How To Make Coconut Water Face Mist: కొబ్బరి నీళ్లలో విటమిన్ సి, ప్రొటీన్, యాంటీ ఆక్సిడెంట్లు అధిక పరిమాణంలో లభిస్తాయి. ఇవి శరీర ఆరోగ్యానికే కాకుండా ముఖంపై మొటిమలు, నల్ల మచ్చల నుంచి సులభంగా ఉపశమనం కలిగిస్తుందని ఆయుర్వేద నిపుణులు సూచిస్తున్నారు. అయితే ముఖంపై గ్లో స్కిన్ కోసం ప్రతి రోజూ కొబ్బరి నీళ్లతో తయారు చేసిన ఫేస్ మిస్ట్‌ను వినియోగించాల్సి ఉంటుంది. దీనిని వినియోగించడం వల్ల చర్మంపై నల్లటి వలయాలు సమస్యలు కూడా దూరమవుతాయి. ఇందేలో ఉండే గుణాలు చర్మానికి లోతైన పోషణను అందించడానికి సహాయపడుతుంది. కాబట్టి తప్పకుండా మీరు కొబ్బరి నీళ్ల మిస్ట్‌ని వినియోగించాల్సి ఉంటుంది. అయితే దీనిని ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.
కొబ్బరి నీళ్ల మిస్ట్ తయారు చేయడానికి కావలసిన పదార్థాలు:
ఒక కప్పు కొబ్బరి నీరు
దోసకాయ ముక్కలు
తయారీ పద్దతి:
కొబ్బరి నీళ్లను ఫేస్ మిస్ట్ చేయడాని..ముందుగా దోసకాయ తీసుకోండి.
తర్వాత బాగా కడిగి తురుముకోవాలి.
ఆ తర్వాత అందులోంచి రసాన్ని తీసి ఒక గిన్నెలో ఉంచండి.
తర్వాత అందులో ఒక కప్పు కొబ్బరి నీళ్లు కలపండి.
ఇలా ఆ రెండు రసాలను బాగా మిక్స్ చేసుకోవాలి.
తర్వాత స్ప్రే బాటిల్‌లో నింపి ఫ్రిజ్‌లో పెట్టుకుని, రాత్రి పూట వినియోగిస్తే మంచి ఫలితాలు పొందుతారు.
(నోట్: ఇక్కడ ఇవ్వబడిన సమాచారం ఇంటి నివారణలు, సాధారణ సమాచారంపై ఆధారపడి ఉంటుంది. దానిని స్వీకరించే ముందు తప్పనిసరిగా వైద్య సలహా తీసుకోవాలి. ZEE NEWS దానిని ధృవీకరించలేదు.)
ఇది కూడా చదవండి : Revanth Reddy: పొద్దునలేస్తే రాత్రి వరకు కేటీఆర్ సినిమా వాళ్లతోనే.. సమంత సోకులు మాకొద్దు: రేవంత్ రెడ్డి తీవ్ర విమర్శలు
ఇది కూడా చదవండి : Jaggareddy Interesting Comments: సీఎం కేసీఆర్‌ని కలిస్తే తప్పేంటన్న జగ్గారెడ్డి
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
యాపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook