Water Deficiency In Human Body: వేసవి రాకముందే వాతావరణంలో ఉష్ణోగ్రతలు వేగంగా పెరగడం ప్రారంభమయ్యాయి. దీని కారణంగా చాలా మంది శరీరాల్లో నీటి కోరత సమస్యలు వస్తాయి. అంతేకాకుండా కొందరిలో పొట్ట సమస్యలు వచ్చే అవకాశాలున్నాయని కాబట్టి తప్పకుండా శరీరం హైడ్రేట్‌గా ఉండడానికి ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాల్సి ఉంటుంది. బాడీ డిహైడ్రేషన్‌కు ఒక్క సారి గురైతే నాడీ సమస్యలకు కూడా దారీ తీసే అవకాశాలున్నాయి. కాబట్టి ఇలాంటి సమస్యల నుంచి సులభంగా ఉపశమనం పొందడానికి పలు రకాల ఇంటి చిట్కాలు పాటించాల్సి ఉంటుంది. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.
ఈ 3 గంటలో శరీరాన్ని హైడ్రేట్ చేస్తాయి:
1. నిమ్మకాయ షికంజీ:
నిమ్మకాయ షికంజీలో సోడియం అధికంగా ఉంటుంది. కాబట్టి దీనిని వేసవి కాలంలో తీసుకోవడం వల్ల శరీర నిర్జలీకరణాన్ని తొలగించడానికి సహాయపడుతుంది. అంతేకాకుండా మూత్రవిసర్జన
సమస్యల నుంచి కూడా ఉపశమనం కలిగిస్తుంది. దీంతో శరీరంలో నీటి కోరత పరిమాణాలు కూడా పెరుగుతాయి.
2. దోసకాయ రసం:
దోసకాయ రసం శరీరంలో డీహైడ్రేషన్ సమస్యల నుంచి ఉపశమనం కలిగిస్తుంది. అంతేకాకుండా ఈ రసాన్ని ప్రతి రోజూ తాగడం వల్ల చర్మ సమస్యలు కూడా సులభంగా దూరమవుతాయి. ఈ రసాన్ని క్రమం తప్పకుండా తాగడం వల్ల శరీరంలో కణాలు కూడా హైడ్రేట్‌గా మారుతాయి. అంతేకాకుండా చర్మాన్ని నిర్విషీకరణ చేయడానికి కూడా కీలక పాత్ర పోషిస్తుంది. కాబట్టి ఈ రసాన్ని క్రమం తప్పకుండా తాగాల్సి ఉంటుంది.
3. మారేడు పండు జ్యూస్:
మారేడు పండు జ్యూస్‌ను ప్రతి రోజూ తాగడం వల్ల శరీరంలో చాలా రకాల అనారోగ్య సమస్యలు దూరమవుతాయి. అంతేకాకుండా కడుపుకు చల్లదనాన్ని కూడా ఇస్తుంది. ముఖ్యంగా ప్రేగు సమస్యలతో బాధపడుతున్నవారు ప్రతి రోజూ ఈ జ్యూస్‌ను తాగడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు. అంతేకాకుండా శరీరంలో నీటి కోరత కూడా పెరుగుతుంది. కాబట్టి డీహైడ్రేషన్ సమస్యలతో బాధపడేవారు తప్పకుండా ఈ జ్యూస్‌ను తాగాల్సి ఉంటుంది.
(నోట్: ఇక్కడ ఇవ్వబడిన సమాచారం ఇంటి నివారణలు, సాధారణ సమాచారంపై ఆధారపడి ఉంటుంది. దానిని స్వీకరించే ముందు తప్పనిసరిగా వైద్య సలహా తీసుకోవాలి. ZEE NEWS దానిని ధృవీకరించలేదు.)
Also read: Apple iPhone 13, iPhone 14: యాపిల్ ఐఫోన్ కొనేవారికి హోలీ పండగ బంపర్ ఆఫర్
Also read: Apple iPhone 13, iPhone 14: యాపిల్ ఐఫోన్ కొనేవారికి హోలీ పండగ బంపర్ ఆఫర్
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook