Wheat Grass Juice For Weight Loss: ప్రస్తుతం బరువు పెరగడం పెద్ద సమస్యగా మారింది.. చాలామంది ఆకస్మాత్తుగ బరువు పెరుగుతున్నారు. అంతేకాకుండా పొట్ట చుట్టూ కొలెస్ట్రాల్ పెరిగి బెల్లీ ఫ్యాట్ సమస్యలు కూడా వస్తున్నాయి. దీని కారణంగా వ్యక్తులు సరైన రూపాన్ని కోల్పోయి అంద హీనంగా తయారవుతున్నారు. దీంతోపాటు చాలా దీర్ఘకాలిక వ్యాధుల బారిన కూడా పడుతున్నారు. అయితే కొంతమంది వీటిని దృష్టిలో పెట్టుకొని బరువు తగ్గేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తున్న అయినప్పటికీ ఎలాంటి ఫలితాలు పొందలేకపోతున్నారు. అయితే ఇలాంటి సమస్యలతో బాధపడేవారు తప్పకుండా జీవనశైలిలో కొన్ని మార్పులు చేసుకోవాల్సి ఉంటుంది.
బరువు తగ్గాలనుకునేవారు తప్పకుండా ఆహారాలను డైట్ పద్ధతిలో తీసుకోవాల్సి ఉంటుంది. దీంతోపాటు కేవలం ఆరోగ్యకరమైన ఆహారాలను ప్రతిరోజు తినాల్సి ఉంటుంది. ఇలా డైట్ పద్ధతిలో ఆహారాలు తీసుకునేవారు తప్పకుండా వ్యాయామాలు కూడా చేయడం చాలా మంచిదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అయితే వేగంగా బరువు తగ్గాలనుకునే వారు మాత్రం తప్పకుండా ఆరోగ్య నిపుణులు సూచించిన గోధుమ గడ్డి రసాన్ని తాగాల్సి ఉంటుంది. ఈ గడ్డి రసాన్ని ప్రతిరోజు తాగడం వల్ల శరీరానికి బోలెడు లాభాలు కలుగుతాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.
ఇది కూడా చదవండి : Independence Day 2023: స్వతంత్ర భారతావనిలో టాప్ 10 కార్లు, బైకులు
ప్రతిరోజు గోధుమ గడ్డి రసం తాగడం వల్ల శరీరానికి అనేక రకాల ప్రయోజనాలు కలుగుతాయి. గోధుమ గడ్డి రసంలో క్యాల్షియం, ఐరన్, మెగ్నీషియం, విటమిన్ సి అధిక పరిమాణంలో లభిస్తాయి. కాబట్టి ఈ రసాన్ని ప్రతిరోజు తాగడం వల్ల పుట్ట ఆరోగ్యంగా ఉండడమే కాకుండా శరీరంలోని రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. తీవ్ర కొలెస్ట్రాల్ సమస్యలతో బాధపడేవారు ప్రతిరోజు రెండు గ్లాసుల చొప్పున గోధుమ గడ్డి రసాన్ని తాగడం వల్ల సులభంగా మంచి ఫలితాలు పొందుతారు. అంతేకాకుండా కొలెస్ట్రాల్ పెరగడం కారణంగా వచ్చే గుండెపోటు మధుమేహం వంటి సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది.
గోధుమ గడ్డి రసాన్ని తయారు చేసుకోవడానికి ముందుగా ఒక కప్పు గోధుమ గడ్డిని తీసుకోవాల్సి ఉంటుంది. ఈ గడ్డిని బాగా శుభ్రం చేసుకొని గ్రైండర్ లో వేసి జ్యూస్ లా తయారు చేసుకోవాలి. ఆ తర్వాత ఇందులో కావాలనుకునేవారు జీలకర్ర, తేనెను మిక్స్ చేసుకొని రోజు ఉదయాన్నే ఖాళీగా అడుగుతో ఈ రసాన్ని తాగడం వల్ల శరీర బరువుతో పాటు ఇతర అనారోగ్య సమస్యల నుంచి ఉపసంహంలో లభిస్తుంది. వేగంగా బరువు తగ్గాలనుకునేవారు ఈ రసాన్ని రెండు పూటలా తాగాల్సి ఉంటుంది. ఉదయం ఖాళీ కడుపుతో ఒక గ్లాసు తీసుకొని.. ఆ తర్వాత రాత్రి లైట్ గా ఆహారాల తీసుకొని మరో గ్లాసు గోధుమ గడ్డి రసాన్ని తాగాల్సి ఉంటుంది.
ఇది కూడా చదవండి : Independence Day 2023: స్వతంత్ర భారతావనిలో టాప్ 10 కార్లు, బైకులు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3P3R74U
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి