Apara Ekadashi 2023 Significance: హిందూ మతంలో ఏకాదశి తిథికి చాలా ప్రత్యేకత ఉంది. జ్యేష్ఠ మాసంలోని కృష్ణ పక్షంలో వచ్చే ఏకాదశని అపర ఏకాదశి అంటారు. ఈ ఏకాదశి మే 15వ తేదీ సోమవారం నాడు జరుపుకోనున్నారు. ఈ పవిత్రమైన దినాన శ్రీ మహావిష్ణువును పూజిస్తారు. ఈ ఏకాదశి నాడు ప్రత్యేక పూజలు చేయడంతోపాటు దాన ధర్మాలు చేయడం వల్ల పూర్వీకుల ఆత్మకు శాంతి చేకూరుతుంది. అంతేకాకుండా మీకు అన్ని పాపాల నుండి విముక్తి లభిస్తుంది. అపర ఏకాదశి శుభ ముహూర్తం, ప్రాముఖ్యత గురించి తెలుసుకోండి.
పూజా సమయం
జ్యోతిష్య శాస్త్రం ప్రకారం, ఈ సంవత్సరం అపర ఏకాదశి వ్రతం మే 15న జరుపుకోనున్నారు. ఈ ఏకాదశినే అచల ఏకాదశి అని కూడా పిలుస్తారు. మే 15వ తేదీ తెల్లవారుజామున 02.46 గంటల నుండి మే 16వ తేదీ ఉదయం 01.03 గంటల వరకు శుభ సమయం ఉంటుంది.
ప్రాముఖ్యత
ప్రతి నెలా రెండు ఏకాదశుల ఉంటాయి. ఇందులో ఒకటి శుక్లపక్ష ఏకాదశి, మరొకటి కృష్ణపక్ష ఏకాదశి. ఈ పవిత్రమైన రోజుల్లో శ్రీహరిని పూజిస్తారు. ఈరోజున పూజ చేయడం వల్ల దుష్ట శక్తుల నుండి విముక్తి లభిస్తుంది. ఈరోజున ప్రత్యేక పూజలు చేయడం వల్ల మీ జీవితంలోని కష్టాలన్నీ తొలగిపోతాయి. ఈరోజు చేసే పనులు మీ పూర్వీకులను సంతోషపరుస్తాయి. దాంతో వారు తమ ఆశీస్సులను మీపై కురిపిస్తారు.
Also Read: Astrology: మరో 2 రోజుల్లో వృషభ రాశిలో ఊహించని పరిణామం.. ఈ 5 రాశులవారు డబ్బు నష్టపోవడం ఖాయం..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook