మహారాష్ట్రలోని ( Maharastra ) హింగోలి జిల్లాలోని ఒక గ్రామ ప్రజలు తమను తాము శ్రీకృష్ణుడి ( Sri Krishna ) వంశస్తులుగా చెబతారు. అందుకే పాలను అమ్మరు అని... అవసరం ఉన్నవారికి ఉచితంగా ఇస్తామంటారు. మహారాష్ట్రలో ఎంతో మంది నేతలు, రైతులు పాల ధర పెంచాలని డిమాండ్ చేస్తూ నిరసనలు చేశారు. రోడ్డుపై వేల లీటర్ల పాలను పారేశారు. అదే సమయంలో యేలాగావ్ ( Yelegaon in Maharastra ) అనే గ్రామంలో గ్రమ ప్రజలు ఇప్పటి వరకు అసలు పాలే అమ్మలేదట. అలాతే ప్రతీ ఇంట్లో పశుసంపద తప్పకుండా ఉంటుందట.
Krishastami Look: మీ చిన్నారిని కృష్ణుడిలా రెడీ చేయాలి అనుకుంటున్నారా ? ఇది చదవండి!
ఈ గ్రామానికి చెందిన రాజాభావు మండాడే (60) మాట్లాడుతూ" యేలాగావ్ గావ్లీ అంటే ఇక్క పాల నగరం అని. మేము శ్రీకృష్ణుడి వంశస్తులుగా ( Sri Krishna Vansh ) భావిస్తాం. అందుకే మేము పాలు అమ్మం " అని తెలిపారు. గ్రామంలో సుమారు 90 శాతం మంది ఇంట్లొ ఆవులు, గేదెలు, గొర్రెలు ఉంటాయి అని ఇక్కడమ పాలు అమ్మక పోవడం అనేది అనాధిగా కొనసాగుతోంది అని తెలిపారు. పాలు ఎక్కువగే ఉంటే వాటితో ఇతర పాల ఉత్పత్తులు ( Milk Products ) తయారు చేస్తారట. అంతే కాని చుక్క పాలు కూడా ఎవరికీ అమ్మరట. అవసరం ఉన్న వారికి ఉచితంగా అందిస్తారట.
Bhagavad Gita Lessons: కురుక్షేత్రంలో శ్రీకృష్ణుడు అర్జునుడికి చెప్పిన 10 జీవిత సత్యాలు
శ్రీకృష్ణ జన్మష్టామి వేడుకలను ( Sri Krishna Janmastami ) మొత్తం గ్రామ ప్రజలు ఎంతో వేడుకగా నిర్వహించుకునే వారు అని..ఈ సారి కరోనావైరస్ (Covid-19 ) నేపథ్యంలో ఈ ఏడాది వేడకలకు దూరంగా ఉంటున్నాం అని తెలిపారు గ్రామ ప్రజలు.
Independence Day 2020: ఇది 73 స్వాత్రంత్ర్య దినోత్సవమా.. లేదా 74 ? తెలుసుకుందాం..