IPL Controversies: ఐపీఎల్ చరిత్రలో అతిపెద్ద వివాదాలు ఇవే.. ఎన్నటికీ మరువని ఘటనలు

Biggest Controversies In Indian Premier League: క్రికెట్ అభిమానులను ఎంతో అలరిస్తున్న ఐపీఎల్‌లో కొన్ని వివాదాలు కూడా ఉన్నాయి. మైదానంలో క్రికెటర్లు గొడవ పడడం.. ఫిక్స్ంగ్ ఆరోపణలు ఐపీఎల్ చరిత్రలో అభిమానులు ఎన్నటికీ మర్చిపోలేని ఘటనలు. ఐపీఎల్‌లో అతి పెద్ద వివాదాలు గురించి తెలుసుకుందాం.. 
 

1 /5

ఐపీఎల్‌ 2008లో ప్రారంభం అవ్వగా.. అదే సీజన్‌లో వివాదాలు కూడా మొదలయ్యాయి. స్పీడ్ స్టార్ శ్రీశాంత్‌పై హర్భజన్ సింగ్ చెంపదెబ్బ కొట్టడం కలకలం రేపింది. శ్రీశాంత్ మైదానంలోనే కన్నీళ్లు పెట్టుకున్నాడు. ఆ తరువాత హర్భజన్ సింగ్ డ్రెస్సింగ్ రూమ్‌కి వెళ్లి శ్రీశాంత్‌కి క్షమాపణలు చెప్పాడు. ఈ ఘటనతో హర్భజన్ సింగ్ 11 మ్యాచ్‌ల నిషేధానికి గురయ్యాడు.    

2 /5

2013 సీజన్‌లో ఐపీఎల్‌కు మాయని మచ్చగా మిగిలిపోయింది. ఈ సీజన్‌లో ముగ్గురు ఆటగాళ్లపై స్పాట్ ఫిక్సింగ్ ఆరోపణలు వచ్చాయి. శ్రీశాంత్, అంకిత్ చవాన్, అజిత్ చండిలాలను ఆటగాళ్లను పోలీసులు అరెస్ట్ చేశారు. రాజస్థాన్ రాయల్స్, చెన్నై సూపర్ కింగ్స్ జట్లపై బీసీసీఐ రెండేళ్ల పాటు నిషేధం విధించింది. ఫిక్సింగ్‌కు పాల్పడిన ఆటగాళ్లపై జీవితకాల నిషేధం విధించారు.  

3 /5

2013 సీజన్‌లోనే కోల్‌కతా నైట్ రైడర్స్, ఆర్‌సీబీ మధ్య జరిగిన మ్యాచ్‌లో విరాట్ కోహ్లీ, గౌతమ్ గంభీర్ మధ్య గొడవ జరిగింది. కోహ్లీ ఔట్ అయి పెవిలియన్‌కు వెళుతుండగా.. అప్పటి కేకేఆర్ కెప్టెన్ గౌతమ్ గంభీర్‌తో వాగ్వాదానికి దిగాడు. ఆ తర్వాత ఇద్దరూ వాదించుకోవడం కనిపించింది. ఇతర ఆటగాళ్లు, అంపైర్లు వచ్చి ఇద్దరికీ సర్దిచెప్పారు.  

4 /5

ఐపీఎల్ 2012 సీజన్‌లో కేకేఆర్ యజమాని షారుక్ ఖాన్ వాంఖడే స్టేడియంలోకి ప్రవేశించకుండా నిషేధానికి గురయ్యాడు. గ్రౌండ్స్‌మెన్‌పై దాడి చేసినందుకు ఆయనపై నిషేధం విధించారు. ఈ నిషేధాన్ని 2015లో ఎత్తివేశారు.

5 /5

ముంబై ఇండియన్స్ ఆల్ రౌండర్ కీరన్ పొలార్డ్, ఆర్‌సీబీ బౌలర్ మిచెల్ స్టార్క్ గ్రౌండ్‌లో గొడవ జరిగింది. స్టార్క్‌పై కోపంతో కీరన్ పొలార్డ్ బ్యాట్‌ను విసిరాడు. అయితే బ్యాట్ స్టార్క్‌కు తగలలేదు. ఇందుకు సంబంధించిన వీడియో బాగా వైరల్ అయింది.