అందుకే స్థూలకాయం నియంత్రిస్తే అన్ని వ్యాధులకు చెక్ పెట్టవచ్చని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. మనిషి ఆరోగ్యంగా ఉంటే ఏ విధమైన సమస్యలు దరిచేరవు. ఇదంతా ఆహారపు అలవాట్లపై ఆధారపడి ఉంటుంది. ఆహారం ఆరోగ్యంగా ఉంటే..శరీరం ఆరోగ్యం ఉంటుంది.
తీసుకునే ఆహారంలో ఫైబర్ పుష్కలంగా ఉండేట్టు చూసుకోవాలి. ఫైబర్ ఎక్కువగా ఆహారం తీసుకోవడం వల్ల బరువు నియంత్రణలో ఉండటమే కాకుండా..ఆరోగ్యంగా ఉంటారు. ఫైబర్ అధికంగా ఉండే ఆహారం తీసుకోవడం వల్ల ఎక్కువ సేపు కడుపు నిండినట్టుగా ఉండి..తిండి యావ తగ్గుతుంది. అంతేకాకుండా ఫైబర్ శరీరంలోని వ్యర్ధాలు, విష పదార్ధాలను బయటకు తొలగిస్తుంది. దాంతో కొవ్వు పేరుకుపోకుండా ఉంటుంది. ఎలాంటి ఫైబర్ పదార్ధాలు తినడం వల్ల బరువు నియంత్రణలో ఉంచుకోవచ్చో తెలుసుకుందాం..
యాపిల్
వాస్తవానికి ఫైబర్ అనేది అన్ని పండ్లలో ఉంటుంది. కానీ యాపిల్‌లో ఎక్కువ మోతాదులో ఉంటుంది. యాపిల్ ఆరోగ్యానికి చాలా మంచిది. దీనివల్ల బరువు నియంత్రణలో ఉంటుంది. స్థూలకాయం తగ్గుతుంది. బహుశా అందుకే వైద్యులు కూడా రోజుకొక యాపిల్ తినమని సూచిస్తుంటారు. ఒక యాపిల్‌తో 4 గ్రాముల బరువు తగ్గవచ్చు.
డ్రైఫ్రూట్
రోజూ తగినంత డ్రై ఫ్రూట్ తినడం వల్ల శరీరానికి తగిన మోతాదులో ఫైబర్ లభిస్తుంది. ఫైబర్ అధికంగా ఉండే డ్రై ఫ్రూట్స్ తినడం వల్ల బరువు తగ్గుతుంది. డ్రై ఫ్రూట్స్ విత్తనాలు కూడా బరువు తగ్గించేందుకు దోహదపడతాయి. సన్‌ఫ్లవర్ విత్తనాలు కూడా బరువు తగ్గడంలో అద్భుతంగా ఉపయోగపడతాయి.
బ్రోకలీ
గ్రీన్ వెజిటబుల్స్ ఆరోగ్యానికి చాలా చాలా మంచివి. ఇందులో ముఖ్యమైంది బ్రోకలీ. ఇందులో ఫైబర్ పెద్దమొత్తంలో ఉంటుంది. బ్రోకలీ బరువు తగ్గించడంలో అద్భుతంగా ఉపయోగపడుతుంది. ఒక కప్పు బ్రోకలీలో 31 కేలరీలుంటాయి. శరీరానికి 2.4 గ్రాముల ఫైబర్ లభిస్తుంది.
పాలకూర
పాలకూరలో ఐరన్ ఒక్కటే కాకుండా ఫైబర్ కూడా అధిక మోతాదులో ఉంటుంది. పాలకూర తినడం వల్ల కడుపు నిండుగా ఉన్నట్టుంటుంది. ఎక్కువసేపు ఆకలి వేయదు. పాలకూరలో విటమిన్ ఎ, విటమిన్ సి, విటమిన్ కే, ఫోలేట్, మెగ్నీషియం పుష్కలంగా ఉంటాయి. శరీరానికి చాలా ప్రయోజనం కలుగుతుంది.
Also read: Heart Health: ఈ సప్లిమెంట్స్‌తో గుండె సమస్యలకు శ్వాశతంగా చెక్ పెట్టొచ్చు!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook