Tulasi Water benefits on Empty Stomach: ఉదయం పరగడుపున గోరువెచ్చని తులసి నీటిని తాగడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి. ఇందులో యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీ ఆక్సిడెంట్, యాంటీ బ్యాక్టీరియాల్ గుణాలు ఉంటాయి. తులసిని పరమ పవిత్రంగా హిందూమతంలో పూజిస్తారు. ఇది అందరి ఇళ్లలో అందుబాటులో ఉంటుంది. దీంతో ఆరోగ్యపరంగా కూడా ఎన్నో ప్రయోజనాలు ఉంటాయి. తులసి ఆరోగ్యకరమైన బరువు నిర్వహణకు కూడా తోడ్పడుతాయి. ఇందులో ఉండే అడాప్టోజెనీక్ గుణాలు స్ట్రెస్ నుంచి ఉపశమనం కలిగిస్తాయి.
తులసి నీటిలో తక్కువ మోతాదులో యాసిటీ ఉంటుంది. ఇది జీర్ణ వ్యవస్థను బలపరుస్తుంది. రక్తంలో షుగర్ లెవెల్స్ ని నియంత్రిస్తుంది. అంతేకాదు ఇది ఆరోగ్యప్రయంగా మరిన్ని ప్రయోజనాలు ఉంటాయి. ఇది సీజనల్ వ్యాధుల నుంచి కాపాడుతుంది ఇమ్యూనిటీ వ్యవస్థని బలపరుస్తుంది. తులసి వాటర్ ని తరచూ తీసుకోవడం వల్ల జలుబు, రొంప సమస్యలు కూడా రావు.
స్ట్రెస్..
తులసిలో యాంటీ ఇన్ఫ్లమెంటరీ, యాంటీ స్టిములేషన్ గుణాలు కలిగి ఉండటం వల్ల ఇది స్ట్రెస్ నుంచి ఉపశమనం అందించే ఏజెంట్‌గా పని చేస్తుంది. స్ట్రెస్ నిర్వహిస్తుంది ఇది కార్టన్స్ లెవెల్స్ ని నియంత్రిస్తుంది ఇది యాంగ్జైటీ, ఎమోషనల్ స్ట్రెస్ తగ్గిస్తుంది అని ఎన్ హెచ్ నివేదిక తెలిపింది.
క్యాన్సర్ కు వ్యతిరేకం..
తులసిలో యుగనల్ అనే కాంపౌండ్ ఉంటుంది. ఇది క్యాన్సర్ కి వ్యతిరేకంగా పోరాడుతుంది. తులసి నీటిని పరగడుపున తీసుకోవడం వల్ల బ్రెస్ట్ క్యాన్సర్, ధర్మోజనీసిటి ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ కణాలకు వ్యతిరేకంగా పోరాడుతుంది.
ఇదీ చదవండి: రాగి పిండి రోటీ మధుమేహ వ్యాధిగ్రస్తులకు వరం.. రక్తంలో చక్కెరస్థాయిలు హఠాత్తుగా పెరగవు..!
షుగర్ నిర్వహణ..
తులసిలో యాంటీ డయాబెటిక్ గుణాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి రక్తంలో చక్కెర స్థాయిలను నిర్వహిస్తాయి. ఇవి ఫైటో కెమికల్ కాంపోనెంట్స్ కలిపి ఉండటం వల్ల టైప్ 2 డయాబెటిస్ వారికి మంచిది ఇంట్లో కాంపోనెంట్ ట్రైటోపిన్స్ ఫ్లేవర్ ఆయిల్స్ ఉంటాయి. షుగర్ పేషెంట్లు తులసి నీటిని ఉదయం పరగడుపున తీసుకోవడం మంచిదని ఎన్ఐహెచ్ నివేదిక తెలిపింది.
బరువు తగ్గడం..
తులసి నీటిని పరగడుపున ఉదయం తీసుకోవడం వల్ల కొలెస్ట్రాల్, బ్లడ్ షుగర్ రెండు నియంత్రించబడతాయి. బరువు కూడా పెరగకుండా ఉంటుంది. వెయిట్ లాస్ జర్నీలో ఉండేవారు పరగడుపున తులసి నీటిని గోరువెచ్చని నీటిలో తీసుకోవడం మేలు.
ఇదీ చదవండి: ఈ 7 మార్నింగ్ ఆహారాలతో యూరిక్ యాసిడ్, గౌట్, కిడ్నీ సమస్యలు కూడా మాయం..
ఇమ్యూనిటీ బూస్ట్..
తులసి ఆకులను నమిలిన మామూలు జలుబు జ్వరం కూడా తగ్గిపోతుంది. తులసి ఆకులను వేడి నీటిలో వేసి ఈ వర్షాకాలంలో తీసుకోవడం వల్ల ఇమ్యూనిటీ వ్యవస్థ బలపడుతుంది. సీజనల్ జబ్బులు రాకుండా ఉంటాయి తులసి ఆకులు యాలకులు వేసి తీసుకోవడం వల్ల ఫీవర్ జ్వరం తగ్గిపోతుంది జలుబు దగ్గు, రొంప వంటివి కూడా మీ దరిదాపుల్లోకి రావు.(Disclaimer: ఈ కథనం ఇంటర్నేట్లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రాసినది. Zee News Media కి దీనిని ధృవీకరించడం లేదు. )
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి