Weight Loss Roti Recipe In Telugu: రాగి పిండితో తయారుచేసిన చపాతీలు రోజు తినడం వల్ల ఏం జరుగుతుందో తెలుసా? చాలామంది వీటిని ఎక్కువగా తినడం వల్ల అనేక రకాల దుష్ప్రభావాలు కలుగుతాయని తినడం మానుకుంటారు. నిజానికి రాగి పిండితో తయారుచేసిన చపాతీలు రోజు తినడం వల్ల శరీరానికి బోలెడు లాభాలు కలుగుతాయి. ఇందులో అధిక పరిమాణంలో ఫైబర్ తో పాటు వివిధ రకాల పోషకాలు లభిస్తాయి. కాబట్టి రోజు తినడం వల్ల రక్తంలోని చక్కెర పరిమాణాలు కూడా నియంత్రణలో ఉంటాయి. అలాగే శరీర బరువును తగ్గించడానికి కూడా కీలక పాత్ర పోషిస్తుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఇందులో ఉండే కొన్ని మూలకాలు గుండె సమస్యల నుంచి విముక్తి కలిగించేందుకు కూడా సహాయపడతాయి. ఇవే కాకుండా రాగి పిండితో తయారు చేసిన చపాతీలు తినడం వల్ల ఇతర లాభాలు కూడా కలుగుతాయి.
రాగి పిండి చపాతీలు తినడం వల్ల కలిగే లాభాలు:
మధుమేహాన్ని నియంత్రిస్తుంది:
ప్రతిరోజు రాగి పిండి తో తయారు చేసిన చపాతీలను తినడం వల్ల శరీరంలోని చక్కెర పరిమాణాలు కూడా తగ్గుతాయి. అంతేకాకుండా ఇందులో ఉండే ఫైబర్ మధుమేహాన్ని నియంత్రించేందుకు కూడా కీలకపాత్ర పోషిస్తుంది. దీంతోపాటు రోజు ఉదయం వీటిని తినడం వల్ల బోలెడు లాభాలు కలుగుతాయి.
బరువు తగ్గడానికి:
రాగి పిండిలోని ఫైబర్ ఎక్కువ మోతాదులో ఉంటుంది. కాబట్టి రోజు ఈ పిల్లి తో తయారు చేసిన చపాతీలు తినడం వల్ల సులభంగా బరువు తగ్గుతారు. అంతేకాకుండా బెల్లీ ఫ్యాట్ కూడా నియంత్రణలో ఉంటుంది.
గుండె సమస్యలకు చెక్:
రాగి పిండిలోని చపాతీల్లో మెగ్నీషియం ఉంటుంది. ఇది రక్తపోటు నియంత్రించేందుకు కీలక పాత్ర పోషిస్తుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. దీని కారణంగా గుండె సమస్యలు కూడా రాకుండా ఉంటాయని నిపుణులు తెలుపుతున్నారు.
జీర్ణక్రియ సమస్యలకు చెక్:
రాగి పిండిలో ఫైబర్ కూడా ఎక్కువగా ఉంటుంది. రోజు ఈ పిండితో చేసిన రోటీలు తినడం వల్ల జీర్ణ క్రియ మెరుగుపడుతుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఇందులో ఉండే గుణాలు మలబద్దకాన్ని తగ్గించేందుకు కూడా కీలక పాత్ర పోషిస్తాయి.
ఇది కూడా చదవండి: 2024 Bajaj Pulsar N250: మార్కెట్‌లోకి కొత్త పల్సర్ N250 వచ్చేసింది.. ఫీచర్స్, స్పెషిఫికేషన్స్ ఇవే!
రక్తహీనత సమస్యలు తగ్గడానికి..:
రాగి పిండి చపాతీల్లో ఐరన్ పుష్కలంగా లభిస్తుంది. రక్తహీనత సమస్యలను తగ్గించేందుకు ఎంతగానో సహాయపడుతుంది అంతే కాకుండా ఇందులో లభించే క్యాల్షియం ఎముకలను దృఢంగా చేసేందుకు ఎంతగానో సహాయపడుతుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.
చర్మ సమస్యలు:
రాగి పిండి చపాతీలు ప్రతిరోజు తినడం వల్ల చర్మ సమస్యలు కూడా తగ్గుతాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఇందులో ఉండే గుణాలు చర్మంపై మచ్చలను తగ్గించేందుకు కూడా కీలక పాత్ర పోషిస్తాయి. తరచుగా చర్మ సమస్యలతో బాధపడుతున్న వారు తప్పకుండా రాగి పిండి చపాతీలను తినండి.
ఇది కూడా చదవండి: 2024 Bajaj Pulsar N250: మార్కెట్‌లోకి కొత్త పల్సర్ N250 వచ్చేసింది.. ఫీచర్స్, స్పెషిఫికేషన్స్ ఇవే!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.