Most Runs In IPL: ప్రతి సీజన్లో తరహాలో ఈ ఐపీఎల్లో కూడా పరుగుల వరద పారుతోంది. ముంబై ఇండియన్స్ కెప్టెన్ రోహిత్ శర్మ మరో మైలురాయిని చేరుకున్నాడు. విరాట్ కోహ్లీ, శిఖర్ ధావన్ తర్వాత ఐపీఎల్లో 6 వేల పరుగులు పూర్తి చేసిన మూడో భారత బ్యాట్స్‌మెన్‌గా నిలిచాడు. ఐపీఎల్ చరిత్రలో ఎక్కువ పరుగులు చేసిన ఆటగాళ్లు ఎవరంటే..?
రాయల్ ఛాలెంజర్స్ బెంగుళూరు మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ ఐపీఎల్లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్లలో టాప్ ప్లేస్‌లో ఉన్నాడు. కోహ్లీ ఇప్పటివరకు 228 మ్యాచ్‌లు ఆడి.. 6,844 పరుగులు చేశాడు. (Photo:BCCI/IPL)
పంజాబ్ కింగ్స్ కెప్టెన్ శిఖర్ ధావన్ ఈ జాబితాలో రెండోస్థానంలో ఉన్నాడు. ఇప్పటివరకు 210 ఐపీఎల్ మ్యాచ్‌లు ఆడిన ధావన్.. 6,477 రన్స్ చేశాడు. ఐపీఎల్లో ధావన్ 2 శతకాలు, 49 అర్ధసెంచరీలు బాదాడు. (Photo:BCCI/IPL)
ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్ డేవిడ్ వార్నర్ ఐపీఎల్లో ఎక్కువ పరుగులు చేసిన విదేశీ ప్లేయర్లలో మొదటిస్థానంలో.. ఓవరాల్‌గా మూడోస్థానంలో ఉన్నాడు. వార్నర్ ఇప్పటివరకు 167 మ్యాచ్‌లు ఆడి.. 6,109 పరుగులు చేశాడు. (Photo:BCCI/IPL)
ముంబై ఇండియన్స్ కెప్టెన్ రోహిత్ శర్మ ఇప్పటివరకు 232 ఐపీఎల్ మ్యాచ్‌లు ఆడాడు. 6,014 పరుగులతో నాలుగో స్థానానికి చేరాడు. ఐపీఎల్లో రోహిత్‌కు ఒక సెంచరీ, 41 అర్ధసెంచరీలు ఉన్నాయి. (Photo:BCCI/IPL)
ఆర్సీబీ మాజీ బ్యాట్స్‌మెన్, మిస్టర్ 360 ఏబీ డివిలియర్స్ 184 ఐపీఎల్ మ్యాచ్‌ల్లో 5,162 రన్స్ చేశాడు. ఐపీఎల్లో 3 సెంచరీలు, 40 అర్ధసెంచరీలు నమోదు చేశాడు డివిలియర్స్. (Photo:BCCI/IPL)