Republic Day 2024 Highlights: 2024 జనవరి 26న గణతంత్ర దినోత్సవ వేడుకలను నిర్వహిస్తారు భారతీయులు. గణతంత్ర దినోత్సవాన్ని అంటే భారత రాజ్యాంగం అమలులోకి వచ్చిన రోజుగా జరుపుకుంటారు. నేడు దేశ రాజధాని ఢిల్లీలో వివిధ కార్యక్రమాలను నిర్వహింస్తారు. వేడుకల్లో భారత సైనిక, నావికా, వైమానిక దళాల విన్యాసాలు, పోలీసు, పారామిలిటరీ బృందాల ఎంతోగానో ఆకట్టుకోనున్నాయి. ఈ సారి ఫ్రెంచ్ సైన్యం కూడా పాల్గొనడం గొప్ప విశేషం.అయితే ఈసారి నిర్వహించే వేడుకల్లో ఎన్నో ఆసక్తికర అంశాలు ఉండనున్నాయి.
జనవరి 26న 2024 ఉదయం ఢిల్లీలోని విజయ్ చౌక్ నుంచి కర్తవ్య మార్గ్ వరకు పరేడ్‌తో గణతంత్ర దినోత్సవ కార్యక్రమాలు ప్రారంభం అవుతాయి. ఈ వేడుక చూడడానికి లక్ష మందికి పైగా ప్రత్యక్షంగా వీక్షించే అవకాశం కల్పిస్తున్నారు. దీని కోసం కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు.
ఈసారి గణతంత్ర వేడుకలకు ముఖ్య అథితి ఎవరు అంటే:
భారత గణతంత్ర వేడుకలకు ఫ్రెంచ్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్ ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు. తన పర్యటనలో భాగంగా ఇమ్మాన్యుయేల్ మన దేశంలోని అంబర్ ఫోర్ట్, జంతర్ మంతర్, హవా మహల్ వంటి చారిత్రాత్మక ప్రదేశాలను సందర్శించనున్నారు. అంతేకాకుండా జైపూర్‌లోనే ఆయన ప్రధాని మోదీతో భేటీ కానున్నారు. అనంతరం ఇద్దరూ కలిసి ఢిల్లీ చేరుకుంటారు. రిపబ్లిక్ డే పరేడ్‌లో పాల్గొంటారు. తర్వాత రాష్ట్రపతి భవన్లో భారత రాష్ట్రపతి ఇచ్చే ఎట్ హోమ్ రిసెప్షన్లో ఫ్రెంచ్ అధ్యక్షుడు పాల్గొంటారు.
మొదటి సారి మహిళా త్రివిధ దళాల పరేడ్:
2024 గణతంత్ర దినోత్సవ పరేడ్‌లో మొదటి సారిగా త్రివిధ దళాల నుంచి మహిళల బృందం పాల్గొంటుందని మేజర్ జనరల్ సుమిత్ మెహతా తెలిపారు. ఈ బృందంలో ఆర్మీ సహా ఇతర భద్రతా విభాగాలకు చెందిన మహిళా దళాలు ఉంటాయని చెప్పారు.
Also Read Happy Republic Day 2024: గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు, స్పెషల్ కోట్స్, వాట్సప్ పిక్స్, సందేశాలు..
చీరల ప్రదర్శన:
ఈ 2024 గణతంత్ర దినోత్సవ సందర్భంగా అనంత సూత్ర పేరిట ప్రత్యేక చీరల ప్రదర్శన చేయనున్నారు. దీని కోసం దేశం నలుమూలల నుంచి దాదాపు వేయి 900 రకాల చీరలు, చీరకట్టులను కార్యక్రమానికి వీచ్చేసిన ప్రేక్షకుల వెనక ప్రదర్శించనున్నారు. అయితే ఈ చీరలకు QR కోడ్లు ఉంటాయి. ఈ కోడ్‌ను స్కాన్ చేయడం వల్ల చీరకట్టు ఏ ప్రదేశానికి చెందినది, ఎంబ్రాయిడరీ పద్ధతుల గురించి వివరాలను తెలుసుకోవచ్చు.
గణతంత్ర దినోత్సవ పరేడ్‌లో AI:
ఈసారి వివిధ రంగాలలో AI పాత్రను చెప్పేందుకు పరేడ్‌లో ప్రత్యేక ప్రదర్శనను ఎలక్ట్రానిక్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేస్తుంది. పాఠశాల దశ నుంచే విద్యార్థులకు విద్యను అందించడానికి ఉపాధ్యాయులు VR హెడ్‌సెట్‌ని ఉపయోగించే దృశ్యాన్ని ప్రదర్శించనున్నట్లు తెలుస్తోంది.
చంద్రయాన్-౩ ప్రత్యేక ఆకర్షణ:
ISRO సాధించిన విజయాలు, చంద్రయాన్ -3 ఘనత ఈ సంవత్సరం గణతంత్ర దినోత్సవ పరేడ్‌లో ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది. అంతేకాకుండా చంద్రుని దక్షిణ ధృవంపై చంద్రయాన్-3 ల్యాండింగ్‌ను ప్రదర్శించనున్నారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Facebook, Twitter