Remedies for Hair Fall in Summer: జుట్టు రాలడం లేదా తెల్ల జుట్టు సమస్యలా..? ఈ 4 ఆహారాలతో సులభంగా చెక్ పెట్టొచ్చు

Solution for Summer Hair Problems: కాలుష్యం పెరగడం కారణంగా జుట్టు సమస్యలతో బాధపడేవారు సూచించిన ఈ క్రింది ఆహారాలను ప్రతిరోజు తీసుకోవాల్సి ఉంటుంది. ఇందులో ఉండే గుణాలు తెల్ల జుట్టును కూడా నల్లగా చేసేందుకు సహాయపడతాయి.

Written by - Dharmaraju Dhurishetty | Last Updated : May 31, 2023, 06:46 PM IST
Remedies for Hair Fall in Summer: జుట్టు రాలడం లేదా  తెల్ల జుట్టు సమస్యలా..? ఈ 4 ఆహారాలతో సులభంగా చెక్ పెట్టొచ్చు

Remedies for Hair Fall in Summer: వేసవిలో వాతావరణంలో కాలుష్యం పెరిగిపోతుంది. దీని కారణంగా చాలామందిలో జుట్టు రాలడం, పొడి జుట్టు, జుట్టు చివరన చిట్లిపోవడం వంటి సమస్యలు వస్తూ ఉంటాయి. ఇలాంటి సమస్యల కారణంగా జుట్టు అందహీనంగా తయారవుతుంది. ఇలాంటి సమస్యల నుంచి ఎంత తొందరగా ఉపశమనం పొందితే అంత మంచిది.

లేకపోతే జుట్టు మొత్తం రాలిపోయి బట్ట తల వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఇలాంటి సమస్యల నుంచి ఉపశమనం పొందడానికి, జుట్టు దృఢంగా అవ్వడానికి.. మేము ఈరోజు కొన్ని ఆరోగ్యకరమైన ఆహారాలను మీకు తెలుపబోతున్నాం. వీటిని ప్రతిరోజు అల్పాహారంలో భాగంగా తీసుకోవడం వల్ల జుట్టు సమస్యలు తగ్గడమే కాకుండా దీర్ఘకాలిక వ్యాధుల నుంచి కూడా ఉపశమనం లభిస్తుంది. 

ఆహారాలు తీసుకుంటే జుట్టు దృఢంగా మారుతుంది:
క్యారెట్ తో తయారుచేసిన ఆహారాలు అల్పాహారంలో భాగంగా ప్రతిరోజు తీసుకోవడం వల్ల సులభంగా జుట్టు సమస్యలకు చెక్ పెట్టొచ్చు. ఇందులో లభించే విటమిన్ ఏ జుట్టును మృదువుగా మెరిసేలా తయారు చేసేందుకు సహాయపడుతుంది. కాబట్టి తరచుగా జుట్టు రాలడం, తీవ్ర జుట్టు సమస్యలతో బాధపడుతున్న వారు క్యారెట్ ను ఆహారంలో తీసుకోవాల్సి ఉంటుంది

అవోకాడో కూడా జుట్టు సమస్యలకు ప్రభావంతంగా సహాయపడుతుంది. ఈ పండుతో తయారుచేసిన నూనె జుట్టుకు తరచుగా వినియోగించడం వల్ల తెల్ల జుట్టు సమస్యలు సులభంగా దూరమవుతాయి. అంతేకాకుండా జుట్టు రాలడం, పొడి జుట్టు సమస్యల నుంచి సులభంగా ఉపశమనం కలిగిస్తాయి. అంతేకాకుండా ఈ పండులో విటమిన్ ఇ లభిస్తుంది. దీనిని క్రమం తప్పకుండా వినియోగించడం వల్ల అన్ని రకాల ఆరోగ్య సమస్యలు దూరమవుతాయి.

Also Read: CSK Vs GT Rain Updates: ఫైనల్‌ మ్యాచ్‌కు వరుణుడి దెబ్బ.. పూర్తి సమీకరణలు ఇలా..

ప్రోటీన్లు అధిక పరిమాణంలో ఉండే గుడ్లను కూడా ప్రతిరోజు ఆహారంలో తీసుకోవాల్సి ఉంటుంది. ఇవి జుట్టును వేగంగా పెంచేందుకు సహాయపడతాయి. ఇందులో బయోటిన్, విటమిన్ డి3, విటమిన్ బి, ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ అధిక పరిమాణంలో లభిస్తాయి. కాబట్టి ప్రతిరోజు ఆహారంలో గుడ్లను తీసుకోవడం వల్ల అన్ని రకాల దీర్ఘకాలిక వ్యాధుల నుంచి ఉపశమనం లభిస్తుంది.

చేపలు కూడా శరీరానికి జుట్టుకు చాలా మంచివి. ఇందులో బయోటిన్ అధిక పరిమాణంలో ఉంటుంది. జుట్టును మరిపించేందుకు, మృదువుగా తయారు చేసింది కీలక పాత్ర పోషిస్తుంది. అంతేకాకుండా పొడవైన జుట్టును అందించింది సహాయపడుతుంది. తరచుగా జుట్టు రాలడం సమస్యలతో బాధపడుతున్న వారు తప్పకుండా చేపలను ఆహారంలో తీసుకోవాల్సి ఉంటుంది.

(నోట్: ఇక్కడ అందించిన సమాచారం సాధారణ సమాచారంపై ఆధారపడి ఉంటుంది. దానిని స్వీకరించే ముందు తప్పనిసరిగా వైద్య సలహా తీసుకోవాలి. ZEE NEWS దానిని ధృవీకరించలేదు.)

Also Read: CSK Vs GT Rain Updates: ఫైనల్‌ మ్యాచ్‌కు వరుణుడి దెబ్బ.. పూర్తి సమీకరణలు ఇలా..

 స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook

Trending News