Chandra Grahan 2023: చంద్ర గ్రహణం రోజున ఈ పరిహారం చేస్తే.. ఉద్యోగ, వ్యాపారాలలో గొప్ప విజయం మీ సొంతం!

For every success Do these remedies on Lunar Eclipse 2023. జ్యోతిషశాస్త్రంలో చంద్ర గ్రహణం రోజు కోసం కొన్ని ప్రభావవంతమైన చర్యలు ఉన్నాయి. ఈ చర్యలు చేయడం వల్ల కెరీర్‌లో పురోగతి ఉంటుంది.  

Written by - P Sampath Kumar | Last Updated : Apr 25, 2023, 04:03 PM IST
Chandra Grahan 2023: చంద్ర గ్రహణం రోజున ఈ పరిహారం చేస్తే.. ఉద్యోగ, వ్యాపారాలలో గొప్ప విజయం మీ సొంతం!

Do these remedies on Chandra Grahan 2023 For Great success in business and job: ఈ ఏడాది రెండు సూర్య గ్రహణాలు, రెండు చంద్ర గ్రహణాలు ఏర్పడనున్నాయి. తొలి సూర్య గ్రహణం ఏప్రిల్ 20న ఏర్పడింది. ఇక తొలి చంద్ర గ్రహణం మే 5న ఏర్పడనుంది. ఈ చంద్ర గ్రహణం (Lunar Eclipse 2023) వైశాఖ పూర్ణిమ రోజున ఏర్పడుతోంది. బుద్ధ పూర్ణిమను వైశాఖ పూర్ణిమ రోజున జరుపుకుంటారు. జ్యోతిషశాస్త్రంలో చంద్ర గ్రహణం రోజు కోసం కొన్ని ప్రభావవంతమైన చర్యలు ఉన్నాయి. ఈ చర్యలు చేయడం వల్ల కెరీర్‌లో పురోగతి ఉంటుంది. ఉద్యోగ-వ్యాపారంలో విజయం మీ సొంతం అవుతుంది. మీరు కూడా మీ కెరీర్‌లో పురోగతి సాధించాలనుకుంటే మే 5న ఈ చర్యలు చేయండి.

చంద్ర గ్రహణం (Lunar Eclipse 2023 Remedies) పరిహారాలు: 
# మీరు వ్యాపారంలో లాభం పొందాలనుకున్నా, విజయం సాధించాలనుకున్నా.. చంద్ర గ్రహణం రోజున మీ వ్యాపార స్థలంలో గోమతీ చక్రాన్ని స్థాపించండి. తరువాత లక్ష్మిదేవి బీజ్ మంత్రాన్ని 16 సార్లు జపించండి. ఈ గోమతీ చక్రాన్ని రోజూ పూజించండి. మీరు గోమతీ చక్రాన్ని స్థాపించలేకపోతే.. కనీసం గోమతీ చక్రాన్ని పచ్చి పాలతో శుద్ధి చేసి దానిపై పసుపు గంధంతో తిలకం పూయండి. ఆపై పసుపు గుడ్డలో చుట్టి ఖజానాలో ఉంచండి. డబ్బు రాక వేగవంతం అవుతుంది. 

# ఉద్యోగంలో పురోగతి కోసం చంద్ర గ్రహణం రోజున కాకులకు తీపి అన్నం పెట్టండి. ఇలా చేయడం వల్ల ఉద్యోగంలో ఉన్న అడ్డంకులు తొలగిపోతాయి. ప్రగతి పథం తెరుచుకుంటుంది. మీకు ప్రమోషన్ లభించడమే కాకూండా జీతంలో పెరుగుదల ఉంటుంది.

# జీవితంలో విజయం సాధించడానికి లేదా ప్రతి రంగంలో విజయం సాధించాలనుకుంటే చంద్రగ్రహణం రోజున తాళం కొనండి. చంద్ర గ్రహణం రాత్రి తాళం తెరిచి ఆకాశం క్రింద ఉంచండి. మరుసటి రోజు ఈ తాళాన్ని దేవాలయంలో ఉంచండి. దీంతో మీ జీవితంలో వచ్చే అడ్డంకులు తొలగిపోతాయి. మీరు దానిని ఆలయంలో ఉంచలేకపోతే.. నదిలో కూడా వేయొచ్చు.

Also Read: Vodafone Idea Rs 549 Plan: 6 నెలల చౌకైన ప్లాన్‌ని తీసుకొచ్చిన వోడాఫోన్ ఐడియా.. ప్రయోజనాలు తెలిస్తే ఇప్పుడే పోర్ట్ కొడుతారు!  

Also Read: Nokia 105 4G 2023: సూపర్ ఫోన్‌ను విడుదల చేసిన నోకియా.. ధర కూడా తక్కువే! బ్యాటరీ అస్సలు అయిపోదు  

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe

TwitterFacebook మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

 

Trending News