White Hair: తెల్ల జుట్టు నల్లగా మారడానికి, జుట్టు రాలడం తగ్గడానికి ఒకటే హెయిర్‌ మాస్క్‌, అది ఇదే!

White Hair Home Remedies: తెల్ల జుట్టు సమస్యలను తగ్గించేందుకు, తిరిగి నల్ల జుట్టును పొందడానికి మార్కెట్‌లో చాలా రకాల ప్రోడక్ట్స్‌ ఉన్నాయి. వీటిని చాలా మంది వినియోగిస్తున్నారు. అయినప్పటికీ ఎలాంటి ఫలితాలు పొందలేకపోతున్నారు. అయితే ఈ చిట్కాలు పాటిస్తే సులభంగా తెల్ల జుట్టు నల్లగా మారుతుంది. 

Written by - Dharmaraju Dhurishetty | Last Updated : May 21, 2023, 03:35 PM IST
White Hair: తెల్ల జుట్టు నల్లగా మారడానికి, జుట్టు రాలడం తగ్గడానికి ఒకటే హెయిర్‌ మాస్క్‌, అది ఇదే!

White Hair Home Remedies: ఆధునిక జీవనశైలి కారణంగా చాలా మందిలో చిన్న వయసులోనే తెల్ల జుట్టు సమస్యల బారిన పడుతున్నారు. అంతేకాకుండా కొందరిలో ఈ సమస్యలు అనారోగ్యకరమైన ఆహారాలు విచ్చలవిడిగా తీసుకోవడం వల్ల కూడా వస్తున్నాయి. కాబట్టి ఇలాంటి సమస్యలతో బాధపడేవారు ఖరీదైన ప్రోడక్ట్స్‌ వినియోగించకుండా పలు రకాల ఇంటి చిట్కాలు పాటించడం చాలా మంచిదని నిపుణులు చెబుతున్నారు. 

ఈ సమస్యలే కాకుండా చాలా మందిలో జుట్టు బలహీనంగా, అందహీనంగా తయారవుతుంది. దీంతో పాటు జుట్టు సులభంగా రాలిపోతోంది. ఇలాంటి సమస్యల నుంచి ఉపశమనం పొందడానికి కూడా ఆయుర్వేద నిపుణులు సూచించి చిట్కాలు ప్రభావంతంగా సహాయపడతాయి. ఈ చిట్కాలను క్రమం తప్పకుండా వినియోగించడం వల్ల తెల్ల జుట్టు సమస్యలే కాకుండా జుట్టు రాలడం సమస్యలు కూడా దూరమవుతాయి. 

Also Read: Bhuma Akhila Priya Reddy: భూమా అఖిలప్రియకు అస్వస్థత.. ఆసుపత్రికి తరలింపు  

తెల్ల జుట్టు వీటితో సులభంగా నల్లగా మారుతుంది:
ఉసిరికాయ:

తెల్ల జుట్టును నల్లగా చేసేందుకు ఉసిరికాయ ప్రభావంతంగా సహాయపడుతుందని ఆయుర్వేద నిపుణులు తెలుపుతున్నారు. ఇందులో ఉండే గుణాలు అన్ని రకాల అనారోగ్య సమస్యలకు ఔషధంగా పని చేస్తాయి. దీని కోసం 5 నుంచి 6 ఉసిరికాయలను తీసుకుని మిశ్రమంలా తయారు చేసి జుట్టుకు పట్టించాలి. ఇలా పట్టించిన 35 నుంచి 40 నిమిషాల పాటు ఆరబెట్టి శుభ్రం చేసుకుంటే మంచి ఫలితాలు కలుగుతాయి. అంతేకాకుండా జుట్టు సులభంగా నల్లగా తయారవుతుంది. 

ఉసిరికాయ హెయిర్ మాస్క్:
ఉసిరికాయ హెయిర్ మాస్క్‌ను జుట్టుకు అప్లై చేయడం వల్ల తెల్ల జుట్టు సమస్యలు దూరమవుతాయని ఆయుర్వేద నిపుణులు తెలుపుతున్నారు. ఇందులో ఉండే ఔషధ గుణాలు జుట్టు రాలడం సమస్యలను కూడా తగ్గిస్తుంది. కాబట్టి ఈ హెయిర్‌ మాస్క్‌ తయారు చేసుకోవడానికి ముందుగా ఒక గిన్నె తీసుకోవాల్సి ఉంటుంది. ఒక గిన్నెలో 2 నుంచి  3 ఉసిరికాయల నుంచి తీసిన గుజ్జును తీసుకోవాలి. ఆ తర్వాత ఇందులో ఆల్మండ్ ఆయిల్, తేనె కలిపి మిశ్రమంలా తయారు చేసుకోవాలి. ఇలా తయారు చేసుకున్న మిశ్రమాన్ని జుట్టుకు పట్టిస్తే.. సులభంగా తెల్ల జుట్టు నల్లగా మారుతుంది. అంతేకాకుండా డ్రై హెయిర్‌ సమస్యలు కూడా దూరమవుతాయి. 

ఉల్లిపాయ హెయిర్‌ మాస్క్‌:
జుట్టు రాలడాన్ని తగ్గించే ఔషధాల్లో ఉల్లిపాయ కూడా ఒకటి. ఇందులో జుట్టుకు కావాల్సిన చాలా రకాల మూలకాలు లభిస్తాయి. కాబట్ట అన్ని రకాల జుట్టు సమస్యలను తగ్గించేందుకు సహాయపడుతుంది. తెల్ల జుట్టు సమస్యలతో బాధపడేవారు ఈ ఉల్లిపాయ హెయిర్‌ మాస్క్‌ను వినియోగించడం వల్ల మంచి ఫలితాలు పొందొచ్చు. అంతేకాకుండా జుట్టు రాలడాన్ని కూడా సులభంగా నియంత్రించవచ్చని నిపుణులు చెబుతున్నారు. 

Also Read: Bhuma Akhila Priya Reddy: భూమా అఖిలప్రియకు అస్వస్థత.. ఆసుపత్రికి తరలింపు  

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe

TwitterFacebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News