World Heritage Day 2023: భారత్‌లో వారసత్వ, చారిత్రక కట్టడాలు ఇవే! కాపాడుకోవాల్సిన బాధ్యత మనదే..


World Heritage Day 2023: వారసత్వ, చారిత్రక కట్టడాలను కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిది. కాబట్టి చరిత్రక కట్టడాలను కాపాడుకునేందుకు ప్రపంచ వారసత్వ దినోత్సవాన్ని జరుపుకుంటారు.

 

  • Apr 18, 2023, 12:49 PM IST

World Heritage Day 2023: ప్రపంచవ్యాప్తంగా చారిత్రక వారసత్వంగా వస్తున్న ప్రదేశాలు చాలు ఉన్నాయి. ఈ ప్రదేశాలకు గొప్ప చరిత్ర దాగి ఉంటుంది. అయితే వీటిని చూడడానికి దేశాలను దాటి వెళ్లి కూడా చూస్తారు. అలాంటి వారసత్వాన్ని కాపాడుకోవడం కోసమే ప్రపంచ వారసత్వ దినోత్సవాన్ని జరుపుకుంటారు. ఈ దినోత్సవాన్ని ప్రతి సంవత్సరం ఏప్రిల్ 18న జరుపుకుంటారు. ఈ రోజు కొన్ని దేశాల ప్రజలు వారసత్వ ప్రదేశాలను సందర్శించి వాటిని ఎలా కాపాడుకోవాలో ప్రచారం చేస్తారు. అయితే మన భారతదేశంలో ఉన్న టాప్‌ ఫైవ్‌ వారసత్వంగా వస్తున్న ప్రదేశాల గురించి మనం తెలుసుకుందాం.

 

1 /5

ప్రపంచంలోని ఏడు అద్భుతాలలో ఒకటి తాజ్ మహల్.. ఈ చరిత్రక కట్టడానికి యునెస్కో ప్రపంచ వారసత్వ గుర్తింపు కూడా ఇచ్చింది. అయితే యునెస్కో గుర్తించిన కట్టడాల్లో తాజ్‌ మహల్‌ మొదటిది. ఈ కట్టడం యమునా నది ఒడ్డున ఉండడంతో ఎంతో అందంగా కనిపిస్తుంది. కాబట్టి పర్యాటకులకు ఆకర్షనీయంగా కనిపిస్తుంది.

2 /5

పోర్చుగీస్ భవనాల స్టైల్‌ ఉన్న చర్చిలు, కాన్వెంట్‌లు కాథలిక్  భవనాలకు విశేష గుర్తింపు ఉంది. ఇవి పురాతన వాస్తుశిల్పతో ఉండడం వల్ల ఈ చర్చిలు చాలా అందంగా కనిపిస్తాయి. అయితే వీటిని చూసేందుకు ఇతర దేశాల పర్యాటకులు కూడా పెద్ద ఎత్తున వస్తారు.  

3 /5

ఉత్తరాఖండ్‌లోని చమోలిలోని వ్యాలీ ఆఫ్ ఫ్లవర్స్ నేషనల్ పార్క్‌కు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఇది పచ్చిక భూములు  ప్రకృతి సౌందర్యానికి ప్రసిద్ధి చెందింది. అంతేకాకుండా ఇక్కడ ఆసియాటిక్ నల్ల ఎలుగుబంటితో పాటు మంచు చిరుత, నీలి గొర్రెలు నివసిస్తాయి.  

4 /5

విజయనగర సామ్రాజ్యం అంటే అందరికీ తెలిసిందే.. ఇక్కడ 1500 ADలో నిర్మించిన చాలా రకాల అద్భుతమైన కట్టడాలున్నాయి. ఇది ప్రపంచంలో రెండవ అతిపెద్ద నగరం. హంపి విజయనగర సామ్రాజ్యంలో నిర్మాణాల శిథిలాలు ఇప్పటికీ ఉన్నాయి.

5 /5

కాజిరంగా నేషనల్ పార్క్ గురించి చెప్పనక్కర్లేదు. ఇది వన్యప్రాణులకు ఓ అద్భుత నిలయం. ఇది ప్రాచీన కాలం నుంచి వస్తోంది. కాజిరంగా నేషనల్ పార్క్ 430 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉంటుంది. ఇది చిత్తడి మడుగులతో నిండి ఉంటుంది.