Sugar Free Drinks For Diabetics: వేసవిలో డయాబెటిస్‌ రోగులకు ఈ డ్రింక్స్‌ ఎంతో మేలు చేస్తాయి..

Homemade Drinks For Diabetics: వేసవిలో డయాబెటిస్ వ్యాధిగ్రస్తులకు ఈ డ్రింక్స్‌ ఎంతో మేలు చేస్తాయి. వీటిని తీసుకోవడం వల్ల ఆరోగ్యానికి ఎలాంటి ఆరోగ్య సమస్యలు కలగకుండా ఉంటాయి. 

Written by - ZH Telugu Desk | Last Updated : Apr 22, 2024, 04:41 PM IST
Sugar Free Drinks For Diabetics: వేసవిలో డయాబెటిస్‌ రోగులకు ఈ డ్రింక్స్‌ ఎంతో మేలు చేస్తాయి..

Homemade Drinks For Diabetics: డయాబెటిస్‌ అనేది సాధారణమైన సమస్య. కానీ ఈ సమస్య ఉన్నప్పుడు ఆహారం పట్ల ఎన్నో జాగ్రత్తలను తీసుకోవాల్సి ఉంటుంది. డయాబెటిస్‌ ఉన్నవారు తీపి, కారం, ఉప్పు పదార్థాలను తీసుకోకుండా ఉండాలి. అయితే కొన్ని ఆహార పదార్థాలను మాత్రం మీరు తప్పకుండా తీసుకోవాల్సి ఉంటుంది. అందులో కొన్ని రకాల జ్యూస్‌లు. వీటిని మీరు ఇంట్లోనే ఎంతో సులభంగా తయారు చేసుకోవచ్చు. దీని కోసం మీరు ఎక్కువగా ఖర్చు చేయాల్సిన అవసరం లేదు. దీని వల్ల షుగర్‌ లెవల్స్‌ కూడా అదుపు ఉంటుంది. 

మెంతులను రాత్రిపూట నీటిలో నానబెట్టుకోవాలి. ఉదయం పరగడుపున ఈ నీరు తీసుకోవడం వల్ల  షుగర్‌ లెవల్స్‌ నియంత్రించడంలో సహాయపడుతుంది. దీంతో పాటు ఉసిరి, కలబంద, తెనె, మిరియాలు అన్ని కలిపి జ్యూస్ చేసుకోవాలి. దీనిని తీసుకోవడం వల్ల ఇన్సులిన్‌ లెవల్స్ తగ్గుతాయి. శరీరం దృఢంగా ఉంటుంది. వేసవికాలంలో డయాబెటిస్‌ తప్పకుండా తీసుకోవాల్సి డ్రింక్‌లో ఇది ఒకటి. ఇందులో మీరు చియా గింజలు, నిమ్మకాయ రసం కలిపి తీసుకోవడం వల్ల వేసవిలో అలసట, నీరసం, షుగర్‌ లెవల్స్‌ కంట్రోల్‌లో ఉంటుంది. వేడి నీటిలో తులసి ఆకులు, కొద్దిగా అల్లం, నిమ్మరసం కలిపి తీసుకోవడం వల్ల షుగర్ కంట్రోల్‌లో ఉంటుంది. డయాబెటిస్‌ అదుపులో పెట్టుకునేందుకు ధనియాలు ఎంతో ఉపయోగపడుతాయి. అలాగే పాలకూర, మెంతికూరతో రసం తీసుకోవడం వల్ల ఆరోగ్యానికి ఎంతో మేలు కలుగుతుంది. టమాటో జ్యూస్ కూడా డయాబెటిస్‌ వ్యాధిగ్రస్తులకు ఎంతో మేలు చేస్తుంది. ఇందులో అనేక రకాల విటమిన్‌లు, మినరల్స్‌ ఉంటాయి. 

ఈ విధంగా మీరు డయాబెటిస్‌ జ్యూస్‌లను తీసుకోవడం వల్ల షుగర్ లెవల్స్‌ను అదుపులో ఉంచుకోవచ్చు. డయాబెటిస్‌ ఉన్నవారు వేసవిలో చల్లటి పదార్థాలు తీసుకోవాల్సి ఉంటుంది. దీంతో పాటు తృణధాన్యాలతో తయారు చేసే జావ, మజ్జిగ వంటి పదార్థాలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది.  మీరు కూల్‌ డ్రింక్స్‌, కొవ్వు ఎక్కువగా ఉండే పదార్థాలు, అతిగా వేయించిన ఆహారపదార్థాలు, షుగర్‌ ఎక్కువగా ఉండే ఆహారపదార్థాలను తీసుకోకపోవడం చాలా మంచిది. ఎల్లపుడు వైద్య పరీక్షలు చేయించుకోవడం. టైమ్‌కు మందులను వేసుకోవడం చాలా మంచిది. దీంతో పాటు వాకింగ్‌ చేయడం చాలా అవసరం. అలాగే నిద్ర సరిగా పోవడం కూడా ముఖ్యం. ఈ విధంగా మీరు జాగ్రత్తలు తీసుకోవడం వల్ల ఎలాంటి సమస్యల బారిన  పడకుండా ఉండవచ్చు. 

Also Read 2024 Bajaj Pulsar N250: మార్కెట్‌లోకి కొత్త పల్సర్ N250 వచ్చేసింది.. ఫీచర్స్‌, స్పెషిఫికేషన్స్‌ ఇవే!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News