎలా చేయాలి

Blood Purification Tips: శరీర నిర్మాణంలో ఒక్కో భాగానికి ఒక్కో ప్రత్యేకత ఉంటుంది. శరీరమంతా ప్రవహిస్తూ పోషక పదార్ధాలు, ఆక్సిజన్ అందించేది రక్తం. ఆ రక్తమే పరిశుభ్రంగా లేకపోతే ఏమౌతుంది. ఈ ఆలోచనే భయం గొలుపుతుంది కదా. నిజమే ఇది. రక్తం శుభ్రంగా ఉండాల్సిందే.

Written by - Md. Abdul Rehaman | Last Updated : May 20, 2023, 07:33 PM IST
Blood Purification Tips: రక్తంలో వ్యర్ధాలు పేరుకుపోతే ఏం జరుగుతుంది, బ్లడ్ ప్యూరిఫై ఎలా చేయాలి

Blood Purification Tips: మనం తినే ఆహార పదార్ధాలతోనే రక్తంలో చాలావరకూ వ్యర్ధాలు పేరుకుపోతుంటాయి. ఈ వ్యర్ధాలు చర్మంపై దుష్ప్రభావం చూపిస్తుంటాయి. రక్తం ప్యూర్‌గా లేకపోవడంతో పింపుల్స్ ఇతర చర్మ సంబంధిత సమస్యలు వెంటాడవచ్చు. వెరసి రక్తం శుభ్రంగా లేకపోవడమనేది వివిధ రకాల వ్యాధులకు కారణమౌతుంది. అందుకే రక్తం ఎప్పుడూ పరిశుభ్రంగా ఉండేట్టు చూసుకోవాలి. 

అంతా బాగానే ఉంది. మరి రక్తాన్ని ఎలా శుభ్రపర్చుకోవడమంటే దీనికి సమాధానముంది. శరీరానికి అతి ముఖ్యమైనది రక్తాన్ని ఎప్పటికప్పుడు శుభ్రపర్చుకోవాలాంటే డైట్ మార్పులు అవసరం. ఎందుకంటే శరీరంలోని అన్నిఅంగాలకు కావల్సిన పోషకాల్నిఅందించేది రక్తమే అయినందున తప్పకుండా ప్యూర్‌గా ఉండాలి.  రక్తంలో వ్యర్ధాలు పేరుకుపోవడం వల్ల వివిధ రకాల వ్యాధులు చుట్టుముడుతుంటాయి. రక్తంలో వ్యర్ధ పదార్ధాల వల్ల చర్మ సంబంధిత సమస్యలు కూడా ఉత్పన్నమౌతుంటాయి. ఆరోగ్యంగా ఉండాలంటే రక్తాన్ని శుభ్రం చేయడం చాలా అవసరం. డైట్‌లో కొన్ని వస్తువుల్ని చేర్చడం ద్వారా రక్తాన్ని శుభ్రం చేయవచ్చు.

వెల్లుల్లి-తులసి ప్రయోజనాలు

రక్తాన్ని పరిశుభ్రంగా ఉంచేందుకు లేదా ఎప్పటికప్పుుడు సహజసిద్ధమైన పద్ధతిలో క్లీన్ చేసేందుకు వెల్లుల్లి, తులసితో మంచి ఫలితాలుంటాయి. వెల్లుల్లి రక్తానికి చాలా చాలా మంచిది. ఇందులో యాంటీ ఫంగల్, యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు పుష్కలంగా ఉంటాయి. వెల్లుల్లి తినడం వల్ల రక్తం శుభ్రమౌతుంది. బెల్లంతో బ్లడ్ ప్రెషర్ కూడా నియంత్రణలో ఉంటుంది. ఇక రెండవది తులసి. ఇందులో న్యూట్రియంట్లు పుష్కలంగా ఉంటాయి. తులసి ఆకుల్లో ఉండే ఆక్సిజన్ కారణంగా రక్తం శుభ్రమౌతుంది. ఇందులో యాంటీ సెప్టిక్, యాంటీ ఆక్సిడెంట్ గుణాలు ఎక్కువగా ఉంటాయి. ఇవి వ్యాధుల్ని దూరం చేయడంలో దోహదపడతాయి. తులసి రోగ నిరోధక శక్తిని పటిష్టం చేస్తుంది.

వేప-పసుపు

రక్తాన్ని శుభ్రపర్చే మరో అద్భుత ఔషధం వేపు, పసుపు. వేప రక్తాన్ని శుభ్రం చేయడంలో అద్భుతంగా పనిచేస్తుంది. ఇందులో యాంటీసెప్టిక్, యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు పుష్కలంగా ఉంటాయి. వేపాకుల్ని నమిలి తినడం వల్ల శరీరం డీటాక్స్ అవుతుంది. రక్తంలో ఉండే వ్యర్ధాలు దూరమౌతాయి. వేపాకులు శరీరాన్ని పూర్తిగా ఆరోగ్యంగా మార్చుతాయి. పసుపుతో కూడా రక్తాన్ని క్లీన్ చేసుకోవచ్చు. ఇందులోని యాంటీసెప్టిక్ గుణాలు రక్తాన్ని శుభ్రం చేస్తాయి. ఇందులో ఉండే కర్‌క్యూమిన్ ఆరోగ్యానికి ప్రయోజనకరం. పసుపు తీసుకోవడం వల్ల రెడ్ బ్లడ్ సెల్స్ పెరుగుతాయి. ఐరన్ లోపం దూరమౌతుంది. 

బీట్‌రూట్-బెల్లం

ప్రతి వంటింట్లో తప్పకుండా లభించే బీట్‌రూట్ లేదా బెల్లం లేదా రెండింటితోనూ రక్తాన్ని ప్యూరిఫై చేయవచ్చు. ముందు బీట్‌రూట్ గురించి తెలుసుకుందాం. ఇందులో యాంటీ ఆక్సిడెంట్లు, ఐరన్ పుష్కలంగా ఉంటాయి. బీట్‌రూట్‌లో బీటా సయామిన్ ఉంటుంది. ఇది రక్తాన్ని శుభ్రం చేసే పని చేస్తుంది. బీట్‌రూట్ జ్యూస్ లేదా బీట్‌రూట్ సలాడ్ రూపంలో తీసుకోవచ్చు. చాలా వ్యాధుల్ని కూడా దూరం చేస్తుంది. ఇక రెండవది బెల్లం. ఇందులో పుష్కలంగా లభించే ఐరన్ రక్తంలో పేరుకున్న వ్యర్ధాల్ని చాలా సులభంగా తొలగించగలదు. బెల్లం తినడం వల్ల ఐరన్ లోపం దూరమౌతుంది. అదే సమయంలో జీర్ణ సంబంధిత సమస్యలైన అజీర్తి, మలబద్ధకం దూరమౌతాయి. 

ప్రకృతిపరంగా విరివిగా లభించే ఈ పదార్ధాలతో రక్తాన్ని ఎప్పటికప్పుడు ప్యూరిఫై చేసుకోవచ్చు. అన్నింటినీ ఒకేసారి కాకపోయినా..ఒక్కో పదార్ధాన్ని కొన్నేసి రోజులు వినియోగిస్తూ మారుస్తుంటే మంచి ఫలితాలుంటాయి. శరీరానికి విభిన్న రకాల పోషక విలువలు అందుతాయి. అటు రక్తం పూర్తిగా ప్యూరిఫై అవుతుంది. 

Also read: Kidney Health Tips: మీ కిడ్నీలకు హాని కల్గించేది, లాభం చేకూర్చేది మీ అలవాట్లే, చెక్ చేసుకోండిలా

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News