Hanshraj Yog on Surya Grahan 2023 : ఈ సంవత్సరంలో మొదటి సూర్యగ్రహణం కొన్ని గంటల్లోనే ప్రారంభమైంది. గురువారం ఉదయం 07.05 గంటలకు ప్రారంభమై మధ్యాహ్నం 12.29 వరకు ముగుస్తుంది. ఈ గ్రహణం ప్రభావం భారత్ పై లేకపోవడం వల్ల సూతక కాలం కూడా లేదని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. అయితే ఈ క్రమంలో పలు గ్రహ సంచారాలు కూడా జరుగుతున్నాయి. కాబట్టి అత్యంత పవిత్రమైన హంసరాజ్ యోగం కూడా ఏర్పడుతోంది. కాబట్టి ఈ క్రమంలో పలు రాశుల వారికి కలిసి రాబోతోంది. అయితే ఈ యోగం వల్ల ఏయే రాశులవారు ఎలాంటి ప్రయోజనాలు పొందుతారో ఇప్పుడు తెలుసుకుందాం.
హంసరాజ్ యోగం ప్రభావంతో ఈ రాశులవారికి లాభాలు:
వృషభం:
సూర్యగ్రహణం సమయంలో ఏర్పడే హంస రాజయోగం వల్ల వృషభ రాశి వారికి చాలా రకాల ప్రయోజనాలను చేకుర్చుతుందని నిపుణులు చెబుతున్నారు. ఈ క్రమంలో వీరికి ఆర్థిక పరిస్థితి మెరుగుపడమే కాకుండా చాలా రకాల లాభాలు కలుగుతాయని నిపుణులు చెబుతున్నారు. నిలిచిపోయిన పనులన్నీ త్వరగా పూర్తవుతాయి. అంతేకాకుండా గ్రహణం కారణంగా కుటుంబ జీవితంలో సంతోషకరమైన వాతావరణం నెల కొంటుంది. ఈ సమయంలో ఎలాంటి పెట్టుబడులు పెట్టిన చాలా లాభాలు పొందుతారు.
కన్య రాశి:
కన్యా రాశి వారికి కూడా ఈ క్రమంలో చాలా రకాల ప్రయోజనాలు కలుగుతాయి. ఆర్థికంగా లాభాలు పొందడమేకాకుండా వ్యాపారాల్లో లాభాలు కూడా పొందుతారు. కార్యాలయంలో పురోగతికి అవకాశాలు కూడా లభిస్తాయి. వివాహానికి సంబంధించిన సమస్యలు ఉంటే సులభంగా దూరమవుతాయి. కుటుంబం నుంచి పూర్తి మద్ధతు లభించి మనస్సుకు ప్రశాంతత కలుగుతుంది.
మీన రాశి:
సూర్యగ్రహణం కారణంగా మీన రాశివారికి ఆదాయంలో మార్పులు వస్తాయి. కాబట్టి సులభంగా కొత్త అవకాశాలు పొందుతారు. ఉన్నతాధికారులతో వీరు సన్నిహితంగా ఉంటారు. ఈ క్రమంలో ఎలాంటి పనులు చేసిన మంచి ఫలితాలు పొందుతారు. ఉద్యోగంలో ప్రమోషన్, ఇంక్రిమెంట్ వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి. కాబట్టి తప్పకుండా ఈ క్రమంలో జాగ్రత్తలు పాటించాల్సి ఉంటుంది.
(నోట్: ఇక్కడ ఇవ్వబడిన సమాచారం సాధారణ నమ్మకాలు, సమాచారంపై ఆధారపడి ఉంటుంది. ZEE NEWS దానిని ధృవీకరించలేదు.)
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook