First Cabinet Meeting In New Secretariat: నూతన సచివాలయం ప్రారంభమైన తరువాత తొలిసారి తెలంగాణ మంత్రి మండలి సమావేశం జరగనుంది. గురువారం మధ్యాహ్నం 3 గంటలకు కేబినెట్ భేటీ కానుంది. సీఎం కేసీఆర్ అధ్యక్షతన జరగనున్న ఈ సమావేశంలో పలు కీలక అంశాలపై నిర్ణయం తీసుకోనున్నారు. గవర్నర్ కోట ఎమ్మెల్సీ, అసెంబ్లీ సమావేశాల నిర్వహణ, గవర్నర్ తిరస్కరించిన బిల్లులపై చర్చించే అవకాశం ఉంది. వీటితోపాటు అనేక అంశాలపై కేబినెట్ చర్చించనుంది.
పోడు భూముల పట్టాల పంపిణీతో పాటు జూన్ 2 నుంచి తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకల నిర్వహణపై కూడా చర్చించనున్నారు. ఆవిర్భావ దినోత్సవ వేడుకలు 21 రోజులపాటు ఘనంగా నిర్వహించాలని ఇప్పటికే ప్రభుత్వం భావించిన విషయం తెలిసిందే. మంత్రి మండలి సమావేశంలో నిర్ణయం తీసుకోనున్నారు. అంతేకాకుండా అమరవీరుల స్మృతి వనం రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకల్లో ఏదో ఒక రోజు ప్రారంభించే అంశంపై తేదీని ఖరారు చేయనున్నారు. అంతేకాకుండా గవర్నర్ కోట ఎమ్మెల్సీపై కూడా నిర్ణయం తీసుకోనున్నారు. ఇప్పటికే పలువురు పేర్లను ఫైనలైజ్ చేసిన సీఎం కేసీఆర్.. కేబినెట్ సమావేశంలో ప్రస్తావించే అవకాశం ఉంది.
రాష్ట్ర ప్రభుత్వం పంపిన బిల్లులను గవర్నర్ తిరస్కరించిన నేపథ్యంలో వాటిపై కూడా మంత్రిమండలి నిర్ణయం తీసుకునే అవకాశం కనిపిస్తోంది. ఇప్పటికే 7 పెండింగ్ బిల్లులపై సుప్రీంకోర్టుకు వెళ్లింది ప్రభుత్వం. అందులో కొన్ని బిల్లులపై నిర్ణయం తీసుకున్న గవర్నర్ మరికొన్ని బిల్లులను రాష్ట్ర ప్రభుత్వం పరిశీలనకు తిప్పి పంపారు. అందులో ముఖ్యంగా పురపాలక నిబంధన చట్ట సాధన బిల్ ప్రైవేట్ యూనివర్సిటీలో చట్ట సవరణ బిల్‌పై రాష్ట్ర ప్రభుత్వం మళ్లీ సవరించి వచ్చే అసెంబ్లీ సమావేశాల్లో ఈ బిల్లులను పెట్టి గవర్నర్‌కు పంపే అవకాశం ఉంది. అంతేకాకుండా వైద్య విద్య లో విభాగాధిపతుల వయో పరిమితి బిల్‌ను గవర్నర్ తిరస్కరించి పంపింది. దీనిపై క్యాబినెట్ ఓ నిర్ణయం తీసుకునే అవకాశం కనిపిస్తోంది. ఈ బిల్లులకు సంబంధించి అసెంబ్లీ సమావేశాలను కూడా రెండు మూడు రోజులపాటు నిర్వహించేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. అయితే దీనిపై కూడా క్యాబినెట్లో చర్చ జరిగే అవకాశం ఉంది.
అదేవిధంగా తెలంగాణ క్యాబినెట్ సమావేశంలో రాజకీయపరమైన అంశాలు కూడా చర్చకు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎన్నికల సమయం సమీపిస్తుండటంతో పలు అభివృద్ధి కార్యక్రమాలతో పాటు శంకుస్థాపనలు, పూర్తయిన ప్రారంభోత్సవాలు, కేంద్ర ప్రభుత్వ వైఖరిని ప్రజల్లోకి తీసుకెళ్లేలా వ్యూహ రచన తదితర అంశాలపై సీఎం కేసీఆర్ మంత్రులకు దిశా నిర్దేశం చేయనున్నట్లు తెలుస్తోంది.
Also Read: Pawan Kalyan: 'పాపం పసివాడు..' అంటూ సీఎం జగన్‌కు పవన్ కళ్యాణ్ కౌంటర్
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి