Minister KTR's First Sign in Telangana New Secretariat: కొత్త సచివాలయంలో మంత్రి కేటీఆర్ తొలి సంతకం చేయనున్నారు అంటూ ఇప్పుడు ఓ కొత్త వార్త వైరల్ అవుతోంది. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మించిన నూతన సచివాలయం ఏప్రిల్ 30న ప్రారంభోత్సవం జరుపుకోనున్న నేపథ్యంలో కొత్త సచివాలయంలోకి అడుగుపెట్టాకా మంత్రి కేటీఆర్ ముందుగా హైదరాబాద్ నగరంలో లక్ష మందికి డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల పంపిణీ చేసే మార్గదర్శకాల ఫైలుపై తొలి సంతకం చేయనున్నట్టు తెలుస్తోంది.
రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన డాక్టర్ బీ.ఆర్. అంబేద్కర్ నూతన సచివాలయ భవనంలో తనకు కేటాయించిన కార్యాలయంలోకి రేపు ఆదివారం మంత్రి కల్వకుంట్ల తారకరామారావు అడుగుపెట్టబోతున్నారు. కొత్తగా నిర్మించిన సచివాలయం 3వ అంతస్తులో మంత్రి కేటీఆర్ బాధ్యతలు నిర్వర్తిస్తున్న శాఖల కార్యాలయం ఏర్పాటు చేశారు.
ఇకపై మంత్రి కేటీఆర్ అక్కడి నుంచే తన విధులను నిర్వర్తించనున్న నేపథ్యంలో ఆదివారమే మంత్రి కేటీఆర్ డబుల్ బెడ్ రూమ్ ఇళ్లకు సంబంధించిన కీలక దస్త్రాలపై సంతకం చేయనున్నారు. అదేంటంటే.. హైదరాబాద్ నగరంలో గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో ప్రభుత్వం నిర్మించ తలపెట్టిన లక్ష డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల కేటాయింపు ప్రక్రియకు సంబంధించిన మార్గదర్శకాల ఫైలుపై మంత్రి కల్వకుంట్ల తారక రామారావు తొలి సంతకం చేయనున్నారు అని సమాచారం అందుతోంది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , FacebooK