Face Mask: 22 మైళ్ల దూరం ఎందుకు పరుగెట్టాల్సి వచ్చింది ?

కరోనా వైరస్ సంక్రమణను ( Corona spread ) నివారించేందుకు ముఖ్యమైన సాధనం ఫేస్‌మాస్క్. అయితే ఫేస్‌మాస్క్ ( Face mask ) ను వ్యతిరేకించావారు కూడా ప్రపంచంలో ఉన్నారిప్పుడు. ఈ నిరసనకారులంతా కలిసి హైపోక్సియా పురాణాల్ని విన్పిస్తున్నారు. మరి అతను అంతదూరం ఫేస్‌మాస్క్ తో ఎందుకు పరుగెట్టాల్సి వచ్చింది?

Last Updated : Jul 28, 2020, 05:13 PM IST
Face Mask: 22 మైళ్ల దూరం ఎందుకు పరుగెట్టాల్సి వచ్చింది ?

కరోనా వైరస్ సంక్రమణను ( Corona spread ) నివారించేందుకు ముఖ్యమైన సాధనం ఫేస్‌మాస్క్. అయితే ఫేస్‌మాస్క్ ( Face mask ) ను వ్యతిరేకించావారు కూడా ప్రపంచంలో ఉన్నారిప్పుడు. ఈ నిరసనకారులంతా కలిసి హైపోక్సియా పురాణాల్ని విన్పిస్తున్నారు. మరి అతను అంతదూరం ఫేస్‌మాస్క్ తో ఎందుకు పరుగెట్టాల్సి వచ్చింది?

కోవిడ్ 19 వైరస్ ( Covid19 Virus )  మహమ్మారిగా మారి ప్రపంచమంతా వ్యాపించేసింది. ఫేస్‌మాస్క్ ధరించడం, సోషల్ డిస్టెన్సింగ్ పాటించడం, శానిటైజర్ వాడటం వంటివి చేయడం ద్వారా వ్యాప్తిని అరికట్టవచ్చు. అయితే ఇంతటి విపత్కర పరిస్థితుల్లో కూడా ఫేస్‌మాస్క్  నిరసనకారులు ఉండనే ఉన్నారు. ఫేస్‌మాస్క్ వాడటం వల్ల ఆక్సిజన్ సరఫరా తగ్గుతుందంటూ హైపోక్సియా ( Hypoxia ) వంటి వెర్రి కధలు విన్పించసాగారు.

ఈ పురాణాలకు చెక్ పెట్టడానికి ఇప్పటికే ఓ వైద్యుడు ఏకంగా ఆరు సర్జికల్ మాస్క్ లు వేసుకుని ఆక్సిజన్ సరఫరా చెక్ చేయించుకున్నాడు. ఏ మాత్రం మార్పు లేదు. యధావిధిగానే ఉన్నాయి. అన్నీ సాధారణ పరిమితుల్లోనే ఉన్నట్టు నిర్ధారణైంది.

ఇప్పుడు మరో వైద్యుడు హైపోక్సియా పురాణాన్ని దూరం చేయడం కోసం ఓ సాహసం చేశాడు. ఫేస్‌మాస్క్ ధరించి ఏకంగా 22 మైళ్ల దూరం పరుగెత్తాడు. ఇంగ్లండ్ యార్క్‌షైర్ ( Yorkshire ) కు చెందిన బ్రాడ్‌ఫోల్డ్ రాయల్ మెడికల్ కాలేజ్( Broadfold Royal medical college ) డాక్టర్ టామ్ లాటన్ ఈ పని చేశాడు. ఫేస్‌మాస్క్ ( Face mask ) లపై నెలకొన్న తప్పుడు కధనాలు, వార్తల్ని ఖండించేందుకు ఫేస్‌మాస్క్ తో లాంగ్‌రన్‌కు ఉపక్రమించాడు. పరుగెట్టే సమయంలో ఆక్సిజన్ సరఫరా 98 శాతం కంటే తక్కువకు పడిపోలేదని నిరూపించాడు. మాస్క్‌లు ధరించడానికి ఇష్టపడనివారే ఏదో ఒక సాకును వెతుకుతుంటారని డాక్టర్ టామ్ స్పష్టం చేశారు. Also read: Corona Virus: లావుగా ఉన్నవారిలో కరోనా ప్రమాదం ఎందుకు ఎక్కువ ?

కోవిడ్ మహమ్మారి సమయంలో పల్స్ ఆక్సిమీటర్ కొనడం మంచి ఆలోచనగా డాక్టర్ టామ్ చెప్పారు. కోవిడ్ 19 పాజిటివ్ గా తేలితే ఈ టూల్ చాలా ఉపయోగకరంగా ఉంటుందన్నారు. ఆక్సిజన్ స్థాయిని ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ...వైద్య సహాయం అవసరమా లేదా అనేది నిర్ణయించుకోవచ్చు. Also read: Sex Tips: రాత్రి రతీ క్రీడకు ఇలా సిద్ధం అవ్వండి

Trending News