Henna Hair Pack For White Hair To Black Hair: తెల్ల జుట్టు సమస్యలతో బాధపడేవారు చాలా మంది మార్కెట్‌లో లభించే చాలా రకాల రసాయనాలతో కూడిన ప్రోడక్ట్స్ వినియోగిస్తున్నారు. అయితే వీటిని వినియోగించడం వల్ల భవిష్యత్‌లో జుట్టు సమస్యలు తీవ్రతరమయ్యే ఛాన్స్ ఉందని నిపుణులు సూచిస్తున్నారు. నిపుణులు అభిప్రాయం ప్రకారం..పలు ఔషధ గుణాలు కలిగిన హెయిర్ కలర్‌ను వినియోగించడం వల్ల తెల్ల జుట్టు నుంచి సులభంగా ఉపశమనం పొందొచ్చు. ముఖ్యంగా హెన్నతో చేసిన హెయిర్ కలర్‌ను వాడడం వల్ల జుట్టు తొందరగా నల్లబడుతుందని నిపుణులు చెబుతున్నారు. అయితే ఈ హెన్న హెయిర్ మాస్క్‌ను ఎలా తయారు చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.
హెన్న హెయిర్ మాస్క్ తయారికీ కావాల్సిన పదార్థాలు:
100 గ్రా హెన్న
1 నిమ్మకాయ
1 టీ స్పూన్ కాఫీ పౌడర్
సరిపడ నీరు
Also Read: Samantha Shaakuntalam : శాకుంతలం పరిస్థితి ఇంతలా దిగజారిందా?.. ఇదే నిదర్శనం
తయారీ విధానం:
ముందుగా హెన్న హెయిర్ మాస్క్‌ను తయారు చేయడానికి ఒక బౌల్‌ను తీసుకోవాల్సి ఉంటుంది.
మొదట ఆ గిన్నెలో హెన్నను వేసి.. నిమ్మరసం పిండాల్సి ఉంటుంది.
ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత 1 టీ స్పూన్ కాఫీ పౌడర్ వేసి మళ్లీ కలుపుకోవాలి.
ఇలా అన్ని మిశ్రమాలను ఒకేసారి కలుపుకుని 15 నుంచి 20 నిమిషాలు పక్కన పెట్టాల్సి ఉంటుంది.
అంతే ఎంతో సులభంగా హెయిర్ మాస్క్ తయారైట్లే..
జుట్టుకు ఇలా అప్లై చేయండి:
జుట్టుకు అప్లై చేసే ముందు జుట్టును క్లీన్ చేసుకోవాల్సి ఉంటుంది.
ఆ తర్వాత ఈ హెయిర్ మాస్క్‌ను జుట్టుకు అప్లై చేయాలి.
ఇలా అప్లై చేసిన తర్వాత 20 నుంచి 25 నిమిషాల పాటు అలాగే ఉంచాలి.
ఆ తర్వాత జుట్టును శుభ్రం చేసుకుని ఆరబెట్టుకోవాలి.
అయితే ఈ మాస్క్‌ను వినియోగించే క్రమంలో 24 గంటల తర్వాత రసాయనాలతో కూడిన షాంపూలు వినియోగించాల్సి ఉంటుంది.
Also Read: Samantha Shaakuntalam : శాకుంతలం పరిస్థితి ఇంతలా దిగజారిందా?.. ఇదే నిదర్శనం
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook