Oily Skin: ఆయిలీ స్కిన్ ఉన్నవారు మాయిశ్చరైజర్ ఈ విధంగా రాయండి.. ముఖం మెరిసిపోతుంది..

Oily Skin: మాయిశ్చరైజర్ అప్లై చేయడం వల్ల చర్మం హైడ్రేట్ గా ఉండి మెరుస్తుంది. మీ చర్మం రకం ఎలా ఉన్నా, ప్రతి చర్మానికి మాయిశ్చరైజర్ చాలా ముఖ్యం.

Written by - Renuka Godugu | Last Updated : Jan 27, 2024, 12:04 PM IST
Oily Skin: ఆయిలీ స్కిన్ ఉన్నవారు మాయిశ్చరైజర్ ఈ విధంగా రాయండి.. ముఖం మెరిసిపోతుంది..

Oily Skin: ఆయిల్ స్కిన్‌ ఉన్నవారు మాయిశ్చరైజర్‌ అప్లై చేస్తే ముఖం మరింత జిడ్డుగా మారుతుందనే అపోహ ఉంది. అయితే మాయిశ్చరైజర్ అప్లై చేయకపోతే చర్మం హైడ్రేషన్ కోసం ఎక్కువ నూనెను ఉత్పత్తి చేస్తుందని చర్మ సంరక్షణ నిపుణులు అంటున్నారు. దీంతో చర్మం నల్లగా కనిపించడం ప్రారంభమవుతుంది.

మాయిశ్చరైజర్ అప్లై చేయడం వల్ల చర్మం హైడ్రేట్ గా ఉండి మెరుస్తుంది. మీ చర్మం రకం ఎలా ఉన్నా, ప్రతి చర్మానికి మాయిశ్చరైజర్ చాలా ముఖ్యం. అన్నింటిలో మొదటిది, చర్మంపై మాయిశ్చరైజర్ ఎందుకు ఉపయోగించాలో తెలుసుకోవడం ముఖ్యం. చర్మంలో తేమ లేకపోవడం వల్ల మొటిమలు, పొడిబారడం లేదా ఇతర సమస్యలు మొదలవుతాయి. 

ముఖ్యంగా మాయిశ్చరైజర్‌ ఎంచుకునేటప్పుడు చర్మ రకాన్ని గుర్తుంచుకోండి. జిడ్డుగల చర్మానికి జెల్ ఉత్పత్తులు ఉత్తమం. జిడ్డు చర్మం ఉన్నవారు రాత్రి పడుకునే ముందు మాయిశ్చరైజర్ రాసుకుంటే మంచిదని నిపుణులు చెబుతున్నారు. చర్మాన్ని శుభ్రం చేసి, ఆపై జెల్ ఆధారిత మాయిశ్చరైజర్‌ను అప్లైచేయండి. ఇలా చేయడం వల్ల చర్మం హైడ్రేటెడ్ గా ఉంటుంది.

ఇదీ చదవండి:​ Stomach Cancer Symptoms: కడుపు కేన్సర్ తో సంగీత దర్శకుడు ఇళయరాజా కూతురి మృతి.. లక్షణాలు, చికిత్స విధానం తెలుసుకుందాం..

మారుతున్న వాతావరణం వల్ల జిడ్డు చర్మం ఏర్పడుతుంది. అయితే, ఇది నిరంతరం జరిగితే మొటిమల సమస్య  వల్ల కూడా కావాచ్చు. మీరు మచ్చలతో మీ చర్మాన్ని పాడు చేసుకోకూడదనుకుంటే చర్మానికి ప్రత్యేక శ్రద్ధ వహించండి. సాధారణంగా కఫ దోషం వల్ల చర్మం జిడ్డుగా మారుతుందని ఆయుర్వేదం చెబుతోంది. సెబమ్ ఉత్పత్తి అధికంగా పెరగడం వల్ల ముఖరంధ్రాల ద్వారా ముఖంపైకి రావడం ప్రారంభమవుతుంది. 
 

ఇదీ చదవండి: Blood Pressure: BP అదుపు తప్పకూడదంటే సోడియం, పొటాషియం ఈ మోతాదును మించకూడదు..

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter

Trending News